కర్నూలు: రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిని పోలీసులు గృహనిర్బంధం చేశారు. తంగడంచ పరిశ్రమల కోసం చేపడుతున్న భూసేకరణకు వ్యతిరేకంగా.. ఇవాళ తంగడంచ నుంచి కర్నూలు వరకూ పాదయాత్ర చేసేందుకు బైరెడ్డి సన్నాహాలు చేశారు. కాగా.. ఉద్రిక్తతలు తలెత్తకుండా.. పాదయాత్ర ప్రారంభానికి ముందే ఆయన్ని పోలీసులు గృహనిర్భంధం చేశారు. దీంతో ఆయన ఇంట్లోనే దీక్షకు దిగారు. బెరైడ్డి అరెస్టును నిరసిస్తూ పలువురు జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. 44వ జాతీయ రహదారిపై రాస్తారాకో చేశారు.
బైరెడ్డి అరెస్టుకు నిరసన
Published Mon, Sep 14 2015 10:04 AM | Last Updated on Sun, Sep 3 2017 9:24 AM
Advertisement
Advertisement