‘సీఏ విద్య ఇక సులభతరం!’
మలక్‌పేట (హైదరాబాద్): సీఏ విద్య సులభతరం కానున్నదని, కోర్సు సిలబస్, కాలపరిమితి మారనుందని దిల్సుఖ్నగర్ మాస్టర్‌మైండ్ ఇన్స్టిట్యూట్ ఇన్చార్జి ఎస్. వెంకటేశ్వర్రావు తెలిపారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. సీఏ కోర్సులో రెండవ స్టేజీ ఐపీసీసీలో 9 నెలలు ఉన్న కాలపరిమితిని 18 నెలలకు పెంచడంతో విద్యార్థులలో మానసిక ఒత్తిడి తగ్గుతుందని చెప్పారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పేపర్ ని నూతన సిలబస్‌లో పూర్తిగా తొలగించనట్లు చెప్పారు.
అదే విధంగా కొత్త సిలబస్‌లో ఇంటర్ నేషనల్ టాక్సేషన్ పొందుపరడచంతో విద్యార్థులకు విదేశీ అవకాశాలు అందిపుచ్చుకునే వీలు ఉంటుందని వివరించారు. చాలా మంది విద్యార్థులు సీఏ విద్య కష్టతరమనే అపోహలో ఉన్నారని, అయితే అందులో వాస్తవం లేదన్నారు. దేశంలో ఇప్పటికి సీఏ ఉత్తీర్ణులైనవారు 25 లక్షల మంది ఉన్నారని తెలిపారు.