Cab companies
-
నైట్‌లో ముంబయి మొదటిస్థానం.. వీకెండ్లో..
ట్యాక్సీ సర్వీసులను అందించే ఉబర్ సంస్థ 2023లో చేసిన పర్యటనలకు సంబంధించి ఆసక్తికర విషయాలను విడుదల చేసింది. ఈ ఏడాది దిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్) బెంగళూరు, హైదరాబాద్, ముంబై, కోల్‌కతా, పుణెల్లో ఎక్కువ మంది రైడ్ బుక్ చేసినట్లు సంస్థ వెల్లడించింది. రాత్రి సమయంలో వచ్చిన బుకింగ్‌ల విషయానికొస్తే.. ముంబయి మొదటిస్థానంలో నిలిచింది. వీకెండ్లో మాత్రం కోల్‌కతాలోని ప్రజలు ఎక్కువగా బుక్ చేసుకున్నారు. 2023 సంవత్సరానికిగాను ఉబర్ రైడ్స్ రికార్డు స్థాయిలో 6800 కోట్ల కిలోమీటర్లలో సేవలందించిందని తెలిపింది. ఇది దేశంలోని మొత్తం రోడ్ నెట్‌వర్క్‌లో వెయ్యి రెట్లు అని కంపెనీ పేర్కొంది. ఇదీ చదవండి: టెస్లా యూనిట్‌కు సర్వం సిద్ధం చేసిన రాష్ట్ర ప్రభుత్వం..? ఉబెర్ వెల్లడించిన ఆసక్తికరమైన విషయాలు రైడ్స్‌లో ఎక్కువ భాగం సాయంత్రం 6-7 గంటల మధ్య షెడ్యూల్ చేస్తున్నవే. శనివారం ఉబెర్ ఫేవరెట్ డే. ఆ రోజే అధికంగా బుకింగ్స్ వస్తున్నాయి. రైడ్ బుక్ చేసిన ట్రిప్‌ల సంఖ్య పరంగా దసరా, క్రిస్మస్ అత్యంత ప్రజాదరణ పొందిన రోజులు. ఒక్క డిసెంబర్లోనే అత్యధిక సంఖ్యలో రైడ్లు బుక్ అయినట్లు సంస్థ తెలిపింది. విమానాశ్రయాలకు అధిక సంఖ్యలో ఉబర్ ట్రిప్‌లు ఉదయం 4-5 గంటల మధ్య బుక్ అయ్యాయి. -
క్యాబ్ చార్జీ ఇక మీ చేతుల్లో...
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: క్యాబ్ చార్జీల విషయంలో ఇప్పటి వరకు అగ్రిగేటర్లదే తుది నిర్ణయం. రైడింగ్, పీక్‌టైం, సర్జ్ వంటి పేర్లతో కస్టమర్లపై అదనపు భారం మోపుతున్నాయి. ఇలాంటిది లేకుండా చార్జీని వినియోగదార్లే నిర్ణయించుకునేలా అమెరికాకు చెందిన ప్రముఖ క్యాబ్ అగ్రిగేటర్ ‘ఇన్‌డ్రైవర్’ తన సేవల్ని ప్రారంభించింది. ఈ సంస్థ డ్రైవర్ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోదు. కస్టమర్ నగదు రూపంలో చార్జీని డ్రైవర్‌కే చెల్లించాలి. ఇదెలా పని చేస్తుందంటే.. కస్టమర్ తాను ఎక్కవలసిన, దిగాల్సిన స్థలం నిర్దేశిస్తూ ఎంత చెల్లించేదీ యాప్‌లో సూచించాలి. సమీపంలో ఉన్న డ్రైవర్లకు ఈ సమాచారం వెళ్తుంది. కస్టమర్ చెల్లించదల్చుకున్న మొత్తం నచ్చకపోతే డ్రైవర్ బేరమాడవచ్చు. హైదరాబాద్‌లో 2,000 మంది డ్రైవర్లతో చేతులు కలిపామని ఇన్‌డ్రైవర్ ఇండియా పీఆర్ మేనేజర్ పవిత్ నందా సోమవారమిక్కడ మీడియాకు తెలిపారు. బేస్ ఫేర్ రూ.40గా నిర్ణయించామన్నారు. ఆరు నెలల తర్వాత డ్రైవర్ల నుంచి 5–10 శాతం కమీషన్ తీసుకుంటామని చెప్పారు. -
కొనసాగుతున్న క్యాబ్ డ్రైవర్ల సమ్మె
-
క్యాబ్.. కష్టమే..
♦ మూడో రోజుకు చేరిన ఓలా, ఉబెర్ క్యాబ్‌ల బంద్ ♦ నగరవాసులకు తప్పని తిప్పలు సాక్షి, హైదరాబాద్: కొత్త వాహనాలకు అనుమతి, షేర్ బుకింగ్‌ల నిలిపివేత వంటి డిమాండ్లతో ఓలా, ఉబెర్ క్యాబ్ డ్రైవర్లు చేపట్టిన బంద్ సోమవారం మూడో రోజుకు చేరింది. తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ బంద్‌తో రెండు సంస్థలకు చెందిన సుమారు 60 వేల క్యాబ్‌లకు గత మూడు రోజులుగా బ్రేక్‌లు పడ్డాయి. అయితే ఉబెర్, ఓలా యాజమాన్యాలు దీనిపై ఇంతవరకు స్పందించలేదు. ప్రభుత్వం సైతం ఈ సమస్య పరిష్కారం దిశగా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో నిరవధిక సమ్మె దిశగా క్యాబ్ డ్రైవర్ల సంఘాలు కార్యాచరణను సిద్ధం చేస్తున్నాయి. ఈ నెల 4న సమ్మె విర మించాలని మొదట భావించినప్పటికీ... క్యాబ్ సంస్థల యాజమాన్యాల నుంచి ఎలాంటి స్పందనా రాకపోవడంతో నిరవధికంగా సమ్మె కొనసాగించాలని భావిస్తున్నట్లు అసోసి యేషన్ అధ్యక్షుడు శివ ఉల్కొందూకర్ తెలిపా రు. మరోవైపు సికింద్రాబాద్, కూకట్పల్లి హౌసింగ్‌బోర్డు, హైటెక్‌సిటీ, బంజారాహిల్స్, తదితర ప్రాంతాల్లో మూడో రోజూ క్యాబ్ డ్రైవర్ల ధర్నాలు, ఆందోళనలు కొనసాగాయి. కాగా, అంతర్జాతీయ సంస్థలైన ఓలా, ఉబెర్ లు ఆన్లైన్లో కార్యకలాపాలు సాగి స్తున్నం దున మోటారు వాహన చట్టం పరిధి లోకి రావని,ఈ విషయంలో తామేమీ చేయ లేమని తనను కలిసిన క్యాబ్ డ్రైవర్లకు సంయుక్త రవాణా కమిషనర్ వెంకటేశ్వర్లు చెప్పారు. నేడు ఇందిరా పార్కు వద్ద ధర్నా... తమ సమస్యలను పరిష్కరించమని క్యాబ్‌ల యాజమాన్యాల వద్దకు వెళితే... ‘మా నిబంధనల ప్రకారం నడిపితే నడపండి... లేదంటే కేసులు పెట్టుకోండి. మాకు ప్రభుత్వం అండగా ఉంది’అంటూ దురుసుగా సమాధానం చెబుతున్నాయని తెలంగాణ స్టేట్ క్యాబ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి వెంకటరంగారావు ఆరోపించారు. సంస్థల తీరుకు వ్యతిరేకంగా మంగళవారం ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహిస్తామని, అనంతరం సీఎం, రవాణా శాఖ మంత్రులకు వినతిపత్రాలు సమర్పిస్తామని చెప్పారు. నగరవాసుల ఇబ్బందులు... నూతన సంవత్సర వేడుకల తరువాత తొలి వర్కింగ్ డే కావడంతో క్యాబ్‌లపై అధికంగా ఆధారపడ్డ ఐటీ ఉద్యోగులు సోమవారం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ ప్రధాన రైల్వేస్టేషన్లతో పాటు, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్, కేపీహెచ్‌బీ, మియాపూర్, హబ్సిగూడ తదితర ప్రాంతాల్లోని కార్యాలయాలకు రాకపోకలు సాగించే ఉద్యోగులు, ప్రయాణికులు అవస్థలు పడ్డారు. ఇదే అదనుగా ఇతర క్యాబ్ సర్వీసులు, ఆటోవాలాలు ప్రయాణికుల నుంచి అందిన కాడికి దోచుకున్నారు. ఆటోవాలాలకు డిమాండ్... మూడు రోజులుగా క్యాబ్‌లు అందు బాటులో లేకపోవడంతో ఆటోవాలాలు బాగా డిమాండ్ చేస్తున్నారు. కేపీహెచ్‌బీ నుంచి మాదాపూర్ వరకు రూ.200 డిమాండ్ చేస్తున్నారు. నలుగురు ఉద్యోగు లం కలిసి ఒక క్యాబ్ బుక్ చేసుకొంటే ఎంతో చౌకగా ఆఫీసుకు చేరుకొనేవాళ్లం. – ఇమ్రాన్, ఐటీ ఉద్యోగి ఈఎంఐ చెల్లించలేకపోతున్నాం.. రోజుకు 18 నుంచి 20 గంటలు స్టీరింగ్ వదలకుండా పనిచేసినా ఈఎం ఐ చెల్లించలేకపోతున్నాము. మొదట్లో మాయమాటలు చెప్పి ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఒక్కో డ్రైవర్‌కు ఒక్కో విధమైన ఇన్సెంటివ్‌లు ఇస్తూ అందరినీ అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నారు. – సురేష్, డ్రైవర్ -
క్యాబ్ కంపెనీల ధరల పోరు!
కిలోమీటరుకు ఉబెర్ చార్జీ రూ.7 ♦ రేసులో ఉన్నానంటూ రూ.9కి తగ్గించిన ఓలా ♦ వర్షం, పీక్ సమయాల్లో మాత్రం బాదుడు ♦ వాస్తవ చార్జీకి 5 రెట్ల వరకూ వసూలు ♦ ముందే చూసుకోకుంటే జేబు గుల్లే హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ట్యాక్సీ అగ్రిగేటర్ల మధ్య పోటీ తారస్థాయికి చేరింది. పోటీలో ముందుండటానికి ఇవి ధరల పోరుకు తెరతీశాయి. ట్యాక్సీ సర్వీసుల్లో ఆది నుంచీ దూకుడుగానే వ్యవహరిస్తున్న బహుళజాతి సంస్థ ‘ఉబెర్’ మరోసారి ధరల యుద్ధానికి తెరలేపింది. ‘ఉబెర్ గో’ పేరిట చిన్న కార్లకు హైదరాబాద్‌లో కిలోమీటరుకు అతి తక్కువగా రూ.7 చొప్పున వసూలు చేస్తోంది. పెపైచ్చు రూ.25 బేస్ రేటుతో సర్వీసులను అందిస్తోంది. అంటే కనీస చార్జీ రూ.25 చెల్లిస్తే చాలన్నమాట. ఆ తరవాత ఎన్ని కిలోమీటర్లయితే అన్నిటికీ రూ.7 చొప్పున వసూలు చేస్తారు. అయితే ఉబెర్ దెబ్బకు మిగిలిన కంపెనీలూ దిగి వస్తున్నాయి. దీంతో పాటు డ్రైవర్లను ఆకట్టుకోవటానికి వారికి ప్రోత్సాహకాల విషయంలోనూ కంపెనీలు పోటీలు పడుతున్నాయి. అయితే ఇక్కడ జరుగుతున్నదొక్కటే. క్యాబ్‌లకు తాము ఎవరి తరఫున వాహనం నడుపుతున్నామనే స్టిక్కర్ తప్పనిసరి కాకపోవటంతో... ఒకే క్యాబ్ అన్ని కంపెనీల తరఫునా సేవలందిస్తోంది. అదీ కథ. అగ్ర శ్రేణి కంపెనీ సైతం... ఉబెర్ పోటీతో భారత్‌లో ట్యాక్సీ సర్వీసుల్లో అగ్ర స్థానంలో ఉన్న ఓలా సైతం ధరలను సవరించింది. హైదరాబాద్‌లో మినీ కార్లకు కిలోమీటరుకు రూ.10గా ఉన్న చార్జీని కాస్తా రూ.9కి తగ్గిస్తున్నట్లు గురువారం ఒక ప్రకటనలో తెలియజేసింది. నిజానికి ఈ చార్జీని కొద్ది రోజుల ముందే తగ్గించినా... అధికారికంగా మాత్రం గురువారం ప్రకటించింది. బేస్ రేటును కూడా రూ.100 నుంచి రూ.80కి కుదించింది. ఈ బేస్ రేటుతో నాలుగు కిలోమీటర్ల వరకు ప్రయాణించొచ్చు. అంటే రూ.80కి 4 కిలోమీటర్లు ప్రయాణించి... అక్కడి నుంచి కిలోమీటరుకు రూ.9 చొప్పున చెల్లించాలన్న మాట. ఇక సెడాన్ కార్లకు కి.మీ.కు గతంలో రూ.14 చొప్పున వసూ లు చేసినా ఇటీవలే దాన్ని రూ.12కు తగ్గించింది. బేస్ రేటులో కూడా రూ.50 తగ్గించి ప్రస్తుతం రూ.100 వసూలు చేస్తోంది. ఢిల్లీలో మినీ కార్లకు కి.మీ.కు రూ.8 చార్జీ వసూలు చేస్తుండటం విశేషం. ఉబెర్ మాత్రం సెడాన్ కార్లకు హైదరాబాద్‌లో కి.మీ.కు రూ.9 చార్జీ చేస్తోంది. బేస్ ఫేర్ రూ.45, కనీస చార్జీ రూ.80. జినీ, ఓలాకే చెందిన ట్యాక్సీ ఫర్ స్యూర్‌లు హ్యాచ్‌బ్యాక్ కార్లకు కి.మీ.కు రూ.12 వసూలు చేస్తున్నాయి. ట్రిప్ టైమ్ పేరుతో ఈ కంపెనీలు వాహనాన్ని బట్టి నిమిషానికి రూ.2 వరకు అదనంగా వసూలు చేస్తున్నాయి. పోటాపోటీగా ప్రోత్సాహకాలు! కారు యజమానులకు అగ్రిగేటర్లు పోటీపడి మరీ నగదు ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి. పీక్ టైమ్‌లో ఉబెర్ ఒక్కో ట్రిప్‌కు రూ.225 వరకు అదనంగా చెల్లిస్తోంది. ఓలా మాత్రం పీక్ టైమ్‌లో ట్రిప్‌కు రూ.100 ఇస్తోంది. ట్యాక్సీ ఫర్ స్యూర్ సైతం నగదుతో కారు యజమానులను ప్రోత్సహిస్తోంది. ఉదాహరణకు 10 ట్రిప్పులకుగాను కస్టమర్లు చెల్లించిన మొత్తం రూ.2,000 అయితే, కంపెనీ అదనంగా రూ.1,200 ఇస్తోంది. 10 ట్రిప్పులకు కస్టమర్ల నుంచి రూ.3,200లకు మించి పొందితే అదన పు చెల్లింపులు ఉండవు. ఇక కారు యజమానుల నుంచి ఉబెర్ 20 శాతం, ఓలా, ట్యాక్సీ ఫర్ స్యూర్‌లు 15 శాతం కమిషన్ తీసుకుంటున్నాయి. డిమాండ్‌ను బట్టి బాదుడు! మామూలు సమయాల్లో ఈ అగ్రిగేటర్ల చార్జీలు తక్కువే అనిపించినా పీక్ సమయాల్లోను, వర్షం పడినప్పుడు మాత్రం బాదుడు ఉండనే ఉంటోంది. ఉదయం 7-10, సాయంత్రం 4-9 వరకు క్యాబ్‌లకు డిమాండ్ అధికంగా ఉంటోంది. పీక్ టైమ్‌కు తోడు వర్షం పడిందంటే... ఆ సమయాల్లో ‘సర్జ్’ పేరుతో ఉబెర్అదనంగా చార్జీలు వసూలు చేస్తోంది. అలాంటి సమయంలో బుక్ చేసినపుడు ఎన్ని రెట్ల ఛార్జీ చెల్లించాల్సి వస్తుందన్నది ముందే తెలుస్తుంది. అది గమనించకుండా ఇటీవల ఒక కస్టమర్ క్యాబ్ బుక్ చేయటంతో... అది ఏకంగా 5 రెట్ల చార్జీకి వెళ్లింది. దీంతో నిండా 10 కిలోమీటర్లు కూడా ప్రయాణించకుండానే బిల్లు రూ.1,200 పైగా అయ్యింది. అది చూసి గుండె గుభేలుమన్న సదరు కస్టమర్ హైటెక్ సిటీ వెళ్లాల్సి ఉన్నా మధ్యలోనే అప్పటివరకూ అయిన చార్జీలు చెల్లించి దిగిపోయారంటే కంపెనీ ఏ స్థాయిలో చార్జీ వసూలు చేసిందో అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి కారు యజమానులకు అదనపు ప్రోత్సాహకాలు ఉబెర్ నుంచే అధికంగా వస్తున్నాయి. ‘‘ఈ ప్రోత్సాహకాల కోసం పలువురు క్యాబ్ యజమానులు రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. కంపెనీ వద్ద కార్లు పెరగడంతో బుకింగ్స్ తగ్గిపోయాయి’’ అని శంకర్ అనే కారు యజమాని వాపోయాడు. అయితే అన్ని కంపెనీల తరఫునా నడిపిస్తుండటం కారు యజమానులకు కలిసి వస్తోందన్నది బహిరంగ రహస్యం. -
క్యాబ్ బ్రాండ్ ఏదైనా ఒకే ట్యాక్సీ!
సులువుగా బ్రాండ్ మార్చేస్తున్న ట్యాక్సీ ఓనర్లు - కుదిపేస్తున్న నగదు ప్రోత్సాహకాలు - ట్యాక్సీ రంగంలో తారస్థాయికి చేరిన పోటీ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఒక కారు.. నాలుగు బ్రాండ్లు! ఏంటని ఆలోచిస్తున్నారా? ఇప్పుడు కంపెనీల ‘నగదు ప్రోత్సాహకాల’ పుణ్యమా అని ట్యాక్సీ సేవల రంగంలో వింత పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకు ఒక బ్రాండ్‌కే పరిమితమైన క్యాబ్‌లు.. నేడు అన్ని బ్రాండ్లకు సేవలందిస్తున్నాయి. బ్రాండ్ పేర్లతో పెద్ద పెద్ద స్టిక్కర్లతో పరుగులు తీసిన కార్లు ఇప్పుడు అవేవీ లేకుండానే నడుస్తున్నాయి. కోట్లాది రూపాయలను ఇన్వెస్టర్లు, పీఈ సంస్థల నుంచి పెట్టుబడిగా స్వీకరిస్తున్న క్యాబ్ కంపెనీలు ఆ మొత్తాన్ని ప్రోత్సాహకాల రూపంలో బ్రాండింగ్‌కు ఖర్చు చేస్తున్నాయి. అసలేం జరిగిందంటే.. క్యాబ్ కంపెనీల మధ్య పోటీతో కనీస చార్జీ కిలోమీటరుకు రూ.10కి తగ్గిపోయింది. వాస్తవానికి చిన్న కార్లకు కిలోమీటరుకు వ్యయం అటూ ఇటుగా రూ.10 అవుతుంది. ఇంత తక్కువ చార్జీతో కారు నడపడం నష్టంతో కూడుకున్నది. అందుకే క్యాబ్ కంపెనీలు పోటీపడి మరీ కారు యజమానులను ‘నగదు’తో ప్రోత్సహిస్తున్నాయి. కంపెనీల పోటీ కాస్తా కారు యజమానులకు కాసులు కురిపిస్తోంది. ప్రయాణికులు చెల్లించే మొత్తం కూడా కారు యజమానికే చేరుతుంది. చాలా మంది డ్రైవర్లు కారును కొనుక్కుని క్యాబ్ కంపెనీలకు నడుపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఎక్కువగా ఇన్సెంటివ్ ఇచ్చే కంపెనీ బ్రాండ్‌తో కార్లను నడిపారు. ప్రోత్సాహకాల భారం తడిసిమోపెడవడంతో ఈ మొత్తాన్ని క్యాబ్ సంస్థలు ఇటీవల తగ్గించి వేశాయి. దీంతో కారు యజమానులు కొత్త విధానాన్ని అనుసరిస్తున్నారు. ఎటువంటి బ్రాండ్ లేకుండానే కార్లను నడుపుతున్నారు. అన్ని కంపెనీలకు చెందిన మొబైల్ డివైస్‌లను కారులో ఉంచుతున్నారు. ఏ మొబైల్కైతే ఎస్ఎంఎస్ వస్తుందో ఆ బుకింగ్‌ను స్వీకరిస్తున్నారు. ఇలా అన్ని కంపెనీలతో ‘టచ్’లో ఉంటున్నారు. క్యాబ్ కంపెనీ యాప్ మాత్రమే పనిచేసే మొబైల్ పరికరం కార్లలో ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ డివైస్‌ను కంపెనీలు ఉచితంగా ఇస్తున్నాయి. దీని ఆధారంగానే డ్రైవర్‌కు సమాచారం ఇచ్చి కస్టమర్‌ను అనుసంధానిస్తారు. ఊహించని స్థాయిలో.. ఓలా, జినీ, ట్యాక్సీ ఫర్ ష్యూర్, ఉబర్లు నగదు ప్రోత్సాహకాలు ఇస్తున్నాయని కారు యజమానులు చెబుతున్నారు. ఒకానొక దశలో రోజుకు 10 ట్రిప్పులకుగాను కంపెనీలు రూ.3 వేల దాకా చెల్లించాయని తెలిపారు. చెల్లింపుల వ్యవహారం 2014 డిసెంబర్లో తార స్థాయికి చేరుకుంది. ఓలా రోజుకు 10 ట్రిప్పులకు రూ.6 వేల దాకా అదనంగా ముట్టజెప్పిందని ఒక కారు యజమాని వెల్లడించారు. జనవరి మూడో వారం నుంచి ఈ మొత్తాన్ని తగ్గించిందని చెప్పారు. అయితే కంపెనీలు ప్రోత్సాహకాల మొత్తాన్ని సవరించగానే ఎక్కువగా ఇచ్చే కంపెనీ వైపుకు కార్లు దూసుకెళ్లాయి. సింపుల్‌గా కారుపై ఉన్న స్టిక్కర్లను మార్చేవారు. ప్రస్తుతం వివిధ కంపెనీలు 12 ట్రిప్పులకుగాను రూ.750 మాత్రమే అదనంగా ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఇంకేముంది అన్ని కంపెనీలకూ అది కూడా ఏ స్టిక్కరూ లేకుండానే కార్లు తిరుగుతున్నాయి. నగదు ప్రోత్సాహకాలను పెట్టుబడిగా భావించాలని ఓలా మార్కెటింగ్ డెరైక్టర్ ఆనంద్ సుబ్రమణియన్ అన్నారు. ప్రతిభ కనబరిచే డ్రైవర్లకు స్టార్ రేటింగ్ ఆధారంగా ప్రోత్సాహకాలు ఇస్తున్నాం. ఆకర్షించే చార్జీలు, ఆఫర్లు కస్టమర్లను ప్రోత్సహించేందుకేనని చెప్పారు. ఇదిలావుంటే తక్కువ చార్జీల భారం నుంచి కొంతైనా బయటపడేందుకు పీక్ సమయాల్లో చార్జీలను కంపెనీలు సవరించాయి. ఉదయం 7.30-10, సాయంత్రం 5.30-8 వరకు కొంత మొత్తాన్ని అదనంగా చార్జీ చేస్తున్నాయి. యాప్‌తో బుక్ చేస్తే.. క్యాబ్ కంపెనీల మధ్య పోటీ ఏ స్థాయికి చేరిందంటే యాప్ డౌన్లోడ్ చేసుకుంటే తొలి రైడ్‌ను ఉచితంగా అందించే వరకు వెళ్లింది. ప్రస్తుతం యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక చేసే తొలి ట్రిప్‌కు రూ.150 డిస్కౌంట్‌ను మేరు, జినీ క్యాబ్స్ ఇస్తున్నాయి. కరెంట్, నౌ స్టేటస్‌పై మేరు, మేరు ఫ్లెక్సీ కార్లకు 25% తగ్గింపు పొందవచ్చు. సిటీ ట్యాక్సీ బుకింగ్‌పై రూ.200 తగ్గింపును ఓలా అందిస్తోంది. ఆఫర్లు ఎప్పటికప్పుడు మారుతున్నాయి.