కొత్త వాహనాలకు అనుమతి, షేర్ బుకింగ్‌ల నిలిపివేత వంటి డిమాండ్లతో ఓలా, ఉబెర్ క్యాబ్ డ్రైవర్లు చేపట్టిన బంద్ సోమవారం మూడో రోజుకు చేరింది. తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ బంద్‌తో రెండు సంస్థలకు చెందిన సుమారు 60 వేల క్యాబ్‌లకు గత మూడు రోజులుగా బ్రేక్‌లు పడ్డాయి. అయితే ఉబెర్, ఓలా యాజమాన్యాలు దీనిపై ఇంతవరకు స్పందించలేదు. ప్రభుత్వం సైతం ఈ సమస్య పరిష్కారం దిశగా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో నిరవధిక సమ్మె దిశగా క్యాబ్ డ్రైవర్ల సంఘాలు కార్యాచరణను సిద్ధం చేస్తున్నాయి.
Published Tue, Jan 3 2017 7:35 AM | Last Updated on Thu, Mar 21 2024 8:47 PM
Advertisement
Advertisement
Advertisement