The Cabinet
-
భారీగా భర్తీ
కాళోజీ హెల్త్ యూనివర్సిటీకి పలు పోస్టులు మంజూరు ఎంజీఎం : కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ కార్యకలాపాలను విస్తృతం చేసేందు కు అవసరమైన పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. కేబినెట్లో తీసుకున్న నిర్ణయం మేరకు పోస్టులు కేటారుుస్తూ మంగళవారం జీవో నంబర్ ఎంఎస్ 5 విడుదల చేసింది. -
గూగుల్ స్థానంలో ‘భువన్’
భువన్ మ్యాప్‌ల ఆధారంగా పేదల ఇళ్లకు జియో ట్యాగింగ్ ఆధార్‌తోనూ ఇళ్ల వివరాలను అనుసంధానించాలని నిర్ణయం సాక్షి, హైదరాబాద్: గూగుల్ మ్యాప్‌లకు బదులు దేశీయంగా రూపొందించిన భౌగోళిక సమాచార వ్యవస్థ ‘భువన్’ను ఇకపై విస్తృతంగా వినియోగించాలన్న కేంద్రం నిర్ణయం మేరకు రాష్ర్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దేశ భౌగోళిక సమాచారానికి సంబంధించిన పూర్తి వివరాలతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)కు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్(ఎన్ఆర్ఎస్సీ) తయారు చేసిన ‘భువన్’ సాఫ్ట్వేర్ అప్లికేషన్ల వినియోగంపై అధికారులు దృష్టి సారించారు. దీంతో ప్రభుత్వ పథకాలను భువన్ మ్యాపులతో అనుసంధానించే ప్రక్రియ మొదలవుతోంది. రాష్ట్రంలో పేదల ఇళ్ల వివరాలను ఈ పోర్టల్ ఆధారంగా ‘జియో ట్యాగింగ్’ చేయబోతున్నా రు. ప్రతి ఇల్లు ఉన్న ప్రదేశాన్ని ఆక్షాంశరేఖాంశాల ఆధారంగా గుర్తించి ఈ ప్రక్రియను చేపడతారు. సర్వే నంబర్, లబ్ధిదారుడి ఫొటో, వ్యక్తిగత వివరాలన్నీ ఇందులో ఉంటాయి. దీంతో అక్రమాలకు అడ్డుకట్ట వేయొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఒకసారి లబ్ధిపొందిన వ్యక్తి మరోసారి ఇంటి కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండదు. ఇటీవల ఇందిరమ్మ ఇళ్ల విషయంలో అవకతవకలపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు సీఐడీ విచారణ జరిపిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయానికి ప్రాధాన్యం ఏర్పడింది. అయితే ‘భువన్’ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించాలని ప్రధాని నరేంద్రమోదీ నిర్ణయించడంతో గూగుల్ సాఫ్ట్‌వేర్‌ను పక్కనబెట్టనున్నారు. ఒక్కో ఇంటి వివరాలను జియో ట్యాగింగ్‌లో నమోదు చేయడానికి రూ. 27 చొప్పున ప్రైవేట్ సంస్థకు చెల్లించాల్సి వస్తుండటంతో.. ఇకపై సొంతంగానే ఈ ప్రక్రియను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా గృహ నిర్మాణ శాఖ బాధ్యతలు చేపట్టిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి గురువారం సాయంత్రం అధికారులతో సమావేశమై దీనిపై చర్చించారు. జియో ట్యాగింగ్ చేసే ప్రతి ఇంటి వివరాలను ఆధార్ తోనూ అనుసంధానించాలని, యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్లను పాత పథకం కిందనే పూర్తి చేయాలని, రెండు పడకగదుల ఇళ్ల పథకాన్ని కొత్త దరఖాస్తులతో ప్రారంభించాలని ఈ సందర్భంగా అధికారులు మంత్రికి సూచించారు. హైదరాబాద్‌లోని బండ్లగూడ, పోచారం ప్రాంతాల్లో నిర్మించిన స్వగృహ ఇళ్ల ధరలను తగ్గించాలన్నారు. జవహర్‌నగర్ ప్రాజెక్టులోని ఇళ్లను సీఆర్పీఎఫ్కు కేటాయించేందుకు చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. -
‘అసెంబ్లీ’ అనంతరమే కేబినెట్
మాతృభాషలో మాధ్యమిక శిక్షణపై మళ్లీ పోరాటం చట్టాల్లో మార్పులు తెచ్చేలా పీఎంపై ఒత్తిడి ‘బెళగావి అసెంబ్లీ’లో ఉత్తర కర్ణాటక సమస్యలపై దృష్టి జేడీఎస్ ప్రశ్నలకు దీటుగా జవాబిస్తా పీఎంగా మోదీ సాధించింది శూన్యం హామీల విషయంలో యూ టర్న తీసుకున్న బీజేపీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మైసూరు : బెళగావిలో నిర్వహించనున్న శీతాకాల అసెంబ్లీ సమావేశాల అనంతరం మంత్రివర్గాన్ని విస్తరించనున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. మైసూరు జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం జిల్లాలో ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. అంతకుముందు మైసూరులోని హెలిప్యాడ్ వద్ద విలేకరులతో మాట్లాడారు. బెళగావిలో శీతాకాల అసెంబ్లీ సమావేశాలు పూర్తై తర్వాత మంత్రి వర్గ విస్తరణ చేపట్టనున్నట్లు వెల్లడించారు. మాతృభాషలో మాధ్యమిక శిక్షణ అందించే విషయమై సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురైన నేపథ్యంలో ఈ అంశాన్ని పునఃపరిశీలించాల్సిందిగా సుప్రీం కోర్టులో అర్జీని దాఖలు చేయనున్నట్లు తెలిపారు. అంతేకాక ఇందుకు సంబంధించి చట్టాల్లో సైతం మార్పులు తెచ్చేలా ప్రధానమంత్రిపై ఒత్తిడి తీసుకువస్తామని వెల్లడించారు. బెళగావి అసెంబ్లీ సమావేశాల్లో ఉత్తర కర్ణాటక ప్రాంతంలోని సమస్యలపై ఎక్కువగా దృష్టి సారించడంతో పాటు అక్కడ సమస్యల పరిష్కారానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ఇక బెళగావిలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు జేడీఎస్ ప్రణాళికలు రచిస్తుండడంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందిస్తూ... వారి ప్రశ్నలన్నింటికి తాము ధీటుగా జవాబు ఇవ్వనున్నామని స్పష్టం చేశారు. ఇక అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రధాని నరేంద్రమోదీ సాధించిందేమీ లేదని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఇప్పటికీ నెరవేర్చలేదని, అంతేకాక ఈ హామీల విషయంలో బీజేపీ ప్రభుత్వం యూ టర్న్ తీసుకుందని ఆరోపించారు. ఈ సందర్భంలో మంత్రులు ఉమాశ్రీ, ఆంజనేయ, శ్రీనివాస ప్రసాద్ తదితరులు సిద్ధరామయ్య వెంట ఉన్నారు.