Cabinet expansion BJP
-
గోవా మంత్రివర్గ విస్తరణ
-
కొత్త ట్విస్ట్... నితిన్‌కు హార్దిక్ బంపరాఫర్
గాంధీనగర్ : గుజరాత్ కేబినెట్ చిచ్చు తారాస్థాయికి చేరిన వేళ.. శాఖ కేటాయింపుతో తీవ్ర అసంతృప్తిగా ఉన్న నితిన్‌భాయ్ పటేల్ వ్యవహారం గుజరాత్లో కొత్త రాజకీయానికి తెరలేపింది. పటేళ్ల ఆత్మగౌరవ సమస్య అంశం తెరపైకి రావటంతో పటీదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ మళ్లీ మీడియా ముందుకు వచ్చేశాడు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం నితిన్‌పటేల్‌కు హార్దిక్ బంపరాఫర్ ప్రకటించాడు. ‘‘ఆయన(నితిన్) వెంటనే బీజేపీని వీడాలి. తన వెంట మరో 10 మంది ఎమ్మెల్యేలను తీసుకుని రావాలి. అలా వస్తే కాంగ్రెస్ పార్టీతో మాట్లాడి ఆయనకు గౌరవప్రదమైన స్థానం ఇప్పిస్తా’’ అని హామీ ఇస్తున్నాడు. బీజేపీ గౌరవించని పక్షంలో ఇంకా పార్టీని పట్టుకుని వేలాడే అవసరం నితిన్‌కు ఏంటని హార్దిక్ ప్రశ్నిస్తున్నాడు. సారంగపూర్‌లో మీడియాతో హార్దిక్ ఈ వ్యాఖ్యలు చేశాడు. కాగా, శాఖల కోతలు, బాధ్యతల స్వీకరణలో ఆలస్యంపై నితిన్ పటేల్ ఇప్పటిదాకా ఎలాంటి అధికార ప్రకటనచేయనప్పటికీ, ఆయన అవమాన భారంతో రగిలిపోతున్నట్లు, తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమైనట్లు సన్నిహితవర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ పరిస్థితి అసంతృప్తి తారాస్థాయికి చేరితే మాత్రం బీజేపీ చెయ్యి జారి గుజరాత్ రాజకీయాల్లో సమూల మార్పులు వాటిల్లే అవకాశం ఉందన్నది విశ్లేషకుల మాట. -
వైవిధ్యానికి దర్పణం
కేబినెట్ విస్తరణ తీరుపై బీజేపీ అభివర్ణన న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ మంత్రివర్గ విస్తరణ తీరు దేశ వైవిధ్యానికి అద్దం పడుతోందని బీజేపీ పేర్కొంది. భిన్న వర్గాలు, ప్రాంతాలు, కులాల వారికి ప్రాతినిధ్యం దక్కిందని పేర్కొంది. పేదలు, దళితులు, యువకులు, దేశ వ్యాప్తంగా భిన్న ప్రాంతాల వారికి మోదీ మంత్రివర్గంలో స్థానం కల్పించారని బీజేపీ జాతీయ కార్యదర్శి శ్రీకాంత్ శర్మ అన్నారు. విస్తరణపై కాంగ్రెస్ విమర్శలకు దిగింది. గిరిరాజ్ సింగ్‌కు చోటు కల్పించడం లౌకికవాదానికి చెంప దెబ్బ అని కాంగ్రెస్ ప్రతినిధి అభిషేక్ సింఘ్వి అన్నారు. మరో కాంగ్రెస్ నేత ప్రియాంక చతుర్వేది మాట్లాడుతూ... విదేశాంగ మంత్రిగా గిరిరాజ్‌సింగ్ బాధ్యతలు చేపడితే మోదీ వ్యతిరేకులను పాకిస్థాన్‌కు పంపేందుకు వీలవుతుందని ఎద్దేవా చేశారు. మోదీ గెలిస్తే ఆయన్ను వ్యతిరేకించే వారు పాకిస్థాన్‌కు వెళ్లాల్సి ఉంటుందని గత లోక్‌సభ ఎన్నికల సమయంలో గిరిరాజ్‌సింగ్ వ్యాఖ్యానించడం తెలిసిందే. మోదీ మంత్రివర్గంలో కొత్తగా మంత్రుల ప్రమాణ కార్యక్రమానికి కాంగ్రెస్ నుంచి ఎవరూ హాజరు కాలేదు. దీనిపై మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. కార్యక్రమానికి రావాలని కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌లను ఆహ్వానించినట్టు తెలిపారు. హాజరైన ఏకైక విపక్ష నేత సమాజ్‌వాదీ పార్టీకి చెందిన రామ్‌గోపాల్ యాదవ్ మాత్రమే.