కేబినెట్ విస్తరణ తీరుపై బీజేపీ అభివర్ణన
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ మంత్రివర్గ విస్తరణ తీరు దేశ వైవిధ్యానికి అద్దం పడుతోందని బీజేపీ పేర్కొంది. భిన్న వర్గాలు, ప్రాంతాలు, కులాల వారికి ప్రాతినిధ్యం దక్కిందని పేర్కొంది. పేదలు, దళితులు, యువకులు, దేశ వ్యాప్తంగా భిన్న ప్రాంతాల వారికి మోదీ మంత్రివర్గంలో స్థానం కల్పించారని బీజేపీ జాతీయ కార్యదర్శి శ్రీకాంత్ శర్మ అన్నారు. విస్తరణపై కాంగ్రెస్ విమర్శలకు దిగింది. గిరిరాజ్ సింగ్‌కు చోటు కల్పించడం లౌకికవాదానికి చెంప దెబ్బ అని కాంగ్రెస్ ప్రతినిధి అభిషేక్ సింఘ్వి అన్నారు. మరో కాంగ్రెస్ నేత ప్రియాంక చతుర్వేది మాట్లాడుతూ... విదేశాంగ మంత్రిగా గిరిరాజ్‌సింగ్ బాధ్యతలు చేపడితే మోదీ వ్యతిరేకులను పాకిస్థాన్‌కు పంపేందుకు వీలవుతుందని ఎద్దేవా చేశారు.
మోదీ గెలిస్తే ఆయన్ను వ్యతిరేకించే వారు పాకిస్థాన్‌కు వెళ్లాల్సి ఉంటుందని గత లోక్‌సభ ఎన్నికల సమయంలో గిరిరాజ్‌సింగ్ వ్యాఖ్యానించడం తెలిసిందే. మోదీ మంత్రివర్గంలో కొత్తగా మంత్రుల ప్రమాణ కార్యక్రమానికి కాంగ్రెస్ నుంచి ఎవరూ హాజరు కాలేదు. దీనిపై మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. కార్యక్రమానికి రావాలని కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌లను ఆహ్వానించినట్టు తెలిపారు. హాజరైన ఏకైక విపక్ష నేత సమాజ్‌వాదీ పార్టీకి చెందిన రామ్‌గోపాల్ యాదవ్ మాత్రమే.
వైవిధ్యానికి దర్పణం
Published Mon, Nov 10 2014 2:00 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM
Advertisement
Advertisement