caged
-
కేంద్రానికి చెంపపెట్టు
న్యూఢిల్లీ: కేజ్రీవాల్ విడుదలను సీబీఐకి, అమిత్ షాకు, కేంద్రానికి చెంపపెట్టుగా ఆప్ అభివరి్ణంచింది. ‘‘సీబీఐ పంజరంలో చిలుకేనని సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యలు మరోసారి రుజువు చేశాయి. అవి నేరుగా కేంద్రంపై చేసిన వ్యాఖ్యలు. కనుక కేంద్ర హోం మంత్రి అమిత్ షా తక్షణం రాజీనామా చేయాలి’’ అని ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ డిమాండ్ చేశారు. మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా దర్యాప్తు సంస్థలు ఇప్పటిదాకా ఏ సాక్ష్యాన్నీ సంపాదించలేకపోయాయని ఢిల్లీ మంత్రి ఆతిషి ఎద్దేవా చేశారు. హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తారని ఆ రాష్ట్ర పార్టీ చీఫ్ సుశీల్ గుప్తా అన్నారు. కేజ్రీవాల్ విడుదలను ప్రజాస్వామ్య విజయంగా సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ అభివరి్ణంచారు. ఆప్ విమర్శలను బీజేపీ తిప్పికొట్టింది. ‘‘కేజ్రీవాల్‌కు షరతులతో కూడిన బెయిల్ మాత్రమే వచి్చందని మర్చిపోవద్దు. మద్యం కేసులో ప్రధాన నిందితుడైన ఆయన తక్షణం రాజీనామా చేయాలి’’ అని డిమాండ్ చేసింది. లేదంటే ఢిల్లీ ప్రజలే ఆయన రాజీనామాకు పట్టుబట్టే రోజు ఎంతో దూరం లేదంది. -
సీబీఐపై ఘాటు వ్యాఖ్యలు.. సుప్రీం నోట మళ్లీ అదే మాట!
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసిన విషయం విదితమే. ఈ మేరకు సుప్రీంకోర్టు జస్టిస్‌లు సూర్యకాంత్, ఉజ్జల్ భూయన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం కేజ్రీవాల్‌కు శుక్రవారం పలు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.బెయిల్‌పై విచారణ సందర్భగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐను ఉద్ధేశిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్ విషయంలో సీబీఐ వ్యవహరించిన తీరును ఆయన తప్పుబట్టారు. దేశంలో సీబీఐ పరిస్థితిని వర్ణిస్తూ.. ‘పంజరంలో ఉన్న చిలుక (caged parrot) మాదిరి వ్యవహరించకూడదని సూచించారు.సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్సీబీఐ అంటే స్వతంత్రంగా వ్యహరించడం లేదని, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే సంస్థగా పనిచేస్తుందనే అర్థంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే సీబీఐ.. కేంద్ర ప్రభావంతో పనిచేసే ‘బోనులో ఉన్న చిలుక’ కాదని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సీబీఐ అంటే ‘స్వేచ్ఛగా విహరించే చిలుకలా’ వ్యవహరించాలని తెలిపారు. తనపై వ్యక్తం అయిన అనుమానాలను సీబీఐ నివృత్తి చేసుకోవాలన్నారు. అలాగే సీఎం కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్ట్ చేసిన విధానంపై జస్టిస్ భూయాన్ విమర్శలు గుప్పించారు. ఆయన్ను కేవలం జైలులో ఉంచి వేధించాలన్న ఉద్దేశంతో ప్లాన్ ప్రకారం అరెస్ట్ జరిగినట్లు కనిపిస్తోందన్నారు. అయితే ‘పంజరంలో బంధించిన చిలుక’ పదాన్ని 2013లో సీబీఐపై సుప్రీంకోర్టు ఉపయోగించింది. కేంద్ర దర్యాప్తు సంస్థ స్వతంత్రమైనది కాదని కేంద్ర ప్రభుత్వ ప్రభావంతో పని చేస్తుందని వ్యాఖ్యానించింది. కోర్టు పరిశీలనతో ఏకీభవించిన అప్పటి సీబీఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా.. ఈ వ్యాఖ్యను అంగీకరించారు. సీబీఐ విధుల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటోందన్న భావనతో ప్రతిపక్షాలు సీబీఐని ‘పంజరంలో చిలుక’ అనే మాటను తరచుగా ఉపయోగిస్తుంటాయి. తాజాగా సుప్రీంకోర్టు విచారణతో ఈ పదబంధం మళ్లీ తెరపైకి వచ్చింది.చదవండి: ఆరు నెలల తర్వాత బయటకు మరోవైపు విచారణ సందర్భంగా బెయిల్‌పై జస్టిస్ సూర్యకాంత్ సైతం కీలక వ్యాఖ్యలు చేశారు. సీబీఐ అరెస్టు సక్రమైందని తెలిపిన న్యామూర్తి.. సుదీర్ఘంగా జైలులో నిర్బంధించడం అంటే.. వ్యక్తి హక్కులను హరించినట్లే అవుతుందని వ్యాఖ్యానించింది. విచారణ ప్రక్రియ శిక్షగా మారకూడదని.. ఈడీ కేసులో బెయిల్ లభించిన వెంటనే సీబీఐ అరెస్ట్ చేయడం సరైంది కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆర్టికల్ 21 ప్రకారం సాధారణంగా కోర్టులు స్వేచ్ఛ వైపే మొగ్గుచూపుతాయని తెలిపారు.కాగా లిక్కర్ పాలసీకి చెందిన మనీలాండరింగ్ కేసులో తొలుత కేజ్రీవాల్‌ను మార్చి 21న ఈడీ అదుపులోకి తీసుకుంది. అనంతరం జైలులో ఉన్న కేజ్రీవాల్‌ను జూన్ 26న సీబీఐ అరెస్ట్ చేసింది. అయితే ఈడీ కేసులో సీఎంకు జూలై 12న సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయగా.. సీబీఐ కేసులో ఇప్పటి వరకు బెయిల్ రాకపోవడంతో ఆయన జైలులోనే ఉన్నారు.సీబీఐ అరెస్ట్‌ను సవాల్ చేస్తూ, బెయిల్ కోసం అభ్యర్థిస్తూ రెండు పిటిషన్లు వేశారు. ఈ రెండు పిటిషన్లపై ఈ నెల 5న విచారణ జరిపిన దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది. ఈ తీర్పుతో ఆరు నెలల తర్వాత కేజ్రీవాల్ బయటకు రానున్నారు.ఇదీ చదవండి: అభయ కేసు.. సీబీఐ సంచలన నిర్ణయం -
నాకు గానీ.. దొరికితే..
-
నాలుగు గోడల మధ్య నరకాలు నడిచొచ్చిన చోట...
కొన్ని చిత్రాలు ఇలా వచ్చి అలా వెళ్లిపోతాయి... కొన్ని చిత్రాల చిత్రజైత్రయాత్ర మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. ‘కేజ్డ్’ అనే లఘుచిత్రం కూడా ఇలాంటిదే! దీనిలో ఎలాంటి కమర్షియల్ గిమ్మిక్కులు లేవు... కన్నీటిబొట్లు ఉన్నాయి. వాటిలోకి ఒకసారి తొంగిచూస్తే మన ఊరు,వాడ, ఇల్లు కనిపిస్తాయి. కరోనా కాలంలో... ముఖ్యంగా లాక్డౌన్ టైమ్‌లో... ఒక ఊళ్లో ఒక భర్త: ‘చికెన్ బిర్యానీ వండిపెట్టమని రెండురోజుల నుంచి చెబుతున్నాను. పుట్టింటి వాళ్లతో మాట్లాడడానికి టైమ్ ఉంటుందిగానీ నేను అడిగింది చేసి పెట్టడానికి మాత్రం టైమ్ ఉండదు. మగాడికి విలువ లేకుండా పోయింది’ మరో ఊళ్లో ఒక భర్త: ఈయన ఇంట్లో ఉండడం కంటే ఆఫీసులో ఉండడమే ‘కుటుంబ సంక్షేమం’ అనుకుంటారు కుటుంబసభ్యులు. ఈ భర్త చాదస్తాల చౌరస్తా. ‘ఇది ఇల్లా అడవా? ఏంచేస్తున్నావు? ఎక్కడి వస్తువులు అక్కడే పని ఉన్నాయి’ అని గర్జించే ఈ భర్తకి టీవికి ఠీవీగా ముఖం అప్పగించడం తప్ప చిన్నచిన్న పనులలో కూడా భార్యకు సహాయం చేయడానికి మనసు రాదు. ఇంకో ఊళ్లో ఇంకో భర్త: ఈయనకు ఏమాత్రం టైమ్ దొరికినా అత్తింటివాళ్లు బాకీపడ్డ అదనపు కట్నం గురించి అదేపనిగా గుర్తొస్తుంది. అలాంటిది లాక్డౌన్ పుణ్యమా అని అతడు రోజంతా ఇంట్లోనే ఉన్నాడు. మాటలతోనే ఇంట్లో వరకట్న హింసను సృష్టించాడు. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. లాక్డౌన్ టైమ్‌లో ప్రపంచవ్యాప్తంగా మహిళలు రకరకాల హింసలు ఎదుర్కొన్నారు. ఈ హింసపై ఐక్యరాజ్య సమితి సాధికారికమైన నివేదికను ప్రచురించింది. దీనిని ఆధారం చేసుకొని అమెరికాలో స్థిరపడిన మలయాళీ డైరెక్టర్ లీజా మాథ్యూ ‘కేజ్డ్’ పేరుతో షార్ట్‌ఫిల్మ్ రూపొందించింది. లాక్డౌన్ టైమ్‌లో అక్షరజ్ఞానం లేని మహిళలతో పాటు బాగా చదువుకున్న మహిళలు, ఇంటిపనులకే పరిమితమైన వారితో పాటు, ఉద్యోగాలు చేస్తున్న మహిళలు ఎదుర్కున్న మానసిక, శారీరక, భావోద్వేగ హింసకు ‘కేజ్డ్’ అద్దం పడుతుంది. చిత్రంలో సంద్ర, జయ, విను, క్లైర్ ప్రధాన పాత్రలు. ప్రాంతం, దేశంతో సంబంధం లేకుండా ప్రపంచంలోని వివిధ రకాల హింస బాధితులకు వీరు ప్రతీకలు. నిజానికి వీరు చిత్రం కోసం బాధితుల అవతారం ఎత్తిన వారు కాదు. నిజజీవితంలోనూ బాధితులే. సంద్ర, జయ, విను, క్లైర్ పాత్రలు పోషించిన సచిన్మై మేనన్, దివ్య సంతోష్, శిల్పఅరుణ్ విజయ్, రిలే పూల్‌లు భిన్నరకాల హింస బాధితులే. రిలే పూల్ విషయానికి వస్తే నిజజీవితంలోనూ ట్రాన్స్జండరే. ‘యువ అమెరికన్లపై హింస జరిగితే, తేరుకొని తిరిగిపోరాడతారు. మనదేశంలో మాత్రం అలాంటి పరిస్థితి లేదు. దీనికి రకరకాల కారణాలు ఉండొచ్చు. ముఖ్యంగా గృహహింసకు సంబంధించిన కేసుల్లో చాలామంది మౌనంగా ఉంటున్నారు. మానసికహింస భౌతికహింస కంటే తక్కువేమీ కాదు’ అంటుంది లీజా మాథ్యూ. కొట్టాయం (కేరళ)కు చెందిన లీజా మాథ్యూ గత పదిసంవత్సరాలుగా అమెరికాలో స్థిరపడింది. పద్దెనిమిది నిమిషాల నిడివి గల ‘కేజ్డ్’ మానసిక హింస నుంచి లైంగిక హింస వరకు మహిళలు ఎదుర్కొన్న రకరకాల హింసలను బయటపెడుతుంది. మొన్న మొన్నటి ముంబై ఇంటర్నేషనల్ ఫిల్మ్ఫెస్టివల్తో సహా లండన్ ఇండీ షార్ట్‌ఫిల్మ్ ఫెస్టివల్, నయాగరా ఫాల్స్ షార్ట్ ఫెస్టివల్, టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్... ఎన్నో చిత్రోత్సవాలలో ప్రదర్శితమై రకరకాల ప్రగతిశీల చర్చలకు కేంద్ర బిందువుగా నిలిచింది. -
కడుపు తరుక్కుపోయే దారుణం.. నోటికి టేప్ వేసి, కుక్కల బోనులో బంధించి
వాషింగ్టన్: ఆ ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. తల్లిదండ్రులకు భారమై అనథాశ్రమంలో చేరారు. ఓ రోజు ఇద్దరు దంపతులు వచ్చి.. ఆ అక్కాచెల్లళ్లను దత్తత తీసుకున్నారు. తల్లిదండ్రుల ప్రేమ, సంరక్షణ దొరికిందని ఆ చిన్నారులు ఎంతో సంతోషించారు. కానీ ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేవదు. చిన్నారులను దత్తత తీసుకున్న దంపతులు రాక్షసులు, సైకోలు. ఈ క్రమంలో దత్తత తీసుకున్న వారిలో ఓ చిన్నారిని అత్యంత పాశవీకంగా హత్య చేశారు. ఈ దారుణం అమెరికాలో సంచలనం సృష్టించింది. కనీసం అనాథశ్రమంలో ఉంటేనైనా చిన్నారి బతికి ఉండేది కదా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అమెరికన్లు. ఆ వివరాలు.. హవాయికి చెందిన దంపతులు ఐజాక్ కలువా (52), లెహువా కలువా (43) దంపతులు హత్య గావించబడిన ఇసాబెల్లాను 2018లో దత్తత తీసుకున్నారు. ఇసబెల్లా కంటే ముందు ఆమె సోదరిని 2009లో దత్తత తీసుకున్నారు కలువా దంపతులు. ఆ తర్వాత ఇసబెల్లా మరో ఇద్దరు తోబుట్టువులను 2018, 2020లో దత్తత తీసుకున్నారు. ఇసాబెల్లా తల్లిదండ్రులు వైమన ప్రాంతంలో నివసిస్తుండేవారు. వారు కటిక పేదరికం అనుభవిస్తుండటంతో పిల్లలను కలువా దంపతులకు దత్తతకు ఇచ్చారు. (చదవండి: అమెరికా జర్నలిస్ట్‌కి 11 ఏళ్లు జైలు శిక్ష) కలువా దంపతులు రాక్షసులకు మారుపేరులాంటి వారు. చిన్నారులను దత్తతకు తీసుకున్న వీరు వారిని చిత్రహింసలకు గురి చేసేవారు. ఈ క్రమంలోనే ఆరేళ్ల ఇసాబెల్లాను అత్యంత దారుణంగా హింసించేవారు. చిన్నారికి సరిగా తిండి పెట్టేవారు కారు. ఆకలికి తట్టుకోలేక రాత్రిళ్లు లేచి ఆహారం కోసం వెదికేది ఇసాబెల్లా. ఈ క్రమంలో కలువా దంపతులు ఇసాబెల్లాను బంధించడం కోసం కుక్కల బోనును ఆన్లైన్లో ఆర్డర్ చేసి తెప్పించారు. చిన్నారిని హత్య జరిగిన నాడు.. రోజు లానే ఇసాబెల్లాకు ఆహారం పెట్టకుండా హింసించారు. రాత్రిళ్లు ఆహారం కోసం వెదకకుండా ఉండేందుకు గాను ఇసాబెల్లా నోటికి, చేతులకు డక్ టేప్ వేసి కుక్కల బోనులో బంధించారు. ఆ తర్వాత బోనును బాత్రూంలో పెట్టారు. (చదవండి: కోట్లలో ఒకరు... ఈ కోర్ట్ని!) ఈ క్రమంలో ఇసాబెల్లా కన్నా ముందు కలువా ఇంటికి దత్తత వచ్చిన ఆమె సోదరి.. చెల్లెలు బెడ్ మీద కనిపించకపోవడంతో ఇల్లంతా వెదికింది. బాత్రూంలో కుక్కల బోనులో ఉన్న ఇసాబెల్లాను గుర్తించి.. బెడ్రూంలోకి తీసుకువచ్చింది. అప్పటికే ఇసాబెల్లా అపస్మారక స్థితిలో ఉంది. దీని గురించి బాధిత చిన్నారి అక్క కలువా దంపతులకు చెప్పింది. వారు వచ్చి ఇసాబెల్లాను బాత్‌టబ్‌లో పడుకోబెట్టి నీరు పెట్టారు. కానీ ఇసాబెల్లా మేల్కొలేదు. చిన్నారి చనిపోయినట్లు నిర్ధారించుకున్న కలువా దంపతులు.. మిగతా పిల్లలకు తెలియకుండా బాలిక మృతదేహాన్ని మాయం చేశారు. దీని గురించి ఎవరికి చెప్పవద్దని ఇసాబెల్లా అక్కను బెదిరించారు. అనంతరం బాత్‌టబ్, కుక్కల బోనును ధ్వంసం చేశారు. ఆ తర్వాత ఐజాక్ కలువ తనకు కోవిడ్ లక్షణాలు ఉన్నాయని చెప్పి.. ఆస్పత్రిలో చేరాడు. (చదవండి: కాబోయే కోడలు కన్నకూతురని తెలిసింది.. ట్విస్ట్ ఏంటంటే ) 2021, సెప్టెంబర్ 12న ఇసాబెల్లాను హత్య చేసిన నెల రోజుల తర్వాత అనగా అక్టోబర్ 12న కలువా దంపతులు అనుమానం రాకుండా ఉండటం కోసం చిన్నారి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాదాపు నెల రోజుల పాటు పోలీసులు దర్యాప్తు చేశారు. ఇసాబెల్లా కోసం వందలాది మంది వలంటీర్లు గాలించారు. చిన్నారి వారి సొంత తల్లిదండ్రుల దగ్గరకి వెళ్లి ఉంటుందని భావించి.. వైమన ప్రాంతం అంతా గాలించారు. చిన్నారి అదృశ్యానికి సంబంధించి చిన్న ఆధారం కూడా దొరక్కపోవడంతో పోలీసులు డిటెక్టివ్ సాయం కూడా తీసుకున్నారు. విచారణలో భాగంగా ఇసాబెల్లా అక్క జరిగిన దారుణం గురించి డిటెక్టివ్‌కు వివరించింది. ఈ క్రమంలో పోలీసులు కలువా దంపతుల ఆన్లైన్ ఆర్డర్ హిస్టరీ గురించి చెక్ చేయగా కుక్కల బోను ఆర్డర్ చేసినట్లు తెలిసింది. (చదవండి: పిల్లల దత్తత పేరుతో రూ.8.34 లక్షలు వసూలు.. ఆపై) ఆధారులు అన్ని సేకరించిన హోనలులూ పోలీసు డిపార్ట్మెంట్ అధికారులు కలువా దంపతులును అరెస్ట్ చేశారు. విచారణలో కోర్టు కలువా దంపతులు క్షమాభిక్షకు అనర్హులని తేల్చింది. చిన్నారి కనీసం అనాథశ్రమంలో ఉంటే బతికి ఉండేదని.. ఈ హింస తప్పేదని కోర్టు విచారణ వ్యక్తం చేసింది. కలువా దంపతులు కఠిన శిక్షకు అర్హులని తేల్చింది. చదవండి: ఆమెకు గర్భసంచితోపాటు.. ప్రేమ సంచి కూడా ఉంది.. -
67ఏళ్ళ జైలు జీవనాన్ని గడిపి, ప్రాణాలు విడిచింది!
ప్రకృతి వనాల మధ్య, పచ్చని చెట్లతో దట్టంగా ఉండే అడవుల్లో గుంపులతోపాటు ఉండాల్సిన ఏనుగు.. తన సుదీర్ఘ జీవనాన్ని కాంక్రీట్ జంగిల్ లో ఒంటరిగా గడిపి, చివరికి ప్రాణాలు విడిచింది. జపాన్ లోని ఇనోకాషిరా పార్క్ జ్యూలో బందీగా 67 ఏళ్ళపాటు ఒంటరి జీవితం గడిపిన హనాకో విముక్తికోసం... అంతర్జాతీయ ప్రచారం జరిగినా లాభం లేకపోయింది. చివరికి 69 ఏళ్ళ వృద్ధాప్యంతోపాటు, తీరని ఒంటరితనం ఆ ఏనుగు ప్రాణాలు తీసింది. 'వరల్డ్స్ లోన్లీయెస్ట్ ఎలిఫెంట్' గా పేరొందిన 69 ఏళ్ళ ఏనుగు 'హనాకో' జపాన్ జ్యూలో మరణించింది. ఏడాది క్రితం ఓ టూరిస్టు తీసిన వీడియోను వీక్షించిన జనం ... దాన్నిబంధనాలనుంచి విముక్తురాలిని చేసేందుకు ఎంతో ప్రయత్నించారు. వీడియోలో ఎంతో విచార వదనంతో కనిపించిన ఏనుగును ఎలాగైనా రక్షించాలనుకున్నారు. కాంక్రీట్ జైల్లో మగ్గిపోతున్న జంతువును ప్రకృతి వనాల మధ్య విడిచిపెట్టాలంటూ డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. హనాకో ఉన్న ఎన్ క్లోజర్ ఓ రాతి జైలులా , అత్యంత క్రూరత్వాన్ని ప్రదర్శించే జ్యూలా ఉందంటూ టూరిస్ట్ ఉలారా నగగావా ఆందోళన వ్యక్తం చేసింది. చివరికి ఆ ఒంటరి ఏనుగును విశాల ప్రపంచంలోకి వదిలెయ్యాలంటూ అంతర్జాతీయంగా ఓ పిటిషన్ కూడ దాఖలు చేసింది. అయితే జ్యూ సిబ్బంది మాత్రం అందుకు ఒప్పుకోలేదు. సుదీర్ఘ జీవితం ఒంటరిగానే గడిపిన ఆ ఏనుగును తిరిగి ఇతర గుంపులు తమతో కలుపుకోలేవని, పైగా ఇబ్బందులకు గురి చేస్తాయని తెలిపారు. దాంతో సుమారు 500,000 మంది సంతకాలు చేసి పిటిషన్ వేసినా...ఉపయోగం లేకపోయింది. అప్పటికే హనాకో వయసు కూడ మీరిపోవడంతో చేసేది లేకపోయింది. హనాకో ఉదయం సమయంలో ఓ పక్కకు తిరిగి పడుకోవడం చూశామని, అనుమానం వచ్చి అప్పట్నుంచీ దాని ఆరోగ్యాన్ని రక్షించేందుకు ఎంతో ప్రయత్నం చేసినా ఉపయోగం లేకపోయిందని, మధ్యాహ్నం సమయానికి అది మరణించిందని జ్యూ ప్రతినిధి ఒకరు తెలిపారు. రెండేళ్ళ వయసులో ఒంటరిగా థాయిల్యాండ్ అడవిలో నివసిస్తున్న ఏనుగు పిల్లను (హనాకో) అధికారులు అప్పట్లో జ్యూకి బహుమతిగా ఇచ్చారు. అప్పట్నుంచీ సుమారు ఆరు దశాబ్దాలకు పైగానే కొద్దిపాటి పచ్చదనంతో కూడిన కాంక్రీట్ ఎన్ క్లోజర్ లోఒంటరిగానే జీవనం గడిపింది. హనాకో మరణవార్త సోషల్ మీడియాలో సంచలనం రేపింది. విషాద వార్తను చూసిన జనం నివాళులర్పించారు. వందలకొద్దీ షేర్లు చేశారు. ఏనుగును బంధించిన జపాన్ జ్యూ సిబ్బంది తీరుపై ఇబ్బడి ముబ్బడిగా ట్విట్టర్ లోనూ, ఫేస్ బుక్ లోనూ విమర్శలు గుప్పించారు.