లోటస్ పాండ్లో వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలను పార్టీ నేతలు ఆదివారం లోటస్ పాండ్లో నిర్వహించారు. ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి విజయ సాయిరెడ్డి తదితరులు...కేక్ కట్ చేశారు. తమ ప్రియతమ నేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
పలువురు నేతలు రక్తదానం చేశారు. పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. అనాథ పిల్లలకు వైఎస్ఆర్ సీపీ ఐటీ వింగ్ ఆర్థికసాయం చేసింది. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు. మరోవైపు వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా కార్యకర్తలు, పార్టీ నేతలు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.