cakrasnanam
-
చక్రస్నానంతో ముగిసిన బ్రహ్మోత్సవాలు
వడమాలపేట, న్యూస్‌లైన్: అప్పలాయిగుంట ప్రసన్న వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం చక్రస్నానంతో ముగిశాయి. తెల్లవారుజామున 5 గంటలకు స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపిన అర్చకులు అర్చన, శుద్ధి, తోమాలసేవ, బలిహరణ అనంతరం శ్రీవారి మూలవర్లకు, పద్మావతి, ఆండాళ్ అమ్మవార్లకు అభిషేకం చేశారు. భక్తుల సర్వదర్శనం అనంతరం వాహన మండపంలో శ్రీవారి వేంచేపు, సమర్పణ జరిగింది. స్వామివారు ఉభయదేవేరులు ఎదురెదురుగా పల్లకీలో ఆశీనులై పురవీధుల్లో ఊరేగారు. అనంతరం ఉభయ నాంచారులతోపాటు స్వామివారికి స్నపన తిరుమంజనం గావించారు. 10 గంటలకు వేదపండితులు శాస్త్రోక్తంగా చక్రస్నానం గావించారు. స్వామివారి చక్రస్నానాన్ని తిలకించిన భక్తులు కోనేరులో మునక వేశారు. రాత్రికైంకర్యాల తరువాత నవసంధి, మాడవీధుల ఉత్సవం నిర్వహిం చారు. రాత్రి 7 గంటలకు ధ్వజావరోహణ కార్యక్రమం, ప్రత్యేక నైవేద్యం జరిగింది. 8 గంటలకు అర్చకులకు బహుమానాలతో బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమంలో ప్రత్యేక డెప్యూటీ ఈవో భాస్కర్‌రెడ్డి, ఏఈవో నాగరత్నమ్మ, ఆలయాధికారి శ్రీనివాసులు, వేదపండితులు సూర్యకుమారాచార్యులు, రమణాచార్యులు, రమేషాచార్యులు, నరసిం హాచార్యులు, టీటీడీ సిబ్బంది పాల్గొన్నారు. -
వేడుకగా చక్రస్నానం
కార్వేటినగరం, న్యూస్‌లైన్: కార్వేటినగరం వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన గురువారం ఉదయం చక్రస్నానం అత్యంత వైభవంగా నిర్వహించారు. స్కంధ పుష్కరిణిలో కంకణభట్టు సుందరవరదాచార్యులు, కిరణ్ భట్టాచార్యులు శాస్త్రోక్తంగా ఈ ఉత్సవాన్ని నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి తోమాల, అర్చన, శుద్ధి, కొలువు, మొదటి గంట, నిత్యకైంకర్యాలు నిర్వహించారు. అనంతరం వేణుగోపాలస్వామిని ఓ వైపు, రుక్మిణీ సత్యభామలను మరో వైపు పల్లకిలో అధిష్టింపజేశారు. చక్రత్తాళ్వారు ముందు వెళుతుండగా వెనుక ఉభయ దేవేరులతో స్వామివారు పురవీధుల్లో ఊరేగుతూ పుష్కరిణి వద్దకు చేరుకున్నారు. ఉభయనాంచారుల సమేతుడైన వేణుగోపాలస్వామికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, తేనె, పసుపు, చందనం, నెయ్యి, తైలం, నారికేళి జలాలతో అభిషేకించారు. స్వామివారికి నైవేద్యాలు సమర్పించారు. ప్రత్యేక పూజల అనంతరం చక్రస్నాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మేళతాళాలు, మత్రోచ్ఛారణల మధ్య స్కంధ పుష్కరిణిలో స్వామివారి ఇష్టాయుధమైన (చక్రత్తాళ్వారుకు) చక్రానికి స్నానం చేయించారు. ఆ సమయంలో పుష్కరిణిలో స్నానం చేయడానికి భక్తులు పోటీపడ్డారు. సాయంత్రం స్వామికి తిరివీధి ఉత్సవం , రాత్రి కుంభప్రోక్షణ, పూర్ణాహుతి, ధ్వజావరోహణంతో వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. డెప్యూటీ ఈవో హరినాథ్, సూపరింటెండెంట్ పీతాంబరరాజు, ఆలయాధికారి సిద్దారెడ్డి, జమేదార్ శివకేశవులు, వోఎస్డబ్ల్యూ శ్రీనివాసులు పాల్గొన్నారు. -
నేత్రపర్వం... కోదండరాముని చక్రస్నానం
తిరుపతి కల్చరల్, న్యూస్‌లైన్: శ్రీకోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజైన శనివారం కపిలతీర్థం పుష్కరిణిలో చక్రస్నా నం నేత్ర పర్వంగా జరిగింది. విశేష సంఖ్యలో భక్తు లు పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించారు. తొలుత లక్ష్మణ సమేత సీతారాములవారు పల్లకిలో కపిలతీర్థానికి వేంచేశారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు శ్రీవేణుగోపాలస్వామి ఆలయ మండపంలో స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహిం చారు. ఇందులో సీతారామలక్ష్మణ సరసన చక్రత్తాళ్వార్లు పాలు, పెరుగు, నెయ్యి, పండ్ల రసాలతో అభిషేకాలు అందుకుని ప్రసన్నులయ్యారు. అనంతరం అర్చకుల వేదమంత్రోచ్ఛారణల నడుమ శా స్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. మధ్యాహ్నం 11.30 గంటలకు స్వామివారు పీఆర్ తోటకు వేంచేశారు. సాయంత్రం 5 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి తీర్థకట్టవీధి, కోటకొమ్మలవీధి, కొత్తవీధి మీదుగా కోదండరామాలయానికి చేరుకున్నా రు. మధ్యలో శ్రీఆంజనేయస్వామి ఆలయంలో ఆ స్థానం నిర్వహించారు. రాత్రి 7.30 నుంచి 9 గం టల వరకు తిరుచ్చి ఉత్సవం, శ్రీభాష్యకార్లవారికి యిహల్పడి ఆరగింపు నిర్వహించారు. 9 నుంచి 10 గంటల వరకు ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవా లు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా టీటీడీ తిరుపతి జేఈవో పోలా భాస్కర్ మాట్లాడుతూ కోదండరాముని బ్రహ్మోత్సవాలను తొమ్మిది రోజు లపాటు వైభవంగా నిర్వహించినట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో ఏర్పాటు చేసిన రామకోటి లేఖనం, మహతి కళాక్షేత్రం, రా మచంద్ర పుష్కరిణి వద్ద ఏర్పాటు చేసిన ఆధ్యాత్మి క, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలకు భక్తు ల నుంచి విశేష స్పందన వచ్చిందని పేర్కొన్నారు. టీటీడీ పెద్దజీయంగార్, చిన్నజీయంగార్, స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవోలు హరీంద్రనాథ్, శ్రీ ధర్, ఏఈవో ప్రసాదమూర్తిరాజు, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు. కమనీయం.. నృత్యరూపకం శనివారం రాత్రి మహతి కళాక్షేత్రంలో ప్రదర్శించిన శ్రీరామచంద్ర విజయం నృత్యరూపకం కమనీయం గా సాగింది. టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో మహతి, రామచంద్ర పుష్కరిణి వేదికలపై ఈ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిం చారు. మహతిలో ఎస్వీ సంగీత, నృత్య కళాశాలకు చెందిన జమునారాణి ఆధ్వర్యంలో రామచంద్ర విజయం నృత్యరూపకాన్ని ప్రదర్శించారు. రామచంద్ర పుష్కరిణి వద్ద వరంగల్‌కు చెందిన గడ్డం యాదగిరి ఆధ్వర్యంలో ప్రదర్శించిన లవకుశ యక్షగానం భక్తులను ఆకట్టుకుంది.