నేత్రపర్వం... కోదండరాముని చక్రస్నానం
తిరుపతి కల్చరల్, న్యూస్‌లైన్: శ్రీకోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజైన శనివారం కపిలతీర్థం పుష్కరిణిలో చక్రస్నా నం నేత్ర పర్వంగా జరిగింది. విశేష సంఖ్యలో భక్తు లు పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించారు. తొలుత లక్ష్మణ సమేత సీతారాములవారు పల్లకిలో కపిలతీర్థానికి వేంచేశారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు శ్రీవేణుగోపాలస్వామి ఆలయ మండపంలో స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహిం చారు.
ఇందులో సీతారామలక్ష్మణ సరసన చక్రత్తాళ్వార్లు పాలు, పెరుగు, నెయ్యి, పండ్ల రసాలతో అభిషేకాలు అందుకుని ప్రసన్నులయ్యారు. అనంతరం అర్చకుల వేదమంత్రోచ్ఛారణల నడుమ శా స్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. మధ్యాహ్నం 11.30 గంటలకు స్వామివారు పీఆర్ తోటకు వేంచేశారు. సాయంత్రం 5 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి తీర్థకట్టవీధి, కోటకొమ్మలవీధి, కొత్తవీధి మీదుగా కోదండరామాలయానికి చేరుకున్నా రు.
మధ్యలో శ్రీఆంజనేయస్వామి ఆలయంలో ఆ స్థానం నిర్వహించారు. రాత్రి 7.30 నుంచి 9 గం టల వరకు తిరుచ్చి ఉత్సవం, శ్రీభాష్యకార్లవారికి యిహల్‌పడి ఆరగింపు నిర్వహించారు. 9 నుంచి 10 గంటల వరకు ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవా లు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా టీటీడీ తిరుపతి జేఈవో పోలా భాస్కర్ మాట్లాడుతూ కోదండరాముని బ్రహ్మోత్సవాలను తొమ్మిది రోజు లపాటు వైభవంగా నిర్వహించినట్లు తెలిపారు.
బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో ఏర్పాటు చేసిన రామకోటి లేఖనం, మహతి కళాక్షేత్రం, రా మచంద్ర పుష్కరిణి వద్ద ఏర్పాటు చేసిన ఆధ్యాత్మి క, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలకు భక్తు ల నుంచి విశేష స్పందన వచ్చిందని పేర్కొన్నారు. టీటీడీ పెద్దజీయంగార్, చిన్నజీయంగార్, స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవోలు హరీంద్రనాథ్, శ్రీ ధర్, ఏఈవో ప్రసాదమూర్తిరాజు, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.
కమనీయం.. నృత్యరూపకం
శనివారం రాత్రి మహతి కళాక్షేత్రంలో ప్రదర్శించిన శ్రీరామచంద్ర విజయం నృత్యరూపకం కమనీయం గా సాగింది. టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో మహతి, రామచంద్ర పుష్కరిణి వేదికలపై ఈ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిం చారు. మహతిలో ఎస్వీ సంగీత, నృత్య కళాశాలకు చెందిన జమునారాణి ఆధ్వర్యంలో రామచంద్ర విజయం నృత్యరూపకాన్ని ప్రదర్శించారు. రామచంద్ర పుష్కరిణి వద్ద వరంగల్‌కు చెందిన గడ్డం యాదగిరి ఆధ్వర్యంలో ప్రదర్శించిన లవకుశ యక్షగానం భక్తులను ఆకట్టుకుంది.