call deta
-
కేరాఫ్ కాంట్రవర్సీ
ఒక్కసారి మనం కాంట్రవర్సీలో కాలు పెడితే చాలు తర్వాత అక్కర్లేని కాంట్రవర్సీలన్నీ వచ్చి చుట్టుకుంటాయి అని చెప్పటానికి కంగనా రనౌత్ ఓ ఉదాహరణ. విషయం ఏంటంటే.. సీడీఆర్ (కాల్ డీటైల్ రికార్డ్) వివాదం. ప్రస్తుతం బాలీవుడ్లో హాట్ టాపిక్. బాలీవుడ్ సెలబ్రిటీ లాయర్ రిజ్వాన్ సిద్ధికీ చట్ట వ్యతిరేకంగా తన క్లైయింట్స్‌కు సీడీఆర్‌లు అందిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. నటుడు నవాజుద్దిన్ సిద్ధికీ భార్య కాల్ డేటాను అక్రమ మార్గాల్లో సంపాదించారని లాయర్ రిజ్వాన్‌ను అదుపులోకి తీసుకున్నారు థానే పోలీసులు. తీగ లాగితే డొంక కదిలినట్టు ఇప్పుడీ కేసు కంగనా కాలుకి కూడా చుట్టుకుంది. ఈ సీడీఆర్ వివాదంలో కంగనా కూడా ఉన్నారంటూ ఆరోపించారు థానే పోలీసులు. ‘‘కంగనా–హృతిక్ రోషన్ ప్రేమ వ్యవహారం కేసు విషయం ఇంకా నడుస్తున్న విషయం తెలిసిందే. 2016లో లాయర్ రిజ్వాన్‌కు కంగనా హృతిక్ రోషన్ నంబర్‌ను ఇచ్చినట్టు మా ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. దాని వెనకాల అసలు కారణం ఏంటో తెలియాల్సి ఉంది’’ అని పేర్కొన్నారు థానే పోలీసులు. దానికి కంగనా సిస్టర్ రంగోలీ స్పందిస్తూ – ‘‘ఏదైనా కోర్ట్ నోటీసుకి రెస్పాండ్ అయినప్పుడు మా డీటైల్స్ అన్నీ లాయర్‌కు సమర్పిస్తాం. వాటిని ఆధారం చేసుకొని మేము చట్టాన్ని అతిక్రమిస్తున్నాం అని ఊహించేసుకొని వాటి ద్వారా స్టేట్మెంట్స్ పాస్ చేయడం ఒక ఆర్టిస్ట్‌ని తక్కువ చేయడమే అవుతుంది. అది తప్పు. పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ జరిపాక ఆరోపణలు చేస్తే బావుంటుంది’’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు. -
'కాల్ డేటా వివరాలు ఇప్పించండి'
విజయవాడ: ఫోన్ ట్యాపింగ్ కేసులో విజయవాడ చీఫ్ మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో వాదనలు ముగిశాయి. ఈ సందర్భంగా సిట్ తరుపున అడ్వకేట్ జనరల్ వేణుగోపాలరావు వాదనలు వినిపించారు. సీఆర్ పీసీ 174 కింద కాల్ డేటాను ఇవ్వాలని టెలికాం ఆపరేటర్లను ఆదేశించాల్సిందిగా ఆయన కోర్టును కోరారు. అయితే, కాల్ డేటా వివరాలను వెల్లడించడం చట్ట విరుద్ధమవుతుందని టెలికాం ఆపరేటర్లు వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వులో పెట్టారు. -
సమస్యలున్నాయి.. డేటా ఇవ్వలేం
విజయవాడ: ఓటుకు నోటు కేసుకు సంబంధించి మత్తయ్య ఫోన్ కాల్ డేటా వివరాలను ఏపీ సీఐడీ టెలికాం కంపెనీలను కోరింది. అయితే తమకు న్యాయపరమైన చిక్కులు ఉన్నందున వివరాలు ఇవ్వలేమంటూ టెలికం కంపెనీలు తేల్చేశాయి. అందుకు ఒప్పుకున్న ఏపీ సీఐడీ ఇవ్వకుంటే సరేగానీ.. సమాచారం మాత్రం భద్రపరచాలని కంపెనీలను కోరింది. -
గుట్టంతా కాల్ డేటాలోనే దాగుంది
-
గుట్టంతా కాల్డేటాలోనే దాగుంది
న్యూఢిల్లీ: చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో ఎర్రచందనం కూలీల ఎన్కౌంటర్ పూర్తిగా బూటకమని మధురై కేంద్రంగా పనిచేస్తోన్న పీపుల్స్ వాచ్ సంస్థ డైరెక్టర్ హెన్రీ టిపాగ్నే అన్నారు. ఏపీలోకి ప్రవేశించిన తరువాత కూలీలను సజీవంగా పట్టుకున్న పోలీసులు.. డీఐజీ కార్యాలయం నుంచి అడవిలోకి తీసుకెళ్లి వారిని కాల్చిచంపారని మంగళవారం మానవహక్కుల వేదిక ఎదుట వాదనలు వినిపించారు. కూలీల మొబైల్ ఫోన్లు లాక్కున్న పోలీసులు.. వాటినుంచే కూలీల కుటుంబ సభ్యులకు కాల్స్ చేసి బెదిరించారని, కాల్ డేటా బయటికివస్తే నిజానిజాలు వెల్లడవుతాయన్నారు. ఎన్ కౌంటర్ జరిగిన రోజు తెల్లవారుజామున 2:30 గంటలకు కూలీల ఫోన్లన్నీ స్విచ్చాఫ్ అయ్యాయని, సాక్షుల వాగ్మూలాన్ని బట్టిచూస్తే తమ వాదన నూటికి నూరుపాళ్లూ నిజమేనని హెన్రీ అన్నారు. పోలీసులు చేసిన కాల్స్ రికార్డయ్యాయని, వాటిని బయటపెట్టాల్సిందిగా ఏపీ ప్రభుత్వాన్ని ఎన్ హెచ్చార్సీ ఇప్పటికే ఆదేశించిందన్నారు. అయితే ఈ విషయంలో ప్రభుత్వం అన్నివిషయాలను దాటవేస్తోందని ఆరోపించారు. తమ దగ్గర ఉన్న పూర్తి వివరాలతో ఏపీ హైకోర్టును ఆశ్రయిస్తామని, తగిన ఉత్తర్వులు వస్తాయని ఆశిస్తున్నామని హెన్రీ పేర్కొన్నారు.