called
-
ఈ గడ్డ నుంచి గర్వించదగ్గ న్యాయకోవిదులు వచ్చారు..
సాక్షి, హైదరాబాద్: ఈ తెలంగాణ గడ్డ నుంచి దేశం గర్వపడేలా ఎందరో న్యాయకోవిదులు వచ్చారని, వారి వారసత్వాన్ని కొనసాగించాలని న్యాయవాదులకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వెంకటనారాయణ భట్టి పిలుపునిచ్చారు. తనకు 30 ఏళ్లకుపైగా ఈ కోర్టుతో అనుబంధం ఉందన్నారు. అంకితభావంతో పనిచేస్తే న్యాయవాదులు ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని చెప్పారు. ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ఇటీవల సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి పొందారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా తెలంగాణ హైకోర్టు బార్ అసోసియేషన్(హెచ్‌సీఏఏ) శుక్రవారం ఆయన్ను ఘనంగా సన్మానించింది.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జస్టిస్ భట్టి మాట్లాడుతూ తన అన్న న్యాయవాదిగా ఎన్రోల్ అయినప్పుడు తొలిసారి ఈ కోర్టుకు వచ్చానని, అప్పుడే న్యాయవాది కావాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. మొదటి కోర్టు హాల్లో ఎక్కువగా ఉండటంతో లభించిన గుర్తింపు కూడా హైకోర్టు జడ్జి కావడానికి దోహదపడిందన్నారు. కార్యక్రమంలో హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, పలువురు న్యాయమూర్తులతోపాటు బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నర్సింహారెడ్డి, అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ సునీల్ గౌడ్, పీపీ రాజేందర్‌రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పల్లె నాగేశ్వర్రావు, ఉపాధ్యక్షుడు కల్యాణ్‌రావు, ప్రదీప్, దేవేందర్, నాగులూరి కృష్ణకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
‘నాన్నా నేను బతికే ఉన్నాను’.. తలకొరివి పెట్టేంతలో తండ్రికి ‘మృతురాలి’ నుంచి ఫోన్..
ఓ తండ్రి తన కుమార్తె మృతదేహానికి తల కొరివి పెట్టేందుకు అంతా సిద్ధం చేశాడు. ఆ ఇంటిలో మౌనం తాండవిస్తోంది. నెల రోజుల క్రితం అతని కుమార్తె ఇంటి నుంచి మాయమయ్యింది. తరువాత వారు ఒక మృతదేహానికి సంబంధించిన దుస్తులను చూసి, అది తమ కుమార్తె మృతదేహమేనని పోలీసులకు తెలిపారు. దీనిపై స్థానికులు కూడా విచారం వ్యక్తం చేశారు. ఇంతలో ఆ తండ్రికి..‘నాన్నా నేను బతికే ఉన్నాను. చనిపోలేదు’ అంటూ కుమార్తె దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఈ ఘటన బీహార్‌లోని పూర్ణియా జిల్లాలోని అక్బర్పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన అంశు కుమారి నెలరోజుల క్రితం ఇంటి నుంచి మాయమయ్యింది. కుటుంబ సభ్యులు ఆమె కోసం అన్నిచోట్లా గాలించారు. అయినా ఫలితం లేకపోయింది. అయితే రెండు రోజుల క్రితం పోలీసులు ఒక యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అంశు కుటుంబ సభ్యులు ఆ మృతదేహానికి ఉన్న దుస్తులు చూసి, అది తమ కుమార్తె మృతదేహమేనని పోలీసులకు తెలిపారు. ఆ మృతదేహం నీటిలో దొరికిన కారణంగా ముఖం పూర్తిగా ఉబ్బిపోయి ఉంది. దీంతో మృతదేహాన్ని గుర్తించడం కష్టంగా మారింది. అంశు తండ్రి ఆ మృతదేహానికి దహన సంస్కారాలు చేసేందుకు సిద్ధం అయ్యాడు. ఇంతలో ఆ తండ్రి మొబైల్‌కు ఒక వీడియో కాల్ వచ్చింది. దానిలో ‘నాన్నా.. నేను బతికే ఉన్నాను’ అంటూ అతని కుమార్తె తెలిపింది. అంతే .. అక్కడి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అక్కడున్నవారి ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. తిరిగి అతని కుమార్తె ఫోనులో.. తాను తన ప్రియుడిని వివాహం చేసుకోవాలనే ఉద్దేశంతో.. ఇంటి నుంచి పారిపోయానని తెలిపింది. ప్రస్తుతం అత్తవారింట్లో ఉన్నానని పేర్కొంది. అయితే పోలీసులకు లభ్యమైన ఆ యువతి మృతదేహం ఎవరిదనే ప్రశ్న ఇప్పుడు వారికి సవాల్‌గా నిలిచింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. ఇది కూడా చదవండి: కాఫీ షాప్‌లో ప్రేమ.. 4 ఏళ్ల సహజీవనం.. యూపీ యువకునితో దక్షిణ కొరియా యువతి వివాహం! -
మూడో టెస్టుకు వర్షం అడ్డంకి
మూడో రోజు ఆట పూర్తిగా రద్దు గ్రాస్ ఐలెట్: భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు మూడో రోజు ఆటను వరుణుడు అడ్డుకున్నాడు. ముందు రోజు రాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి మైదానం పూర్తిగా చిత్తడిగా మారడంతో ఆటగాళ్లు పెవిలియన్‌కే పరిమితమయ్యారు. గ్రౌండ్‌లోని ఏకైక సూపర్ సాపర్ ఎంత శ్రమించినా పూర్తిగా నీటిని తోడేయడం వీలు కాలేదు. దీంతో మూడో రోజు ఆట రద్దు చేశారు. అంతకుముందు రెండో రోజు బుధవారం ఆట ముగిసే సమయానికి విండీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 47 ఓవర్లలో వికెట్ నష్టానికి 107 పరుగులు చేసింది. క్రీజులో బ్రాత్‌వైట్ (143 బంతుల్లో 53 బ్యాటింగ్; 6 ఫోర్లు), డారెన్ బ్రావో (66 బంతుల్లో 18 బ్యాటింగ్; 2 ఫోర్లు) ఉన్నారు. తొలి వికెట్‌కు జాన్సన్ (23)తో కలిసి బ్రాత్‌వైట్ 59 పరుగులు జోడించాడు. స్కోరు వివరాలు: భారత్ తొలి ఇన్నింగ్స్: 353 వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్: బ్రాత్‌వైట్ బ్యాటింగ్ 53; జాన్సన్ రనౌట్ 23; డారెన్ బ్రావో బ్యాటింగ్ 18; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (47 ఓవర్లలో వికెట్ నష్టానికి) 107. వికెట్ల పతనం: 1-59. బౌలింగ్: భువనేశ్వర్ 11-4-11-0; షమీ 9-1-35-0; అశ్విన్ 13-4-17-0; ఇషాంత్ 7-0-26-0; జడేజా 7-2-9-0. -
'అలా పిలిస్తే నాకు అసహ్యం!'
న్యూయార్క్: సమాజంలోనూ, కార్యాలయాల్లోనూ మహిళలకు సమాన గౌరవం అందించడంపై... వ్యాపార రంగంలో వెలుగొందుతున్న మహిళా శక్తి, ప్రవాస భారతీయురాలు, పెప్సీకో సీఈవో ఇంద్రానూయి తన అభిప్రాయాలను విస్పష్టంగా వెలిబుచ్చారు. మహిళలకు సమాన హోదా అందిచాలన్నా, సమాన గౌరవం కల్పించాలన్నా తోటివారు స్వీటీ, హనీ అంటూ సంబోధించడం సరికాదని, అలా పిలవడాన్ని తాను ద్వేషిస్తానని ఆమె తెగేసి చెప్పారు. కార్యాలయాల్లో ఎవరైనా సరే సాటి మహిళను ముద్దు పేర్లతో పిలిచే సంప్రదాయాన్ని సమూలంగా మార్చేందుకు ప్రయత్నించాలంటూ న్యూయార్క్ లో జరిగిన మహిళల ప్రపంచ సమావేశంలో నూయి మనసులోని మాటను స్పష్టం చేశారు. ఏళ్ళ తరబడి మహిళలు సమాన హక్కులకోసం పోరాడుతూనే ఉన్నారని, ముఖ్యంగా కార్యాలయాల స్థాయిలో సమాన గౌరవాన్ని అందుకొనేందుకు వారు పాఠశాల స్థాయి నుంచే మగవారికి దీటుగా అన్ని హక్కుల్లోనూ పోటీ పడాలని, మంచి స్థాయిని సంపాదించాలని అన్నారు. అప్పుడే కార్యాలయాల్లో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొని రాణించవచ్చని, అత్యంత గౌరవాన్ని పొందవచ్చని సూచించారు. అలా కాకుండా మనం నేటికీ సమాన గౌరవం, సమాన హక్కులకోసం పోరాడుతూనే ఉన్నామన్నారు. ముఖ్యంగా మహిళలు పనిచేసే చోట ఒకరికి ఒకరు సహకరించుకోవడం కనిపించదని, ఒకరిపట్ట ఒకరు సోదరి భావం కలిగి ఉండటం ఎంతో అవసరమని, అదే మరింత బలాన్ని ఇస్తుందని నూయి తెలిపారు. ఓ మహిళ గురించి మరో మహిళ చెబితే మనం పెద్దగా పట్టించుకోమని, అదే విషయాన్ని ఓ పురుషుడు చెప్పినప్పుడు నమ్మేందుకు సిద్ధంగా ఉంటామని, అటువంటి మనస్తత్వాన్ని మార్చుకోవాలని సూచించారు. ముఖ్యంగా మహిళలు ఒకరికొకరు సహకరించుకోవడం, ఒకరి సలహాలు మరొకరు తీసుకోవడం మహిళాశక్తిగా మారేందుకు బలమైన మార్గమని నూయి అభిప్రాయపడ్డారు. వాస్తవానికి మహిళలు వ్యక్తిగత జీవితంలో ఎంతో సమర్థవంతంగా నెగ్గుకు వస్తారన్నారు. కుమార్తెగానూ, భార్యగానూ, తల్లిగానూ, కోడలుగానూ ఎన్నో ముఖ్యమైన పాత్రలు పోషిస్తారని అదే సమయంలో బిడ్డలకు జన్మనివ్వడం, పిల్లల సంరక్షణ, తల్లిదండ్రుల బాధ్యతలతో పాటు వృత్తి నిర్వహణలోనూ ముందుంటున్నారన్నారు. అటువంటి మహిళలకు సంఘాలు, ప్రభుత్వాలు, సంస్థలు ఎటువంటి గుర్తింపును, గౌరవాన్ని ఇస్తున్నాయో ఓసారి ఆలోచించాల్సిన అవసరం కూడ ఉందని ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళా వ్యాపారవేత్త నూయి ప్రశ్నించారు.