మూడో టెస్టుకు వర్షం అడ్డంకి
మూడో రోజు ఆట పూర్తిగా రద్దు
గ్రాస్ ఐలెట్: భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు మూడో రోజు ఆటను వరుణుడు అడ్డుకున్నాడు. ముందు రోజు రాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి మైదానం పూర్తిగా చిత్తడిగా మారడంతో ఆటగాళ్లు పెవిలియన్‌కే పరిమితమయ్యారు. గ్రౌండ్‌లోని ఏకైక సూపర్ సాపర్ ఎంత శ్రమించినా పూర్తిగా నీటిని తోడేయడం వీలు కాలేదు. దీంతో మూడో రోజు ఆట రద్దు చేశారు. అంతకుముందు రెండో రోజు బుధవారం ఆట ముగిసే సమయానికి విండీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 47 ఓవర్లలో వికెట్ నష్టానికి 107 పరుగులు చేసింది. క్రీజులో బ్రాత్‌వైట్ (143 బంతుల్లో 53 బ్యాటింగ్; 6 ఫోర్లు), డారెన్ బ్రావో (66 బంతుల్లో 18 బ్యాటింగ్; 2 ఫోర్లు) ఉన్నారు. తొలి వికెట్‌కు జాన్సన్ (23)తో కలిసి బ్రాత్‌వైట్ 59 పరుగులు జోడించాడు.
స్కోరు వివరాలు: భారత్ తొలి ఇన్నింగ్స్: 353
వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్: బ్రాత్‌వైట్ బ్యాటింగ్ 53; జాన్సన్ రనౌట్ 23; డారెన్ బ్రావో బ్యాటింగ్ 18; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (47 ఓవర్లలో వికెట్ నష్టానికి) 107. వికెట్ల పతనం: 1-59.
బౌలింగ్: భువనేశ్వర్ 11-4-11-0; షమీ 9-1-35-0; అశ్విన్ 13-4-17-0; ఇషాంత్ 7-0-26-0; జడేజా 7-2-9-0.