మోదీకి ఐఎంఎఫ్ మద్దతు
వాషింగ్టన్: అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్)ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేపట్టిన నల్లధనంపై యుద్ధానికి మద్దతు ప్రకటించింది. దేశలో పెరుగుతున్న అక్రమ ఆర్థిక లావాదేవీలు, అవినీతి నిరోధానికి రూ.500 రూ.1000 కరెన్సీ చెలామణీ రద్దును ఐఎంఎఫ్ స్వాగతించింది. కానీ ఈ ప్రక్రియలో "తెలివిగా" వ్యవహారించాలని సూచించింది.
భారతదేశంలాంటి ఆర్థికవ్యవస్థలో రోజువారీ లావాదేవీల్లో నగదు పాత్ర భారీగా ఉన్నప్పటికీ, ఈ కార్యక్రమాన్ని చాలా తెలివిగా ,ఎలాంటి అంతరాయంలేకుండా ముందు జాగ్రత్తతో నిర్వహించాలని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) ప్రతినిధి గెర్రీ రైస్ మీడియాకు చెప్పారు. భారత ప్రభుత్వం సంచలన నిర్ణయంపై స్పందన కోరినపుడు ఆయన ఇలా వ్యాఖ్యానించారు.ఇది అసాధారణమైన నిర్ణయం కాదనీ, దేశాల తరచూ ఇలాంటి చర్యలు తీసుకుంటాయని పేర్కొన్నారు. కానీ దీన్ని చాలా సమర్ధవంతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని రైస్ మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.