came to district
-
ఎట్టకేలకు స్టాంపులొచ్చేశాయ్!
- జిల్లాకు చేరిన రూ.6 కోట్ల 38 లక్షల విలువైన స్టాంపులు అనంతపురం టౌన్ : జిల్లా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు ఎట్టకేలకు రూ.6 కోట్ల 38 లక్షలు విలువ చేసే వివిధ రకాల స్టాంపులు వచ్చాయి. స్టాంపుల కొరతతో జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ విషయమై సాక్షి వరుస కథనాలు ప్రచురించింది. దీంతో జిల్లా యంత్రాంగంలో చలనం వచ్చింది. నెలల తరబడి స్టాంపులు లేకపోవడంతో తలెత్తుతున్న సమస్యలపై ఉన్నతాధికారులకు నివేదికలు పంపారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వారీగా ఎన్ని స్టాంపులు కావాలో అందులో పొందుపరిచారు. ఈ నేపథ్యంలో మంగళవారం రూ.6 కోట్ల 38 లక్షలు విలువ చేసే స్టాంపులు వచ్చాయి. అనంతపురం జిల్లా రిజిస్ట్రార్ పరిధిలోని 11 కార్యాలయాలకు రూ.3 కోట్ల 78 లక్షలు, హిందూపురం రిజిస్ట్రార్ పరిధిలోని 9 కార్యాలయాలకు రూ.2 కోట్ల 60 లక్షలు విలువైన సాంపులు సరఫరా అయ్యాయి. -
రైతు ఆత్మహత్యలపై ఆరా
అనంతపురం అగ్రికల్చర్ : ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల స్థితిగతులు తెలుసుకునేందుకు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖకు చెందిన అగ్రో ఎకనామిక్ రీసెర్చ్ సెంటర్ (ఏఈఆర్ఎస్) ప్రతినిధులు డాక్టర్ జే.రాంబాబు, డాక్టర్ ఎం.నాగేశ్వరరావు, డాక్టర్ బి.రాములతో కూడిన బందం శనివారం జిల్లాకు వచ్చింది. బందం సభ్యులు స్థానిక వ్యవసాయశాఖ కార్యాలయంలో అడిషినల్ డైరెక్టర్ సుశీల, జేడీఏ పీవీ శ్రీరామమూర్తిని కలిశారు. జిల్లాలో 2014 జూన్ నుంచి ఇప్పటివరకు బలవణ్మరాలకు పాల్పడిన రైతుల వివరాలు, పరిహారం అందిన రైతులు, అందని రైతుల వివరాలు తీసుకున్నారు. అనంతరం డీడీఏ ఎం.కష్ణమూర్తి, కదిరి ఏడీఏ వి.లక్ష్మానాయక్ను వెంటబెట్టుకుని బుక్కపట్నం మండలం యాదాలంకపల్లి, ఓడీ చెరువు మండలం వడ్డివారిపల్లి, అలాగే కదిరిలో రైతు కుటుంబాలు, పలువురు రైతులు, ఎన్జీఓ ప్రతినిధులను కలిసి వివరాలు సేకరించినట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకు 90 మంది వరకు రైతులు ఆత్మహత్యకు పాల్పడినట్లు జాబితాలో పొందుపరిచినట్లు తెలుస్తోంది.