ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల స్థితిగతులు తెలుసుకునేందుకు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖకు చెందిన అగ్రో ఎకనామిక్ రీసెర్చ్ సెంటర్ (ఏఈఆర్‌ఎస్) ప్రతినిధులు డాక్టర్ జే.రాంబాబు, డాక్టర్ ఎం.నాగేశ్వరరావు, డాక్టర్ బి.రాములతో కూడిన బందం శనివారం జిల్లాకు వచ్చింది.
అనంతపురం అగ్రికల్చర్ : ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల స్థితిగతులు తెలుసుకునేందుకు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖకు చెందిన అగ్రో ఎకనామిక్ రీసెర్చ్ సెంటర్ (ఏఈఆర్‌ఎస్) ప్రతినిధులు డాక్టర్ జే.రాంబాబు, డాక్టర్ ఎం.నాగేశ్వరరావు, డాక్టర్ బి.రాములతో కూడిన బందం శనివారం జిల్లాకు వచ్చింది. బందం సభ్యులు స్థానిక వ్యవసాయశాఖ కార్యాలయంలో అడిషినల్ డైరెక్టర్ సుశీల, జేడీఏ పీవీ శ్రీరామమూర్తిని కలిశారు. జిల్లాలో 2014 జూన్ నుంచి ఇప్పటివరకు బలవణ్మరాలకు పాల్పడిన రైతుల వివరాలు, పరిహారం అందిన రైతులు, అందని రైతుల వివరాలు తీసుకున్నారు.
అనంతరం డీడీఏ ఎం.కష్ణమూర్తి, కదిరి ఏడీఏ వి.లక్ష్మానాయక్‌ను వెంటబెట్టుకుని బుక్కపట్నం మండలం యాదాలంకపల్లి, ఓడీ చెరువు మండలం వడ్డివారిపల్లి, అలాగే కదిరిలో రైతు కుటుంబాలు, పలువురు రైతులు, ఎన్‌జీఓ ప్రతినిధులను కలిసి వివరాలు సేకరించినట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకు 90 మంది వరకు రైతులు ఆత్మహత్యకు పాల్పడినట్లు జాబితాలో పొందుపరిచినట్లు తెలుస్తోంది.