ఇసుక జీవోను రద్దు చేయాలని ధర్నా
పార్వతీపురం (విజయనగరం): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన ఇసుక జీవోను రద్దు చేయాలని విజయనగరం జిల్లాలోని పార్వతీపురం నగరంలో పలు సంఘాలు ధర్నాకు దిగాయి. ఈ ధర్నాకు విజయనగరంలోని భవన నిర్మాణ కార్మికులు, రైతుకూలీ, సీఐటీయూ సంఘాలు సోమవారం మద్దతు తెలిపాయి. సుమారుగా 500 మంది భవన నిర్మాణ కార్మికులు ర్యాలీగా వెళ్లి ఆర్టీసీ కాంప్లెక్స్‌లో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈ జీవోను రద్దు చేసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. పనులు లేక ఇక్కడి ప్రజలు వలస పోతున్నారని వెంటనే ఈ జీవోను రద్దు చేసుకోవాలని వారు డిమాండ్ చేశారు.