Candrababunayudu
-
చంద్రబాబు సీట్లు అమ్ముకుంటారు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ‘రానున్న ఎన్నికల్లో చంద్రబాబు డబ్బున్నవాళ్లకు సీట్లు అమ్ముకుంటారు. ఎన్నికల తర్వాత ఆ డబ్బుతో మూట, ముల్లె సర్దుకుని రాష్ట్రం నుంచి పారిపోతారు...’ అని విజయవాడ లోక్‌సభ సభ్యుడు, వైఎస్సార్సీపీ ఇన్చార్జి కేశినేని శ్రీనివాస్(నాని) అన్నారు. సీఎం వైఎస్ జగన్‌తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని, ప్రజలు కూడా తమకు మంచి చేస్తున్న ఆయన పక్షానే ఉన్నారని చెప్పారు. వైఎస్సార్ ఆసరా వారోత్సవాల్లో భాగంగా గురువారం విజయవాడ తూర్పు నియోజకవర్గంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కేశినేని నాని మాట్లాడుతూ పేదల కోసం సీఎం వైఎస్ జగన్ పనిచేస్తున్నారని, చంద్రబాబు మాత్రం ధనికుల కోసం పని చేస్తారని చెప్పారు. సమాజం బాగుండాలని వైఎస్ జగన్ కృషి చేస్తుంటే... బాబు మాత్రం తన కొడుకు కోసం తపనపడుతున్నారని మండిపడ్డారు. పేదల సంక్షేమం, అభివృద్ధి కోసం సీఎం జగన్‌లా పనిచేసే వారు ఈ దేశంలోనే ఎవరూ లేరన్నారు. సంక్షేమ పథకాల ద్వారా నేరుగా పేదల ఖాతాల్లోనే సుమారు రూ.2.50 లక్షల కోట్లు జమచేశారని, ఆ భగవంతుడే సీఎం జగన్ రూపంలో పేదలకు మేలు చేస్తున్నారని ప్రశంసించారు. పేదల కోసం సీఎం జగన్ ఇన్ని చేస్తుంటే రాష్ట్రం దివాలా తీసింది... అంటూ బాబు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎక్కడో మారుమూల ప్రాంతంలో చిన్నిచిన్న రోడ్ల ఫొటోలు తీసి పచ్చ పత్రికలో పెద్దగా ప్రచురిస్తున్నారని, తాను విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఎక్కడ చూసినా రోడ్లన్నీ బాగానే ఉన్నాయని నాని స్పష్టంచేశారు. వైఎస్సార్ ఆసరా కింద విజయవాడ నగరంలోని పొదుపు సంఘాల మహిళలకు రూ.350 కోట్లు ఇచ్చారంటే పేదలపట్ల సీఎం జగన్‌కు ఉన్న చిత్తశుద్ధి ఎలాంటిదో తెలుస్తుందన్నారు. ప్రతి పేద విద్యార్థి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్ఫూర్తితో ఉన్నత విద్య చదవాలని ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టారని గుర్తుచుశారు. వైఎస్సార్సీపీ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి దేవినేని అవినాష్ మాట్లాడుతూ నియోజకవర్గంలో రూ.650 కోట్లతో అభివృద్ధి పనులు చేశామని చెప్పారు. ‘ప్రతిపక్షాలకు దమ్ముంటే రండి. మేం చేసిన అభివృద్ధి చూపిస్తాం. మేం మంచి చేశాం కాబట్టే దమ్ముగా ప్రజల్లోకి వెళ్తున్నాం.’ అని అన్నారు. టీడీపీ, జనసేన కుల పార్టీలని, వాటికి ప్రజలకు మేలు చేయాలనే అజెండా లేదన్నారు. అనంతరం సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి పొదుపు సంఘాల మహిళలు, ప్రజాప్రతినిధులు, నేతలు క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు తదితరులు పాల్గొన్నారు. -
బాబు యాత్ర బూటకం
చీరాల, న్యూస్‌లైన్ :టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు సీమాంధ్రలో చేస్తోంది తెలుగువారి ఆత్మగౌరవ యాత్ర కాదని, బూటకపు యాత్రని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ డాక్టర్ నూకసాని బాలాజీ విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా స్థానిక గడియార స్తంభం సెంటర్ వద్ద నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని ఆయన బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ 2008 అక్టోబర్ 18న ప్రణబ్‌ముఖర్జీ కమిటీకి విభజనకు సానుకూలమంటూ లేఖ ఇచ్చి రాష్ట్రం ముక్కలు కావడానికి కాంగ్రెస్‌తో కలిసి బాబు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాడని మండిపడ్డారు. తన పదవికి రాజీనామా చేయకుండా సీమాంధ్రలో ప్రజా ఉద్యమాన్ని చూసి పార్టీ తుడిచి పెట్టుకుపోతుందనే భయంతో బాబు బస్సు యాత్ర చేస్తున్నాడని విమర్శించారు. తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకొని స్వచ్ఛందంగా ఉద్యమంలోకి రావాలేకానీ స్వార్థ రాజకీయాల కోసం బాబు యాత్రలు చేపట్టడం సిగ్గు చేటన్నారు. తెలంగాణకు అనుకూలంగా దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వ్యవహరించారంటూ టీడీపీ, కాంగ్రెస్‌లు ప్రచారం చేయడం దుర్మార్గమన్నారు. తెలంగాణ విడిపోతే ఆ ప్రాంతానికి వెళ్లాలంటే మరో దేశానికి వెళ్లినట్లు ఉంటుందని వైఎస్ ఆనాడే రాష్ట్ర విభజనను వ్యతిరేకించారని గుర్తు చేశారు. 2009లో టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోకుండా కాంగ్రెస్ సొంతగా పోటీ చేయడం కూడా అందులో భాగమేనన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా మొట్టమొదటి సారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారని గుర్తు చేశారు. 13 జిల్లాల్లో జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలంతా పాల్గొంటున్నారని, సీమాంధ్ర ప్రజలు తమ పార్టీ పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జైలు నుంచే నిరవధిక నిరాహార దీక్ష చేపట్టి సీమాంధ్రుల మన్ననలు అందుకున్నారని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణను చూడలేకే టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు యాత్రలు, దీక్షలు చేపడుతున్నాయని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తమ పార్టీ మునిగిపోతోందన్న భయంతోనే దీక్షలు చేస్తున్నారన్నారు. రాజీనామాలు చేసి ఉద్యమంలోకి రావాలని, రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్, సోనియాగాంధీని నిలదీయాలని ప్రజాప్రతినిధులకు బాలాజీ పిలుపునిచ్చారు. చీరాల నియోజకవర్గ పార్టీ సమన్వయకర్తలు మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు, ఏఎంసీ మాజీ చైర్మన్ యడం చినరోశయ్య, అవ్వారు ముసలయ్య, సంతనూతలపాడు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అమృతపాణిలు మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే చిత్తశుద్ధితో పోరాడుతోందన్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు చేసి ఉద్యమ బాట పట్టారన్నారు. జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జైల్లో ఉన్నప్పటికీ నిరవధిక నిరాహార దీక్ష చేసి సీమాంధ్ర ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. వైఎస్ విజయమ్మ తన పదవికి రాజీనామా చేసి 48 గంటల పాటు దీక్ష చేపట్టారని పేర్కొన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్రలో షర్మిల బస్సు యాత్ర చేపడుతున్న విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పీకర్ ఫార్మెట్లో కాకుండా ఉత్తుత్తి రాజీనామాలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని చీల్చడానికి కారణమైన కాంగ్రెస్, టీడీపీలకు ప్రజలు బుద్ధి చెప్పాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ ట్రేడ్ యూనియన్ జిల్లా కన్వీనర్ కర్నేటి వెంకటప్రసాద్, పార్టీ పట్టణ కన్వీనర్ యాతం ఆనందరావు, వేటపాలెం మండల కన్వీనర్ పులి వెంకటేశ్వర్లు, వైఎస్ఆర్ సీపీ నాయకులు యడం బాలాజీ, దేటా జోసఫ్, కొరబండి సురేశ్, పారిచర్ల దయమ్మ, డక్కుమళ్ల సురేశ్, మల్లెల బుల్లిబాబు, కర్నేటి రవికుమార్, కొమ్మనబోయిన వీరయ్య, చింతా శ్రీను, కోటి ఆనంద్, పొదిలి ఐస్వామి, విల్సన్, మేడిద రత్నకుమార్, షేక్ ఆజాద్, గంధం చంద్ర, దార్ల శాస్త్రి, మనోహరి, గుడూరి జేమ్స్, శ్రీనివాసరావు, మచ్చా సువార్తరావు, నారాయణ పాల్గొన్నారు. -
బాబు చీకటి ఒప్పందాల వల్లే విభజన
గాంధీనగర్, న్యూస్‌లైన్ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కాంగ్రెస్ పార్టీతో చేసుకున్న చీకటి ఒప్పందాల ఫలితంగానే రాష్ర్ట విభజన ప్రకటన వెలువడిందని వైఎస్సార్ సీపీ మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త జ్యేష్ఠ రమేష్‌బాబు చెప్పారు. సీతారామపురంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు కారణం చంద్రబాబేనని పేర్కొన్నారు. రెండు కళ్ల విధానమంటూ ప్రకటనలు చేస్తూ వచ్చిన చంద్రబాబు తనపై సీబీఐ దాడులు జరగకుండా చూసుకునేందుకు విభజనకు తలొగ్గారని ఆరోపించారు. కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా ఆవిర్భవించిన టీడీపీ ఇప్పుడు ఆ పార్టీతోనే అంటకాగుతోందని విమర్శించారు. జూలై 30వ తేదీన రాష్ట్ర విభజన ప్రకటన వెలువడడానికి సరిగ్గా మూడు రోజుల ముందు కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వంతో చంద్రబాబు రహస్య చర్చలు జరిపారని పేర్కొన్నారు. ఆ చర్చల వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు భరోసా ఇవ్వడం వల్లే రాష్ట్ర విభజన సాధ్యమైందని ఆ పార్టీకి చెందిన తెలంగాణ నేతలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారని చెప్పారు. తెలంగాణ ప్రాంత టీడీపీ నాయకుల వ్యాఖ్యలను ఆయన ఖండించకపోవడానికి కారణాలేమిటో స్పష్టం చేయాలన్నారు. ప్రకటన వెలువడిన తర్వాత సీమాంధ్ర ప్రాంతంలో ఉద్యమం వేడెక్కడంతో చేసేది లేక చంద్రబాబు తమ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో డ్రామాలాడిస్తున్నారని రమేష్‌బాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో చంద్రబాబు ఆడుకుంటున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర విభజనపై టీడీపీ వైఖరి ఏమిటో ఇప్పటికైనా స్పష్టం చేయాలని డిమాండ్‌చేశారు. విభజన జరిగితే ఆంధ్రప్రదేశ్ ఎడారిగా మారుతుంది రాష్ట్ర విభజన జరిగితే కృష్ణాడెల్టా మునుపెన్నడూ లేనివిధంగా దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటుందని వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి పేర్కొన్నారు. జూలై మొదటి వారంలోనే డెల్టాకు నీటిని విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ నేటికీ అతీగతీలేదన్నారు. కృష్ణాజలాలపై ప్రథమ వినియోగహక్కు డెల్టాకు మాత్రమే ఉందని, దానిని దుర్వినియోగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటికే కృష్ణాడెల్టా పరిధిలోని లక్షలాది ఎకరాల్లో వరిపైరు ఎండిపోతోందన్నారు. ఎగువన ఉన్న తెలంగాణ ప్రాంత నాయకులు అడ్డగోలుగా నీటిని వినియోగించుకుంటున్నారని, దీని వలన దిగువన ఉన్న డెల్టా ప్రాంత హక్కులు హరించుకుపోతున్నాయన్నారు. సాగునీరందక ఆయకట్టు చివర ఉన్న లక్షల ఎకరాలు బీడుగా మారే పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తంచేశారు. తెలంగాణకు చెందిన కడియం శ్రీహరి 2003లో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు సెప్టెంబర్ నెలాఖరు వరకు డెల్టాకు నీటిని విడుదల చేయలేదని గుర్తుచేశారు. అప్పటి పరిస్థితులే నేడు డెల్టాలో దర్శనమిస్తున్నాయన్నారు. ఒక మంత్రి ఉంటేనే డెల్టాకు ఇంతటి అన్యాయం చేస్తుంటే ఇక రాష్ట్ర విభజన జరిగితే దక్షిణ భారత ధాన్యాగారం ఎడారికాక తప్పదన్నారు. ఎగువ రాష్ట్రాలనుంచి మనరాష్ట్రానికి 811 టీఎంసీల నీరు విడుదల కావాల్సి ఉండగా కేవలం 125 టీఎంసీలు మాత్రమే విడుదల అవుతోందన్నారు. రాష్ట్ర విభజన జరిగితే కృష్ణా, గోదావరి డెల్టా ఎడారిగా మారుతుందన్నారు. హరితాంధ్రప్రదేశ్‌ను కోరుకునే వారంతా రాష్ట్ర విభజనను వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు.