Canon
-
ఆ ముచ్చట తీర్చే సెల్ఫీ ప్రింటర్
స్మార్ట్ఫోన్లు చేతిలోకి వచ్చాక జనాలకు ఎడాపెడా సెల్ఫీలు తీసుకోవడం అలవాటుగా మారిపోయింది. సెల్ఫీలు ఎంతసేపూ ఫోన్లోనో, కంప్యూటర్లలోనో చూసుకోవడమే తప్ప పాతకాలంలోలా వాటిని ప్రింట్ చేయించి, ఆల్బమ్స్‌లో దాచుకునే అలవాటు దాదాపు అంతరించింది.అయితే, సెల్ఫీలను ప్రింట్ చేసుకుని, దాచుకోవాలనే ముచ్చట కూడా కొందరికి ఉంటుంది. ఆ ముచ్చట తీర్చడానికే జపానీస్ కెమెరాల తయారీ కంపెనీ ‘కేనన్’ తాజాగా సెల్ఫీ ప్రింటర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ‘సెల్ఫీ క్యూఎక్స్20’ పేరుతో ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసిన ఈ ప్రింటర్‌తో స్మార్ట్‌ఫోన్ నుంచి ఫొటోలను నేరుగా ముద్రించుకోవచ్చు.అలాగే, లాప్టాప్, డెస్క్‌టాప్‌లలో భద్రపరచుకున్న ఫొటోలను కూడా ముద్రించుకోవచ్చు. సెల్ఫీ లేఔట్ యాప్ ద్వారా ఈ ప్రింటర్ పనిచేస్తుంది. ఈ యాప్ ద్వారా ప్రింట్ తీసుకోవడానికి ముందు ఫొటోలను ఎడిట్ చేసుకోవడానికి, ఎంపిక చేసుకున్న ఫొటోల కొలాజ్ తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. భారత్ మార్కెట్లో దీని ధర రూ. 7,495 మాత్రమే! -
నవ్వితేనే ఆఫీసుల్లోకి ఎంట్రీ.. ఇదేం విడ్డూరం!
ఆఫీస్ పరిధిల్లో సీసీ కెమెరాలు, ఐరిష్ మెషిన్లు ఉద్యోగుల కదలికలను, హాజరును పరిశీలించేందుకు ఏర్పాటు చేస్తుంటాయి కంపెనీలు. అయితే చైనాలోని కొన్ని ఆఫీసుల్లో కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చారు. ఉద్యోగులు ఆఫీస్‌లోకి అడుగుపెట్టాలంటే కచ్చితంగా నవ్వాల్సిందే. ఈ మేరకు స్మైల్ రికగ్నిషన్ కెమెరా టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఆఫీసుల్లోకి ప్రవేశించడం మాత్రమే కాదు.. పర్సనల్ పీసీలు ఆన్ చేయాలన్నా, లంచ్ యాక్సెస్, మీటింగ్‌లకు అటెండ్ కావాలన్నా ఎంప్లాయి నవ్వాల్సిందే. ఇందుకు సంబంధించి కెనన్ కంపెనీ, అర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ సాయంతో స్మైల్ రికగ్నిషన్ టెక్నాలజీ డెవలప్ చేసింది. పని చేసే టైంలో ఉద్యోగులు సంతోషంగా ఉన్నారా? లేదా? అనేది ఈ టెక్నాలజీ మానిటరింగ్ చేస్తుందని కెనన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తెలిపింది. ప్రయోగాత్మకం మరో 30 దేశాల్లో(భారత్‌తో సహా) ఈ టెక్నాలజీకి ట్రయల్ రన్ నిర్వహించాలని భావిస్తున్నట్లు కెనన్ ఒక స్టేట్మెంట్లో పేర్కొంది. నిజానికి స్మైల్ రికగ్నిషన్ కెమెరాలను కిందటి ఏడాదే డెవలప్ చేసినప్పటికీ.. అది అంతగా గుర్తింపు దక్కించుకోలేదు. అయితే ఈ ఏడాది బీజింగ్‌లో కొన్ని టాప్ కంపెనీలు ఈ టెక్నాలజీని అనుమతించడంతో ప్రముఖంగా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అయితే ఈ టెక్నాలజీపై విమర్శలు ఉన్నప్పటికీ.. ఇది ఉద్యోగుల మానస్థితిని అదుపు చేస్తుందని, వాళ్లను వందకి వంద శాతం సంతోషంగా ఉంచుతాయని కంపెనీలు వివరణలు ఇచ్చుకుంటున్నాయి. ఇదిలా ఉంటే మాస్కులు పెట్టుకున్న ఉద్యోగుల సంగతేంటని కొందరు సెటైర్లు వేస్తుండడం కొసమెరుపు. చదవండి: ఆర్టిఫిషీయల్ మూడో కన్ను! -
'మహిళా ఉద్యోగుల శాతం పెంచుతాం'
న్యూఢిల్లీ : మహిళలకు శుభవార్త! కెమెరాల ఉత్పత్తిలో పేరొందిన కెనాన్ ఇండియా సంస్థ ఓ నూతన అధ్యాయానికి తెర తీసింది. మహిళాభివృద్ధే ధ్యేయంగా మరో అడుగు ముందుకేసింది. మహిళా దినోత్సవ నేపథ్యంలో తమ సంస్థలో మహిళా ఉద్యోగుల శాతాన్ని మరింత పెంచేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రముఖ టెక్నాలజీ సంస్థ కెనాన్ ఇండియా 2018 సంవత్సరానికల్లా తమ సంస్థలో మహిళా ఉద్యోగుల శాతం పెంచేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే కెనాన్ ఇండియాలో పనిచేస్తున్న సుమారు వెయ్యిమందిలో 12 శాతం మహిళలుండగా... మరో ఇరవై శాతం పెంచేందుకు సన్నాహాలు ప్రారంభించింది. మహిళల అభివృద్ధికి మరింత సహకరించడంలో భాగంగా తమ సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రముఖ జపాన్ టెక్నాలజీ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. భారత్ లోని సుమారు 14 నగరాల్లో తమ కార్యాలయాలు కలిగిన కెనాన్.. సుమారుగా 1,000 మంది ఉద్యోగులతో కొనసాగుతోంది. ఇప్పటికే తమ సంస్థలో 12 శాతం మహిళా ఉద్యోగులు ఉన్నారని, మరో రెండు సంవత్సరాల్లో కనీసం ఇరవై శాతానికి చేరేట్లు చర్యలు తీసుకుంటామని కెనాన్ ఇండియా ప్రెసిడెంట్ మరియు సీఈవో కజుటాడా కోబయాషీ అన్నారు. సంస్థలోని వివిధ విభాగాల్లో మహిళలు పనిచేస్తున్నారని, వారికి మరింత ప్రోత్సాహం అందించేందుకు సంస్థ కృషి చేస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. -
30% మార్కెట్ వాటాపై కెనాన్ దృష్టి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ ప్రింటర్ల వ్యాపారంలో ఈ ఏడాది 30 శాతం మార్కెట్ వాటాను కైవసం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కెనాన్ ప్రకటించింది. ఈ ఏడాది దేశంలో రెండు లక్షల ప్రింటర్లు అమ్ముడవుతాయని అంచనా వేస్తుండగా అందులో కనీసం 60,000 యూనిట్లు విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కెనాన్ ఇండియా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అలోక్ భరద్వాజ్ తెలిపారు. గతేడాది కెనాన్ మార్కెట్ వాటా 24 శాతంగా ఉంది. ఇంక్జెట్ ప్రింటర్ల వ్యాపారంపై ప్రధానంగా దృష్టిసారించిన కెనాన్ కొత్తగా మార్కెట్లోకి తొమ్మిది ప్రింటర్లను విడుదల చేసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అలోక్ మాట్లాడుతూ ఈ ఏడాది ప్రింటర్ల ద్వారా రూ.200 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రింటర్ల వ్యాపారంలో భారీగా వృద్ధి నమోదవుతుండటంతో కొత్త ప్రింటర్లను ఇక్కడ నుంచి విడుదల చేస్తున్నట్లు వివరించారు. ముఖ్యంగా హైదరాబాద్ జాతీయ విద్యా కేంద్రంగా ఎదగడంతో ప్రింటర్ల మార్కెట్‌కు డిమాండ్ బాగా పెరిగిందన్నారు. కెనాన్ మొత్తం వ్యాపారంలో 10 శాతం ఆదాయం ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తోందన్నారు. రూపాయి కంటే తక్కువ తాము అత్యాధునిక పరిజ్ఞానంతో ప్రవేశపెట్టిన ఈ ప్రింటర్ల ద్వారా రూపాయి కంటే తక్కువ రేటుకే ప్రింట్ తీసుకునే విధంగా ఈ కొత్త ప్రింటర్లను రూపొందించినట్లు తెలిపారు. గతంలో మోనో ప్రింటింగ్‌కి రూ.3.30 ఖర్చు అయితే ఈ ఇంక్జెట్ టెక్నాలజీ వల్ల ఆ వ్యయం 99పైసలకు తగ్గిందన్నారు. అదే కలర్ ప్రింటింగ్ రూ.5.32 నుంచి రూ.2.5కి తగ్గనున్నట్లు తెలిపారు. కొత్తగా విడుదలైన తొమ్మిదింటిలో ఆరు ప్రింటర్లు వైఫై క్లౌడ్ ఆధారంగా పనిచేస్తాయన్నారు. కొత్తగా వీటి రాకతో మొత్తం కెనాన్ పోర్ట్‌ఫోలియోలో ప్రింటర్ల సంఖ్య 24కి చేరింది. ఈ ఏడాది ప్రచారానికి రూ.120 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు అలోక్ తెలిపారు. అలాగే వచ్చే ఏడాదిలోగా సెక్యూరిటీ నెట్వర్క్ సర్వైవలెన్స్ కెమెరా మార్కెట్లోకి అడుగుపెట్టనున్నట్లు తెలిపారు.