న్యూఢిల్లీ : మహిళలకు శుభవార్త! కెమెరాల ఉత్పత్తిలో పేరొందిన కెనాన్ ఇండియా సంస్థ ఓ నూతన అధ్యాయానికి తెర తీసింది. మహిళాభివృద్ధే ధ్యేయంగా మరో అడుగు ముందుకేసింది. మహిళా దినోత్సవ నేపథ్యంలో తమ సంస్థలో మహిళా ఉద్యోగుల శాతాన్ని మరింత పెంచేందుకు సన్నాహాలు చేస్తోంది.
ప్రముఖ టెక్నాలజీ సంస్థ కెనాన్ ఇండియా 2018 సంవత్సరానికల్లా తమ సంస్థలో మహిళా ఉద్యోగుల శాతం పెంచేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే కెనాన్ ఇండియాలో పనిచేస్తున్న సుమారు వెయ్యిమందిలో 12 శాతం మహిళలుండగా... మరో ఇరవై శాతం పెంచేందుకు సన్నాహాలు ప్రారంభించింది. మహిళల అభివృద్ధికి మరింత సహకరించడంలో భాగంగా తమ సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రముఖ జపాన్ టెక్నాలజీ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.
భారత్ లోని సుమారు 14 నగరాల్లో తమ కార్యాలయాలు కలిగిన కెనాన్.. సుమారుగా 1,000 మంది ఉద్యోగులతో కొనసాగుతోంది. ఇప్పటికే తమ సంస్థలో 12 శాతం మహిళా ఉద్యోగులు ఉన్నారని, మరో రెండు సంవత్సరాల్లో కనీసం ఇరవై శాతానికి చేరేట్లు చర్యలు తీసుకుంటామని కెనాన్ ఇండియా ప్రెసిడెంట్ మరియు సీఈవో కజుటాడా కోబయాషీ అన్నారు. సంస్థలోని వివిధ విభాగాల్లో మహిళలు పనిచేస్తున్నారని, వారికి మరింత ప్రోత్సాహం అందించేందుకు సంస్థ కృషి చేస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
'మహిళా ఉద్యోగుల శాతం పెంచుతాం'
Published Mon, Mar 7 2016 5:49 PM | Last Updated on Sun, Sep 3 2017 7:12 PM
Advertisement