Capital Tax
-
ఏప్రిల్1 తర్వాత అమ్మే షేర్లపైనే!
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్లో షేర్ల కొనుగోలు లావాదేవీలపై విధించిన మూలధన లాభాల పన్నుపై (ఎల్టీసీజీ) ఇన్వెసర్టలో ఉన్న గందరగోళాన్ని తొలగించేందుకు కేంద్రం వివరణ ఇచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ 1న లేదా ఆ తర్వాత తమ వద్దనున్న షేర్లను విక్రయించడం ద్వారా వచ్చిన లాభాలపై మాత్రమే ఎల్టీసీజీ అమలవుతుందని స్పష్టం చేసింది. కాగా, లాభాన్ని లెక్కించే విషయంలో షేర్ల కొనుగోలు రేటుకు ప్రామాణికత విషయానికొస్తే... జనవరి 31 నాటి ట్రేడింగ్ గరిష్ట ధర లేదా వాస్తవ కొనుగోలు ధర, ఈ రెండింటిలో ఏది ఎక్కువైతే దాన్ని లెక్కలోకి తీసుకుంటామని పేర్కొంది. షేర్లను కొనుగోలు చేసిన తర్వాత ఏడాది తర్వాత విక్రయించినా (ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్ యూనిట్లు, బిజినెస్ ట్రస్ట్‌ల యూనిట్లు కూడా) ఆ లాభాలపై (రూ.లక్షకు మించితే) 10% ఎల్‌టీసీజీని 2018–19 బడ్జెట్లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం షేర్లను కొని, ఏడాదిలోపు విక్రయిస్తే... తద్వారా వచ్చే లాభాలపై 15% స్పల్పకాలిక మూలధన పన్ను (ఎస్టీసీజీ) మాత్రమే అమల్లో ఉంది. దీనికితోడు ప్రతి కొనుగోలు/అమ్మకం లావాదేవీపై సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (ఎస్టీటీ) కూడా ఇన్వెస్టర్లు చెల్లించాల్సి వస్తోంది. ఎల్టీసీజీ విధింపుతో జంటపన్నులను (డబుల్ ట్యాక్సేషన్) కేంద్రం అమల్లోకి తీసుకొచ్చినట్లు లెక్క. వాస్తవానికి 14 ఏళ్ల క్రితం 20% మేర ఎల్టీజీసీ అమల్లో ఉండేది. దీన్ని తొలగించి అప్పుడు ఎస్టీటీని ప్రవేశపెట్టారు. ఇప్పుడు మోదీ సర్కారు మాత్రం ఎస్టీటీని యథాతథంగా కొనసాగిస్తూనే... మళ్లీ ఎల్టీజీసీకూడా తీసుకొచ్చింది. ఈ పన్ను ప్రభావంతో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతినడం... సూచీలు కుప్పకూలటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్ల అనుమానాల నివృత్తి కోసం కేంద్రం వివరణను(ఎఫ్ఏక్యూ) విడుదల చేసింది. దీనిలో ముఖ్యాంశాలివీ... ♦ కొత్తగా విధించనున్న ఎల్టీసీజీ ప్రకారం... 2018 ఏప్రిల్ 1న లేదా ఆ తర్వాత షేర్లను అమ్మితేనే (కొన్న తేదీ నుంచి ఏడాది పూర్తయితే) ఆ లాభాలపై 10 శాతం పన్ను కట్టాల్సి ఉంటుంది. జనవరి 31 వరకూ వచ్చిన లాభాలపై (గాడ్ఫాదర్డ్) ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ♦ ప్రస్తుత ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 10లోని 30 క్లాజ్ కింద ఈ ఏడాది మార్చి 31 వరకూ షేర్ల విక్రయంపై ఎల్టీసీజీ మినహాయింపు పొందవచ్చు. ♦ ఏడాది తర్వాత షేరు లేదా ఫండ్ యూనిట్ అమ్మకం విలువ నుంచి కొనుగోలు విలువను తీసేస్తే వచ్చిన లాభాన్ని దీర్ఘకాలిక మూలధన లాభం కింద లెక్కిస్తారు. ♦ 2018, జనవరి 31కి ముందు షేరును కొనుగోలుచేస్తే ఆ ధరను వాస్తవ రేటుగా పరిగణిస్తారు. అయితే, జనవరి 31 నా టి ట్రేడింగ్‌లో సంబంధిత షేరు గరిష్ట ధరనూ దీనికి ప్రామాణికంగా చూస్తారు. ఈ రెండింటిలో ఏది ఎక్కువ ధర అయితే, దాన్ని లాభాల లెక్కింపులో కొనుగోలు ధరగా పరిగణిస్తారు. ♦ ఇక అన్‌లిస్టెడ్ యూనిట్ (బిజినెస్ ట్రస్టులకు సంబంధించినవి) విషయానికొస్తే.. ఈ ఏడాది జనవరి 31 నాటి నికర అసెట్ విలువ(ఎన్ఏవీ)ను కొనుగోలు ధరగా పరిగణిస్తారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 తర్వాత ఈ యూనిట్లను గనుక విక్రయిస్తే... దీనిపై వచ్చిన లాభాలపై(రూ. లక్ష మించితే) 10 శాతం పన్నును కట్టాల్సి ఉంటుంది. ♦ ఈ ఏడాది ఫిబ్రవరి 1 నుంచి మార్చి 31 మధ్య తమ వద్దనున్న షేర్ల విక్రయం వల్ల తలెత్తిన దీర్ఘకాలిక మూలధన నష్టాలను పన్ను చెల్లింపు విషయంలో తగ్గించి చూపడానికి (సెట్ఆఫ్) లేదా బదలాయించుకోవడానికి (క్యారీ ఫార్వార్డ్) కుదరదు. ♦ 2018, ఏప్రిల్ 1 తర్వాత విక్రయించే షేర్లపై వచ్చే దీర్ఘకాలిక మూలధన నష్టాలను మాత్రం సెట్ఆఫ్ లేదా క్యారీఫార్వార్డ్ చేసుకోవడానికి వీలుంటుంది. ♦ కొన్ని కంపెనీలు తమవద్దనున్న మిగులు నిధులను కంపెనీ విస్తరణ కార్యకలాపాల్లో పెట్టుబడులు పెట్టకుండా షేర్లు, ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు మొగ్గుచూపుతున్నాయి. దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్ను లేకపోవడం దీనికి ప్రధాన కారణం. అందుకే పెట్టుబడులను ఉత్పాదకతవైపు మళ్లించడం కోసమే ఎల్‌టీసీజీని విధించాల్సి వచ్చింది. మినహాయింపులు తొలగించాకే 25 శాతానికి కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపుపై ఆర్థిక మంత్రి జైట్లీ న్యూఢిల్లీ: పరిశ్రమకిస్తున్న మినహాయింపులన్నీ ఎత్తివేసిన తర్వాతే కార్పొరేట్ ట్యాక్స్‌ను 25 శాతానికి తగ్గించడం సాధ్యపడుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. 30% స్థాయిలో ఉన్న కార్పొరేట్ ట్యాక్స్‌ను నాలుగేళ్లలో 25%కి తగ్గిస్తానంటూ 2015లో తాను హామీ ఇచ్చిన సంగతిని ఆయన ప్రస్తావించారు. అయితే, ఇది అమలు చేయాలంటే మినహాయింపులన్నీ ఎత్తివేయాల్సి ఉంటుందంటూ షరతు కూడా పెట్టినట్లు జైట్లీ చెప్పారు. చాలా మటుకు సంస్థలు మినహాయింపులపై ఆధారపడి ఉన్నందున .. మధ్యలో వాటిని ఎత్తివేయడం సరికాదని పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన తెలిపారు. ప్రస్తుతం రూ. 250 కోట్ల దాకా టర్నోవరు ఉండే సంస్థలపై ట్యాక్స్ రేటును 25%కి తగ్గించగా, దాదాపు 7,000 పైచిలుకు సంస్థలు 30% పరిధిలోనే ఉన్నాయి. అయితే, పన్ను మినహాయింపులన్నీ పరిగణనలోకి తీసుకుంటే వీటి ట్యాక్స్ రేటు 22%గానే ఉంటోం దని జైట్లీ పేర్కొన్నారు. మరోవైపు, పెట్రోల్, డీజిల్‌ను వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) విధానంలోకి చేర్చడంపై రాష్ట్రాలు సుముఖంగా లేవని ఆయన చెప్పారు. జీఎస్టీ అమలయ్యే కొద్దీ క్రమంగా సహజ వాయువు, మొత్తం రియల్టీని దీని పరిధిలోకి తేవాల్సి ఉంటుందని.. ఏదో ఒక దశలో పెట్రోల్, డీజిల్‌ని కూడా చేర్చేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయని జైట్లీ పేర్కొన్నారు. ఇక ద్రవ్య లోటు కట్టడి లక్ష్యం 0.3% తేడాతో తప్పిపోవడం.. కేవలం గణాంకాలపరమైన అంశం మాత్రమేనని ఆయన చెప్పారు. -
ప్రధానిని కలసిన అమరావతి రైతులు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతానికి చెందిన సుమారు 85 మంది రైతులు మంగళవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీని పార్లమెంటులోని ఆయన కార్యాలయంలో కలిశారు. ఏపీ రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు మూలధన పన్ను మినహాయింపు ఇవ్వడంపై కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రమంత్రి సుజనాచౌదరి, ఏపీ మంత్రులు కామినేని శ్రీనివాస్, ప్రత్తిపాటి పుల్లారావు తదితరులు పాల్గొన్నారు. రైతుల తరఫున ఎంపీ గల్లా జయదేవ్ ప్రధానిని సత్కరించగా.. మంత్రి ప్రత్తిపాటి జ్ఞాపిక అందజేశారు. మూలధన పన్ను మినహాయింపుపై విధించిన కాలపరిమితిని ఎత్తివేయాలని రైతులు ప్రధానిని ఈ సందర్భంగా కోరారు. కాగా, కేంద్రమంత్రి సుజనాచౌదరి నివాసంలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీని కూడా సన్మానించారు. ఇదిలా ఉండగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడును కూడా రైతులు కలసి కృతజ్ఞతలు తెలిపారు. -
నల్లకుబేరులకు నరేంద్రమోదీ హెచ్చరిక
-
‘డిసెంబర్ 30’ డెడ్‌లైన్ దాటాక చుక్కలే..
-
డెడ్‌లైన్ దాటాక చుక్కలే..
అవినీతిపరులు భయం భయంగా గడపాల్సిందే ► 50 రోజుల డెడ్‌లైన్ పై ప్రధాని మోదీ హెచ్చరిక ► అవినీతి పరులు ప్రతిఫలం అనుభవించక తప్పదని స్పష్టీకరణ నిజాయితీపరుల కష్టాలు తగ్గుముఖం పడతాయని భరోసా అవినీతిపరులు ప్రతిఫలం అనుభవించక తప్పదని స్పష్టీకరణ దేశాభివృద్ధి కోసం మరిన్ని కఠిన సంస్కరణలు కేపిటల్ మార్కెట్ నుంచి మరిన్ని పన్నులకు వ్యూహం అవినీతిపరులారా.. 125 కోట్ల మంది దేశ ప్రజల ఆలోచనను తక్కువ అంచనా వేయొద్దు. డిసెంబర్ 30 తర్వాత మీరు భయం భయంగా గడపాల్సిందే. అక్రమార్కులపై కఠినమైన చర్యలకు సమయం ఆసన్నమైంది. ఇది స్వచ్ఛత ఉద్యమం. భారత్‌కు ఉజ్వలమైన భవిష్యత్తు అందించేందుకు ఈ ప్రభుత్వం బలమైన, దూరదృష్టితో కూడిన ఆర్థిక విధానాలను కొనసాగిస్తోంది. దేశానికి మేలుచేసేది ఎంత కఠినమైన నిర్ణయమైనా వెనుకడుగు వేసేది లేదు. కేపిటల్ మార్కెట్ నుంచి మరిన్ని పన్నులు రాబట్టాల్సి ఉంది. ఆర్థిక మార్కెట్లనుంచి లాభపడేవారు సరైన పన్నుల చెల్లింపు ద్వారా దేశ నిర్మాణంలో కీలక భాగస్వాములవ్వాలి. ఇందుకోసం మేం సమర్థమైన, పారదర్శకమైన, ప్రగతిశీల విధానాలను ఆలోచిస్తున్నాం. – ముంబై సభలో ప్రధాని మోదీ ముంబై/పాతాళ్‌గంగ: నోట్లరద్దు పథకం అమలుకు సూచించిన ‘డిసెంబర్ 30’ డెడ్‌లైన్ ముగిసిన తర్వాత అవినీతిపరులకు తీవ్రమైన కష్టాలు మొదలవుతాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హెచ్చరించారు. ముంబైలోని బాంద్రా–కుర్లా కాంప్లెక్స్‌లో పలు శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్న మోదీ.. ‘అవినీతి పరులారా.. 125కోట్ల మంది దేశ ప్రజల ఆలోచనను తక్కువ అంచనా వేయొద్దు. డిసెంబర్ 30 తర్వాత మీరు భయం భయంగా గడపాల్సిందే. అక్రమార్కులపై కఠినమైన చర్యలకు సమయం ఆసన్నమైంది. ఇది స్వచ్ఛత ఉద్యమం’ అని వెల్లడించారు. నవంబర్ 8 నిర్ణయానికి 50 రోజులు పూర్తయిన తర్వాత.. నిజాయితీ పరుల కష్టాలు తగ్గుముఖం పట్టి అక్రమార్కుల సమస్యలు పెరుగుతాయని ప్రధాని తెలిపారు. ‘నోట్లరద్దు ప్రకటించిన తర్వాత ప్రజలు ఇబ్బందులు పడుతున్నా నా నిర్ణయానికి మద్దతిచ్చారు. దీన్ని విఫలం చేద్దామనుకున్న వారి ఆటలు సాగనివ్వలేదు. బ్యాంకు అధికారులతో కలిసి నల్లధనాన్ని చెలమణిలోకి తెచ్చుకునేందుకు కొందరు ప్రయత్నించారు. వారిలో చాలా మందిని పట్టుకున్నాం. 50 రోజులు ఇబ్బందులు తప్పవని ముందే చెప్పాను. మరొక్కసారి చెబుతున్నా.. మనం గెలిచేంతవరకు ఈ యుద్ధం ముగిసినట్లు కాదు’ అని ప్రధాని అన్నారు. 70 ఏళ్లుగా దేశంలో అవినీతికి పాల్పడిన వారంతా తమ చర్యలకు ప్రతిఫలాన్ని అనుభవించక తప్పదన్నారు. మరింత ‘కేపిటల్’ పన్ను దేశాభివృద్ధి కోసం మరిన్ని కఠినమైన ఆర్థిక సంస్కరణలు తీసుకురానున్నట్లు ప్రధాని స్పష్టం చేశారు. విశాలమైన దేశ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ‘బలమైన, దూరదృష్టితో కూడిన ఆర్థిక విధానాల’ను తీసుకువస్తామని భరోసా ఇచ్చారు. మహారాష్ట్రలోని కర్జత్ సమీపంలోని పాతాళ్‌గంగ (మహారాష్ట్రలోని అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతం)లో సెబీ నేతృత్వంలో నడిచే నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్ (ఎన్ఐఎస్ఎమ్) ప్రారంభోత్సవంలో మోదీ పాల్గొన్నారు. కేంద్ర బడ్జెట్‌కు (ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టొచ్చని భావిస్తున్నారు) సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రధాని వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ‘భారత్‌కు ఉజ్వలమైన భవిష్యత్తు అందించేందుకు ఈ ప్రభుత్వం బలమైన, దూరదృష్టితో కూడిన ఆర్థిక విధానాలను కొనసాగిస్తుంది. స్వల్పకాలిక రాజకీయ అవసరాల కోసం మా నిర్ణయాలుండవు. దేశానికి మేలుచేసేది ఎంత కఠినమైన నిర్ణయమైనా వెనుకడుగు వేసేది లేదు’ అని మోదీ స్పష్టం చేశారు. కేపిటల్ మార్కెట్ నుంచి మరిన్ని పన్నులు రాబట్టాల్సి ఉందన్న మోదీ.. ‘ఆర్థిక మార్కెట్లనుంచి లాభపడేవారు సరైన పన్నుల చెల్లింపు ద్వారా దేశ నిర్మాణంలో కీలక భాగస్వాములవ్వాలి. ఇందుకోసం మేం సమర్థమైన, పారదర్శకమైన, ప్రగతిశీల విధానాలను ఆలోచిస్తున్నాం’ అని తెలిపారు. కేపిటల్ మార్కె ట్లు.. మౌలిక వసతులు, వ్యవసాయ రంగాల్లోనూ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ప్రధాని పిలుపునిచ్చారు. ‘మార్కెట్లు సరైన దిశలో విజయవంతంగా నడుస్తుంటే.. దీని లాభం దలాల్ స్ట్రీట్కో, ఢిల్లీలోని ప్రభుత్వానికో కాదు.. గ్రామాల్లో, లక్షల మంది రైతులకు కలుగుతుంది’ అని తెలిపారు. కమొడిటీ మార్కెట్లు రైతులకు ఉపయోగపడకపోతే.. ఆర్థిక వ్యవస్థకు ఈ మార్కెట్ల ఉ పయోగం ఉండదన్నారు. ఇన్నాళ్లుగా దేశంలో ము నిసిపల్ బాండ్లు లేకపోవటం అసంతృప్తిని కలిగించిందని.. ఏడాదిలోగా దేశవ్యాప్తంగా కనీసం పది నగరాల్లో మునిసిపల్ బాండ్లు ఇష్యూ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సెబీ, ఆర్థిక శాఖలను కోరారు. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న వస్తుసేవల పన్ను (జీఎస్టీ) త్వరలోనే అమల్లోకి రానుందని తెలిపారు. స్టార్టప్‌లు స్టాక్మార్కెట్లోకి రావాలన్నారు. మహా రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు, సీఎం ఫడ్నవిస్, ఆర్థిక మంత్రి జైట్లీ, సెబీ చైర్మన్ యూకే సిన్హా పాల్గొన్నారు.