The capital of the villages
-
మెతుకు పండిన చోట బతుకు.. బిక్కు బిక్కు
పూలు అమ్మిన చోటే కట్టెలు కొట్టాలి.. పల్లకీలో తిరిగిన చోటే బోయీగా మారాలి... కాలుమీద కాలేసుకున్న చోటే కాలికి బలపం కట్టుకుని పనిచేయాలి.. దర్జాగా జీవించిన చోటే దయనీయంగా బతకాలి.. అజమాయిషీ చెలాయించిన చోటే అన్నీ వదులుకుని మసలాలి. పుట్టి పెరిగిన ఊళ్లోనే పరదేశీయుల్లా తిరగాలి..! ఇదీ రానున్న రోజుల్లో రాజధాని గ్రామాల్లోని అన్నదాతల దుస్థితి.. తెలుగుదేశం ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల కారణంగా జరీబు రైతులు గరీబులు కానున్నారు. బంగారం పండిన భూములు కాంక్రీటు జంగిళ్లుగా మారబోతున్నాయి. పచ్చటి పంటలతో కళకళలాడిన ఊళ్లు కాలుష్యకాసారాలు కాబోతున్నాయి. రాజధాని గ్రామాల భవిష్యత్‌ను తలచుకుంటే అమెరికా రాజకీయ వేత్త విలియం జెన్నింగ్స్ బ్రెయామ్ చెప్పిన ఓ వ్యాఖ్య గుర్తుకు రాకమానదు. ‘‘ మీ నగరాలను దగ్ధం చేసి పొలాలను వదిలేయండి, మాయ చేసినట్టు నగరాలు మళ్లీ కళకళలాడతాయి. పొలాలను నాశనం చేసి నగరాలను వదిలిపెట్టండి, దేశమంతటా గడ్డే మొలుస్తుంది.’’ భూ సమీకరణ పూర్తికావడంతో రాజధాని గ్రామాల్లో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. రైతులు, రైతు కూలీలు, వ్యవసాయ కార్మికులు, చేతివృత్తి పనివారు తమ భవిష్యత్‌పై కలత చెందుతున్నారు. వ్యవసాయం మినహా మరో వ్యాపకం తెలియని ఈ వర్గాలు కొత్త జీవితాన్ని ఎలా ప్రారంభించాలి ? మిగిలిపోయిన పిల్లల చదువులు, వివాహాలు వంటి కుటుంబ బాధ్యతలను ఎలా నెరవేర్చాలి? ప్రభుత్వం సాలీనా ఇచ్చే నష్టపరిహారంతో కుటుంబాలను ఎలా నడపాలి...వంటి సమస్యలపైనే ఆలోచన చేస్తున్నారు. నిన్నటి వరకు పదిమందికి ఉపాధి కల్పించిన రైతు మరో నెలలో ఇతరుల వద్ద పనిచేయాల్సిన పరిస్థితి. మూడు పంటలు పండిస్తూ సాలీనా ఎకరాకు రూ.లక్ష ఆదాయం పొందిన జరీబు రైతుల పరిస్థితి అగమ్యగోచరం. నదీపరివాహక ప్రాంతంలో రెండు ఎకరాల జరీబు భూమి కలిగిన రైతు, సాగుతోపాటు పశుపోషణ వంటి అనుబంధ రంగాల నుంచి అధిక ఆదాయాన్ని పొంది గ్రామీణ ప్రాంతాల్లో సౌకర్యవంతమైన జీవితాన్ని గడిపారు. ఇకపై ప్రభుత్వం ఎకరాకు ఇవ్వనున్న రూ.50 వేలతోనే సంవత్సరమంతా జీవనాన్ని కొనసాగించాలి. నిన్నటి వరకు రారాజులా గడిపిన జరీబు రైతు, ఇకపై ఖర్చుపై ఒకటికి రెండు సార్లు ఆలోచన చేయాలి. ముఖ్యంగా వెంకటపాలెం, మందడం, లింగాయపాలెం, ఉద్దండ్రాయునిపాలెం, రాయపూడి, అబ్బరాజుపాలెం, బోరుపాలెం తదితర గ్రామాల జరీబు రైతులు భవిష్యత్‌పై ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు పూలు, కూరగాయలు, పాలను విజయవాడకు ఎగుమతి చేసిన ఈ రైతులకు ఇకపై ఆ పనులేవీ ఉండవు. -సాక్షి ప్రతినిధి, గుంటూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజధాని గ్రామాల్లోని రైతుల హక్కులకు రక్షణ కల్పించేందుకు, వారికి వెన్నుదన్నుగా నిలిచేందుకు అనేక పోరాటాలు, ఉద్యమాలు నడిపింది. ఆ ఉద్యమాల ఫలితమే జరీబు రైతులకు గడువుకు రెండు రోజుల ముందు ప్రభుత్వం అదనపు ప్యాకేజీని ప్రకటించింది. ‘మేమంతా మీ వెంటే’అంటూ వైఎస్సార్ సీపీకి చెందిన 42 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు రాజధాని గ్రామాల్లో పర్యటించి రైతుకు భరోసా కల్పించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులు, రైతుకూలీలు, కౌలుదారులు, చేతివృతి ్తపనివారల సమస్యలను తెలుసుకుని అసెంబ్లీలో వారి తరఫున పోరాటం చేసేందుకు వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ఇక్కడకు రానున్నారు. ఆయన రాకకోసం రాజధాని గ్రామాలు ఎంతో ఆశతో నిరీక్షిస్తున్నాయి. పొంచి ఉన్న పొల్యూషన్ ... రాష్ట్ర ప్రభుత్వం కాలుష్యరహిత రాజధాని నిర్మాణానికి చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ఈ నిర్మాణ పనుల సమయంలోనే కాలుష్యం పెరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు కాలుష్య కారకాలు పరిమితంగా ఉండటంతో కృష్ణానదీ పరివాహక ప్రాంతాల ప్రజలకు ఆరోగ్య సమస్యలు పెద్దగా ఉత్పన్నం కాలేదు. ఇకపై కృష్ణానది కూడా హుస్సేన్ సాగర్ వలే కాలుష్య కాసారం కానుందనే భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. మురుగునీటిపారుదలకు ఇప్పటి వరకు అంచనాలే కాని టెండర్లు కూడా ఆహ్వానించలేదు. సంస్కృతి-సంప్రదాయాలపై దాడి .... ఈ గ్రామాల్లోని కార్మికులకు నిర్మాణపనుల్లో నైపుణ్యం లేకపోవడంతో ఆయా నిర్మాణ సంస్థలు తప్పనిసరిగా ఇతర రాష్ట్రాల కార్మికులను దిగుమతి చేసుకోక తప్పదు. ముం బాయి, బీహార్ వంటి రాష్ట్రాల నుంచి దిగుమతి అయ్యే కార్మికులు అక్కడి తమ సంస్కృతి, ఆచార వ్యవహారాలు, అలవాట్లను ఇక్కడ వ్యాప్తి చేయడం, అంతేగాక వాటికి సంబంధిం చిన వ్యాపారాలు ఇక్కడ ప్రారంభమయ్యే అవకాశం లేకపోలేదు. ఈ పరిస్థితుల కారణంగా మన సంస్కృతి, సంప్రదాయాలకు భంగం వాటిల్లనుందనే భయాందోళన వ్యక్తమవుతోంది. రెండు నెలల కష్టాలు .... రెండు నెలల పాటు జరిగిన భూ సమీకరణలో రాజధాని గ్రామాల రైతుల కష్టాలు వర్ణనాతీతం. కంటిమీద కునుకు లేకుండా నిత్యం అభద్రతతో కాలం గడిపారు. అధికారులు, టీడీపీ పాలకులు రోజుకో విధంగా రైతుల్ని బెదిరించి భూ సమీకరణ పూర్తిచేశారు. భూ సమీకరణను వ్యతిరేకించిన వారిపై పోలీసులు వేధింపులు కొనసాగాయి. స్వచ్ఛందంగా భూ సమీకరణ జరిగిందని చెప్పుకుంటున్న ప్రభుత్వం రైతులు అంగీకారపత్రాలు ఇచ్చేందుకు వారి హక్కులకు భంగం కలిగించే విధంగా అనేక చర్యలు తీసుకున్నారు. -
బతుకు భయం
కాంక్రీటు జంగిళ్లు కాబోతున్న పంట చేలు పనుల్లేక ఏమీ పాలుపోని కర్షక లోకం సమస్యలుగా మారిన కుటుంబ బాధ్యతలు గరీబులుగా మారుతున్న జరీబు రైతులు ఇదీ రాజధాని గ్రామాల్లో రేపటి చిత్రం పూలు అమ్మిన చోటే కట్టెలు కొట్టాలి.. పల్లకీలో తిరిగిన చోటే బోయీగా మారాలి... కాలుమీద కాలేసుకున్న చోటే కాలికి బలపం కట్టుకుని పనిచేయాలి.. దర్జాగా జీవించిన చోటే దయనీయంగా బతకాలి.. పుట్టి పెరిగిన ఊళ్లోనే పరదే శీయుల్లా తిరగాలి..! ఇదీ రానున్న రోజుల్లో రాజధాని గ్రామాల్లోని అన్నదాతల దుస్థితి.. తెలుగుదేశం ప్రభుత్వం అనాలో చిత విధానాల కారణంగా జరీబు రైతులు గరీబులు కానున్నారు. బంగారం పండిన భూములు కాంక్రీటు జంగిళ్లుగా మారబోతున్నాయి. రాజధాని గ్రామాల భవిష్యత్‌ను తలచుకుంటే అమెరికా రాజకీయ వేత్త విలియం జెన్నింగ్స్ బ్రెయామ్ చెప్పిన ఓ వ్యాఖ్య గుర్తుకు రాకమానదు. ‘‘మీ నగరాలను దగ్ధం చేసి పొలాలను వదిలేయండి, మాయ చేసినట్టు నగరాలు మళ్లీ కళకళలాడతాయి. పొలాలను నాశనం చేసి నగరాలను వదిలిపెట్టండి, దేశమంతటా గడ్డే మొలుస్తుంది.’’ పొంచి ఉన్న పొల్యూషన్ ... రాష్ట్ర ప్రభుత్వం కాలుష్య రహిత రాజధాని నిర్మాణానికి చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ఈ నిర్మాణ పనుల సమయంలోనే కాలుష్యం పెరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు కాలుష్య కారకాలు పరిమితంగా ఉండటంతో కృష్ణానదీ పరివాహక ప్రాంతాల ప్రజలకు ఆరోగ్య సమస్యలు పెద్దగా ఉత్పన్నం కాలేదు. ఇకపై కృష్ణానది కూడా హుస్సేన్ సాగర్ వలే కాలుష్య కాసారం కానుందనే భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. మురుగునీటిపారుదలకు ఇప్పటి వరకు అంచనాలే కాని టెండర్లు కూడా ఆహ్వానించలేదు. సంస్కృతీ సంప్రదాయాలపై దాడి రాజధాని గ్రామాల్లోని కార్మికులకు నిర్మాణ పనుల్లో నైపుణ్యం లేకపోవడంతో ఆయా నిర్మాణ సంస్థలు తప్పనిసరిగా ఇతర రాష్ట్రాల కార్మికులను దిగుమతి చేసుకోక తప్పదు. ముంబయి, బీహార్ వంటి రాష్ట్రాల నుంచి దిగుమతి అయ్యే కార్మికులు అక్కడి తమ సంస్కృతి, ఆచార వ్యవహారాలు, అలవాట్లను ఇక్కడ వ్యాప్తి చేయడం, అంతేగాక వాటికి సంబంధించిన వ్యాపారాలు ఇక్కడ ప్రారంభమయ్యే అవకాశం లేకపోలేదు. ఈ పరిస్థితుల కారణంగా మన సంస్కృతీ సంప్రదాయాలకు భంగం వాటిల్లనుందనే భయాందోళన వ్యక్తమవుతోంది. రెండు నెలల కష్టాలు రెండు నెలల పాటు జరిగిన భూ సమీకరణలో రాజధాని గ్రామాల రైతుల కష్టాలు వర్ణనాతీతం. కంటిమీద కునుకు లేకుండా నిత్యం అభద్రతతో కాలం గడిపారు. అధికారులు, టీడీపీ పాలకులు రోజుకో విధంగా రైతుల్ని బెదిరించి భూ సమీకరణ పూర్తిచేశారు. భూ సమీకరణను వ్యతిరేకించిన వారిపై పోలీసుల వేధింపులు కొనసాగాయి. స్వచ్ఛందంగా భూ సమీకరణ జరిగిందని చెప్పుకొంటున్న ప్రభుత్వం రైతులు అంగీకార పత్రాలు ఇచ్చేందుకు వారి హక్కులకు భంగం కలిగించే విధంగా అనేక చర్యలు తీసుకున్నారు. జగన్ రాక కోసం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజధాని గ్రామాల్లోని రైతుల హక్కులకు రక్షణ కల్పించేందుకు, వారికి వెన్నుదన్నుగా నిలిచేందుకు అనేక పోరాటాలు, ఉద్యమాలు నడిపింది. ఆ ఉద్యమాల ఫలితమే జరీబు రైతులకు గడువుకు రెండు రోజుల ముందు ప్రభుత్వం అదనపు ప్యాకేజీని ప్రకటించింది. ‘మేమంతా మీ వెంటే’ అంటూ వైఎస్సార్ సీపీకి చెందిన 42 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు రాజధాని గ్రామాల్లో పర్యటించి రైతుకు భరోసా కల్పించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులు, రైతుకూలీలు, కౌలుదారులు, చేతివృత్తి పనివారల సమస్యలను తెలుసుకుని అసెంబ్లీలో వారి తరఫున పోరాటం చేసేందుకు వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ఇక్కడకు రానున్నారు. ఆయన రాకకోసం రాజధాని గ్రామాలు ఎంతో ఆశతో నిరీక్షిస్తున్నాయి. భూ సమీకరణ పూర్తికావడంతో రాజధాని గ్రామాల్లో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. రైతులు, రైతు కూలీలు, వ్యవసాయ కార్మికులు, చేతివృత్తి పనివారు తమ భవిష్యత్‌పై కలత చెందుతున్నారు. వ్యవసాయం మినహా మరో వ్యాపకం తెలియని ఈ వర్గాలు కొత్త జీవితాన్ని ఎలా ప్రారంభించాలి ? మిగిలిపోయిన పిల్లల చదువులు, వివాహాలు వంటి కుటుంబ బాధ్యతలను ఎలా నెరవేర్చాలి? ప్రభుత్వం సాలీనా ఇచ్చే నష్టపరిహారంతో కుటుంబాలను ఎలా నడ పాలి.. వంటి సమస్యలపైనే ఆలోచన చేస్తున్నారు. నిన్నటి వరకు పదిమందికి ఉపాధి కల్పించిన రైతు మరో నెలలో ఇతరుల వద్ద పనిచేయాల్సిన పరిస్థితి. మూడు పంటలు పండిస్తూ సాలీనా ఎకరాకు రూ.లక్ష ఆదాయం పొందిన జరీబు రైతుల పరిస్థితి అగమ్యగోచరం. నదీపరివాహక ప్రాంతంలో రెండు ఎకరాల జరీబు భూమి కలిగిన రైతు, సాగుతోపాటు పశుపోషణ వంటి అనుబంధ రంగాల నుంచి అధిక ఆదాయాన్ని పొంది గ్రామీణ ప్రాంతాల్లో సౌకర్యవంతమైన జీవితాన్ని గడిపారు. ఇకపై ప్రభుత్వం ఎకరాకు ఇవ్వనున్న రూ.50వేలతోనే సంవత్సరమంతా జీవనాన్ని కొనసాగించాలి. నిన్నటి వరకు రారాజులా గడిపిన జరీబు రైతు, ఇకపై ఖర్చుపై ఒకటికి రెండుసార్లు ఆలోచన చేయాలి. ముఖ్యంగా వెంకటపాలెం, మందడం, లింగాయపాలెం, ఉద్దండ్రాయునిపాలెం, రాయపూడి, అబ్బరాజుపాలెం, బోరుపాలెం తదితర గ్రామాల జరీబు రైతులు భవిష్యత్‌పై ఆందోళన చెందుతున్నారు. ఇప్పటివరకు పూలు, కూరగాయలు, పాలను విజయ వాడకు ఎగుమతి చేసిన ఈ రైతులకు ఇకపై ఆ పనులేవీ ఉండవు. - సాక్షి ప్రతినిధి, గుంటూరు ముంపు వచ్చినా.. నష్టం రాలేదు నాకున్న 80 సెంట్ల పొలంతో పాటు, మరో మూడెకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాను. నా 80 సెంట్లు కొండవీటి వాగులో మునిగిపోయినా, పంట నష్టం వచ్చినా, నేను కౌలుకు చేస్తున్న 3 ఎకరాల్లో లక్షా50వేల రూపాయలు ఆదాయం వస్తుంది. కుటుంబ పోషణతో పాటు పిల్లలను చదివించుకుంటున్నాను. భవిష్యత్తులో నా పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. - మన్నం హనుమంత రావు చౌదరి, కౌలు రైతు, పెనుమాక పూలుకోయడం తప్ప మరే పనీ తెలియదు మేం తరతరాల నుంచి పొలాన్నే నమ్ముకుని బతుకుతున్నాం. మాకు పూలు కోయడం తప్ప మరో పని తెలీదు. తెల్లవారుజామున నాలుగు గంటలకు లేచి పిల్లలకు వంట చేసి క్యారేజీలు పెట్టుకుని వస్తాం. రోజుకు నాలుగైదు వందలు సంపాదిస్తాం. పిల్లలను చదివించుకుంటున్నాం. మాకు రుణమాఫీ వద్దు, డ్వాక్రా రుణాలు వద్దు మా భూములను వదిలిపెడితే చాలు. - గౌరుబోయిన జయమ్మ, బేతపూడి పూలతోటతోనే మా బతుకు పూలతోటలో కూలికి వెళ్తే వచ్చే సంపాదనపై ఆరుగురం బతుకుతూ పిల్లల్ని చదివించుకుంటున్నాం. ఏదైనా ఇబ్బందైతే రైతులు ఆదుకుంటారు. ఎందుకంటే.. మళ్లీ కూలీ చేసైనా తీరుస్తామని వారికి నమ్మకం. వారి పొలాలే పోతే మమ్మల్ని ఎలా ఆదుకుంటారు. రెండు రోజులుగా గ్రామంలో రైతులు భయపడి భూములను ఇచ్చేస్తున్నారు. భవిష్యత్తు ఏంటో తెలియడం లేదు. - సంకూరు సబ్బులు, రైతు కూలీ, నిడమర్రు ఇప్పుడెలా? రైతులు భయపడి పొలాలను ఇచ్చేశారు. ఉదయం నాలుగు గంటలకు లేచి వంట చేసుకుని వచ్చి కూలీ చేసుకుని ప్రశాంతంగా బతుకుతున్నాం. వచ్చే నెల నుంచి ఏం చేసి బతకాలో తెలియడం లేదు. - పార్వతి, రైతు కూలీ, కురగల్లు -
భూములివ్వనివారే కోటీశ్వరులు !
రాజధానికి భూములు ఇవ్వనివారు సాగు చేసుకునేందుకు అనుమతి ఇచ్చినవారు పంటలు వేసుకునేందుకు నిరాకరణ ఇప్పటికే కోటీశ్వరులుగా భూములివ్వని తాడేపల్లి, మంగళగిరి రైతులు ఇచ్చినవారికి ప్రభుత్వం ఇచ్చే ఎకరానికి వెయ్యి గజాల స్థలమే దిక్కు వెయ్యి గజాల స్థలానికి ఎన్నేళ్లకు మంచి ధర వస్తుందనే అనుమానాలు పునరాలోచనలో భూములు ఇచ్చిన తుళ్లూరు రైతాంగం అంగీకార పత్రాలు వెనక్కి తీసుకునే అవకాశాలపై సంప్రదింపులు గుంటూరు : రాజధాని గ్రామాల్లో భూ సమీకరణకు ప్రభుత్వం మరోసారి గడువు పొడిగించడంతో రైతులు తర్జనభర్జన పడుతున్నారు. మొదటి నుంచీ భూ సమీకరణను వ్యతిరేకిస్తూ ఉద్యమాలు నడిపిన మంగళగిరి, తాడేపల్లి రైతులకు సానుకూలంగా, భూములు ఇచ్చిన తుళ్లూరు రైతులకు ప్రతికూలంగా పరిస్థితులు ఏర్పడుతున్నాయి. భూములు ఇచ్చేందుకు అంగీకార పత్రాలు ఇచ్చిన తుళ్లూరు రైతుల పొలాల్లో ప్రభుత్వం సాగును నిషేధించింది. దీంతో రబీలో పంటల సాగుకు వీల్లేకుండా పోయింది. అభ్యంతర పత్రాలు ఇచ్చిన తాడేపల్లి, మంగళగిరి రైతులకు మాత్రం అనుమతి లభించడంతో వారు ముమ్మరంగా రబీ పనులు చేసుకుంటున్నారు. భూ సమీకరణకు చట్టబద్ధత లేకపోవడంతో రైతుల నుంచి ప్రభుత్వం బలవంతంగా భూములు తీసుకోలేకపోతోంది. నిధుల కొరత కారణంగా భూ సేకరణకు ముందుకు వెళ్లలేకపోతోంది. దీంతో తాడేపల్లి, మంగళగిరి రైతుల పొలాలు వారి వద్దనే ఉన్నాయి. పైగా తమ అభ్యంతర పత్రాల ఉద్యమానికి రాజకీయ పార్టీలు కూడా దన్నుగా నిలుస్తుండటంతో ఈ మండలాల రైతులు నిశ్చింతగా ఉన్నారు. మరోవైపు భూములిచ్చిన తుళ్లూరు రైతులకు మాత్రం ప్రభుత్వం ఇచ్చే కొద్ది గజాల స్థలమే మిగలనుంది. ఈ పరిస్థితుల్లోనే ఇప్పటివరకు సమీకరించిన భూమిని ఇతర పరిశ్రమలకు లీజుకు ఇచ్చేందుకు, అమ్మేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ముఖ్యమంత్రి, మంత్రులు ఇచ్చిన హామీలు నెరవేరే సూచనలు కనిపించకపోవడం, రాజధాని నిర్మాణం ప్రారంభం కాకుండానే ప్రభుత్వం తమ భూముల అమ్మకాలు, లీజులు ప్రారంభిస్తుందేమోనన్న ఆందోళనతో.. భూములిచ్చిన రైతులు పునరాలోచనలో పడ్డారు. ఇచ్చిన అంగీకారపత్రాలను ఉపసంహరించుకునే అవకాశాల కోసం న్యాయవాదులను సంప్రదిస్తున్నారు. ఆశించిన స్థాయిలో సాగని సమీకరణ భూ సమీకరణకు తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు మండలాల్లో గ్రామాల వారీగా వివిధ తేదీల్లో ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేసింది. నెల రోజుల వ్యవధిని గడువుగా నిర్ణయించారు. జనవరి 2 నుంచి 11 వరకు గ్రామాల వారీగా నోటిఫికేషన్లు జారీ చేశారు. ఎన్నికల కోడ్ కారణంగా డెప్యూటీ కలెక్టర్లు విధుల్లో చేరకపోవడంతో భూ సమీకరణ లక్ష్యం చేరుకోలేక పోయామంటూ మంత్రి పి.నారాయణ గడువు తేదీని ఫిబ్రవరి 14 వరకు పొడిగించారు. అప్పటివరకు 29 గ్రామాల్లో 21,627 ఎకరాలను సమీకరించారు. అప్పటికి తుళ్లూరు మండలంలో 17,684, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లో 3,943 ఎకరాలకు రైతులు అంగీకార పత్రాలు ఇచ్చారు. 31,205 ఎకరాల లక్ష్యానికి ఇంకా 9,578 ఎకరాలను సమీకరించాల్సి ఉంది. రైతుల కోరిక మేరకు భూ సమీకరణ గడువు తేదీని ఈ నెల 28 వరకు పొడిగించినట్టు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రకటించారు. ఈ ప్రకటన తుళ్లూరు మండల రైతుల్లో మరింత కలవరం సృష్టించింది. నెల రోజుల క్రితం అంగీకారపత్రాలు ఇచ్చినా ప్యాకేజీ చెల్లింపుపై ప్రభుత్వం ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వారిలో అనుమానాలు పెంచుతోంది. పైగా భూములు ఇచ్చిన తమ పంట భూముల్లో సాగుపై నిషేధం విధించడం, ఇవ్వనివారిని సాగుకు అనుమతించడం వారిలో తీవ్ర ఆగ్రహావేశాలు రగిలిస్తోంది. ప్రభుత్వ వైఖరి ఎంతవరకు సమంజసమని టీడీపీ ప్రజాప్రతినిధులు, అధికారులను రైతులు నిలదీస్తున్నారు. ఇచ్చిన ఎకరా భూమికి ప్రభుత్వం ఇవ్వనున్న 1,000 చదరపు గజాల స్థలానికి ఎన్నేళ్లకు మంచి ధర వస్తుందో, అప్పటికి పరిస్థితులు ఎలా ఉంటాయోనని ఏమీ పాలుపోని స్థితిలో తర్జనభర్జనలు పడుతున్నారు. సందేహం.. సంశయం.. చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం మూడేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తిగా జరిగితే.. ప్రభుత్వం ఇవ్వనున్న 1,000 చదరపు గజాల స్థలానికి(చదరపు గజం రూ.30 వేల చొప్పున) రూ.3 కోట్లు వస్తాయనుకున్నా.., ఇప్పటి పరిస్థితులు అందుకు సానుకూలంగా లేవనే సందేహాలు భూములిచ్చిన రైతాంగంలో వ్యక్తం అవుతున్నాయి. కేంద్రం నుంచి సహకారం పూర్తిగా లేకపోవడంతో రాజధాని నిర్మాణం మూడేళ్లలో పూర్తికాదనే సందేహమూ వారిని వెన్నాడుతోంది. దీంతో ఇచ్చిన అంగీకారపత్రాలు ఉపసంహరించుకునే అవకాశాల కోసం న్యాయవాదులను సంప్రదిస్తున్నారు. మరోవైపు తాడేపల్లి, మంగళగిరి మండలాల్లోని రైతులు మొదటి నుంచి భూ సమీకరణకు వ్యతిరేకంగా ఉన్నారు. ఉద్యమాన్నీ చేపట్టారు. వీరికి వైఎస్సార్సీపీతోపాటు ఇతర పార్టీలు మద్దతుగా నిలబడటంతో 3,943 ఎకరాలకే భూ సమీకరణ పరిమితమైంది. మిగిలిన రైతులు యధాతథంగా సాగు చేసుకుంటున్నారు. పెరుగుతున్న సందేహాలు చంద్రబాబు అనుసరిస్తున్న విధానాలు రైతుల్లో సందేహాలను పెంచుతున్నాయి. తాత్కాలిక రాజధాని నిర్మాణానికి ఒక ప్రైవేట్ కంపెనీ నుంచి సమీకరిస్తున్న భూమికి గాను ఎకరాకు ఎకరా ఇస్తూ నిర్ణయం తీసుకుంది. తమకు మాత్రం ఎకరాకు 1,000 చదరపు గజాల స్థలం మాత్రమే ఇవ్వడంపై రైతులు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయించలేక తాము ఇచ్చిన భూములు విక్రయించే దిశగా చర్యలు తీసుకుంటుందేమోనన్న అనుమానాలు వారిని వెంటాడుతున్నాయి. ఈ పరిస్థితుల్లోనే అంగీకార పత్రాలు వెనక్కి తీసుకునే దిశగా రైతులు ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు.