captain Shekanna
-
త్వరలో మాజీ సైనికుల కల సాకారం
అనంతపురం సెంట్రల్ : జిల్లా కేంద్రంలోని మాజీ సైనికుల ఇంటిపట్టాల కల త్వరలో సాకారం కానుందని మాజీ సైనికుల సంఘం అధ్యక్షుడు కెప్టెన్ షేకన్న తెలిపారు. ఆదివారం హెచ్చెల్సీ కాలనీలోని సంఘం కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఇంటి పట్టాల మంజూరుకు మార్గం సుగమం అవుతోందని చెప్పారు. జిల్లాలో మాజీ సైనికుల భూమి ఆక్రమణకు గురైతే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ సమావేశంలో మాజీ సైనికులు శ్రీనివాసులు, అబ్దుల్‌ఖాదర్, ఆంజనేయులు, రమేష్‌రెడ్డి, నారాయణరెడ్డి, ఆజాద్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
ఆంధ్ర రెజిమెంటల్ సెంటర్‌ను స్థాపించాలి
అనంతపురం సెంట్రల్ : రాష్ట్ర విభజన తర్వాత నూతన రెజిమెంటల్ సెంటర్‌ను జిల్లాలో స్థాపించాలని జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు కెప్టెన్ షేకన్న డిమాండ్ చేశారు. ఆదివారం హెచ్చెల్సీ కాలనీలోని సంఘం కార్యాలయంలో యూనియన్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కెప్టెన్ షేకన్న మాట్లాడుతూ ఆంధ్ర రెజిమెంటల్ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు జిల్లా అనువైన ప్రాంతమని పేర్కొన్నారు. దీని వలన జనాభా ప్రాతిపదికన ఆంధ్రులు ఆర్మీలో సేవ చేసే భాగ్యం కలుగుతుందని పేర్కొన్నారు. కావున ప్రజాప్రతినిధులు, అధికారులు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని కోరారు. ఆగస్టు 15న మాజీ సైనికుల కార్యాలయంపై జాతీయ పతాకం ఎగురవేసి అనంతరం నగరంలో ర్యాలీ నిర్వహిస్తామన్నారు. సమావేశంలో రమేష్‌కుమార్‌రెడ్డి, మణికుమార్, కేవీనారాయణరెడ్డి, నాయుడు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.