ఆంధ్ర రెజిమెంటల్‌ సెంటర్‌ను స్థాపించాలి | andhra regimental centre in district | Sakshi
Sakshi News home page

ఆంధ్ర రెజిమెంటల్‌ సెంటర్‌ను స్థాపించాలి

Published Sun, Jul 31 2016 11:37 PM | Last Updated on Sat, Aug 18 2018 4:23 PM

andhra regimental centre in district

అనంతపురం సెంట్రల్‌ :  రాష్ట్ర విభజన తర్వాత నూతన రెజిమెంటల్‌ సెంటర్‌ను జిల్లాలో స్థాపించాలని జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు కెప్టెన్‌ షేకన్న డిమాండ్‌ చేశారు. ఆదివారం హెచ్చెల్సీ కాలనీలోని సంఘం కార్యాలయంలో యూనియన్‌ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కెప్టెన్‌ షేకన్న మాట్లాడుతూ ఆంధ్ర రెజిమెంటల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు జిల్లా అనువైన ప్రాంతమని పేర్కొన్నారు.


దీని వలన జనాభా ప్రాతిపదికన ఆంధ్రులు ఆర్మీలో సేవ చేసే భాగ్యం కలుగుతుందని పేర్కొన్నారు. కావున ప్రజాప్రతినిధులు, అధికారులు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని కోరారు. ఆగస్టు 15న మాజీ సైనికుల కార్యాలయంపై జాతీయ పతాకం ఎగురవేసి అనంతరం నగరంలో ర్యాలీ నిర్వహిస్తామన్నారు.  సమావేశంలో  రమేష్‌కుమార్‌రెడ్డి,  మణికుమార్, కేవీనారాయణరెడ్డి, నాయుడు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement