Car rally
-
కేటీఆర్‌తో కలిసి హైదరాబాద్ బయలుదేరిన కవిత..
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ నుంచి ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్‌కు బయలుదేరారు. కేటీఆర్, భర్త అనిత్, కుటుంబ సభ్యులతో కలిసి కవిత విమానాశ్రయానికి బయలుదేరారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది. నా పోరాటం కొనసాగుతుంది. నిజం కచ్చితంగా గెలుస్తుంది. అనారోగ్యం నుంచి కోలుకోవాల్సి ఉంది. సహకరించిన ప్రతీ ఒక్కరికీ ధన్యావాదాలు. జై తెలంగాణ’ అంటూ కామెంట్స్ చేశారు. #WATCH | BRS leader K Kavitha along with party leader and her brother KT Rama Rao in Delhi(Video source: BRS) pic.twitter.com/xYedikX7Ee— ANI (@ANI) August 28, 2024నేడు 500 కార్లతో భారీ ర్యాలీ కవిత జైలు నుంచి విడుదలై రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో ఆమెకు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం పలకనున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి సుమారు 500 కార్లతో భారీ ర్యాలీ ఏర్పాటు చేస్తున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ శ్రేణుల్లో సందడి నెలకొంది.జైలు నుంచి విడుదల..ఇదిలా ఉండగా.. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలను ఎదుర్కొంటూ 166 రోజులపాటు ఢిల్లీ తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కవితకు సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్ మంజూరుచేసింది. ఈ క్రమంలో తీహార్ జైలు నుంచి విడుదల అనంతరం కవిత భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ..‘నేను 18 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. ఎన్నో ఎత్తు పల్లాలు చూశా. ఐదున్నర నెలల తర్వాత కుటుంబ సభ్యులను, కార్యకర్తల్ని, మీడియాను కలవడం ఎంతో సంతోషంగా ఉంది. ఒక తల్లిగా పిల్లల్ని వదిలేసి ఐదున్నర నెలలు ఏనాడూ ఉండలేదు. ఇది చాలా ఇబ్బందికరమైన విషయం. నన్ను, నా కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేసిన వారికి తప్పకుండా వడ్డీతో సహా చెల్లిస్తాం, సరైన సమయానికి సరైన సమాధానం చెబుతాను. కష్టకాలంలో తోడుగా నిలిచిన ప్రతి ఒక్క కార్యకర్తకూ నా కృతజ్ఞతలు. ఎవరి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నేను కేసీఆర్ బిడ్డను. తెలంగాణ బిడ్డను. కమిట్మెంట్తో పనిచేస్తాను, న్యాయపరంగా ఎదుర్కొంటాను, రాజకీయంగా కొట్లాడతాను. నేను మాములుగా కాస్త మొండిదానిని, మంచిదానిని, నన్ను అనవసరంగా జైలుకు పంపి ఇప్పుడు జగమొండిని చేశారు’ అంటూ వ్యాఖ్యానించారు. తనను అక్రమంగా జైలుకు పంపారని, బీఆర్ఎస్, కేసీఆర్‌ను విచ్ఛిన్నం చేయడానికే ఇలా చేశారు’ అంటూ కామెంట్స్ చేశారు.నా తప్పు లేకున్నా.. కేవలం రాజకీయాల కోసం నన్ను జైల్లో పెట్టారు. ఈ విషయం దేశం మొత్తానికి తెలుసు.నేను తెలంగాణ బిడ్డను.. కేసీఆర్ బిడ్డను.. తప్పు చేసే ప్రసక్తే లేదు.రాజకీయంగా, న్యాయపరంగా పోరాడుతా.. తప్పకుండా నిర్దోషిగా నిరూపించుకుంటా.- ఎమ్మెల్సీ @RaoKavitha pic.twitter.com/3RTl9uPaFS— BRS Party (@BRSparty) August 27, 2024 -
బెంగళూరులో వింటేజ్ కార్ల ర్యాలీ - ఫోటోలు
బెంగళూరు: లోక్‌సభ 2024 ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో ఓటర్లలో అవగాహన పెంచేందుకు, ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు జిల్లా ఎన్నికల అధికారి, బీబీఎంపీ చీప్ కమిషనర్ 'తుషార్ గిరినాథ్' వింటేజ్ కార్, బైక్ ర్యాలీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే.. పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం చాలా తక్కువగా ఉంది. చదువుకున్న వారిలో కూడా చాలామంది ఓటు వేయడానికి ఆసక్తి చూపడటం లేదు. ఇలాంటి విధానానికి స్వస్తి పలకడానికి పాతకాలపు కార్లు, బైకులతో బెంగళూరులో ర్యాలీ నిర్వహించడం జరిగింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పాతకాలపు కార్ల ర్యాలీ నిర్వహించే సమయంలో జిల్లా రిటర్నింగ్ అధికారి, చీఫ్ కమిషనర్ తుషార్ గిరినాథ్.. అక్కడున్న వారందరిచేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ ర్యాలీ విధాన సౌధ నుంచి ప్రారంభమై.. ఇన్ఫ్యాంట్రీ రోడ్డు, ఎంజీ రోడ్డు, చిన్నస్వామి స్టేడియం, ట్రినిటి సర్కిల్, రెసిడెన్సీ రోడ్డు మీదుగా కంఠీరవ స్టేడియం వద్ద ముగిసింది. సుమారు వందేళ్ల నాటి అపురూపమైన కార్లు నగర వీధుల్లో దూసుకెళ్తుంటే నగరవాసులు చాలా ఆసక్తిగా తిలకించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల విభాగం ప్రత్యేక కమిషనర్ సెల్వమణి, జిల్లా స్వీప్ కమిటీ చైర్మన్ కాంతరాజు, స్వీప్ నోడల్ అధికారిణి ప్రతిభ మొదలైన వారు పాల్గొన్నారు. ಸಾರ್ವತ್ರಿಕ ಲೋಕಸಭಾ ಚುನಾವಣೆ ಹಿನ್ನೆಲೆಯಲ್ಲಿ ಮತದಾರರಲ್ಲಿ ಜಾಗೃತಿ ಮತ್ತು ಮತದಾನದ ಪ್ರಮಾಣ ಹೆಚ್ಚಿಸುವ ಸಲುವಾಗಿ ವಿಂಟೇಜ್ ಕಾರ್ ಹಾಗೂ ಬೈಕ್ ಗಳ ರ್ಯಾಲಿ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಚಾಲನೆ ನೀಡಲಾಯಿತು. pic.twitter.com/AwsctvmaLO — Tushar Giri Nath IAS (@BBMPCOMM) March 31, 2024 -
Australia : యాత్ర 2 కార్ ర్యాలీ.. YSRCP సిద్ధం
‘‘యాత్ర 2” సినిమా విజయవంతమైన సందర్భంగా వైఎస్సార్సీపీ ఆస్ట్రేలియా కన్వీనర్ సూర్యనారాయణ రెడ్డి నేతృత్వంలో “టీమ్ మెల్బోర్న్ - వైఎస్సార్సీపీ ఆస్ట్రేలియా’’ ఆధ్వర్యంలో కార్ ర్యాలీ నిర్వహించారు. దివంగత నేత వైఎస్సార్ జీవితంలోని కీలక ఘటనలను, అలాగే ప్రస్తుత ముఖ్యమంత్రి, YSRCP అధ్యక్షడు వైఎస్ జగన్ రాజకీయ ప్రారంభ దశలోని ముఖ్యమైన అంశాలను ఆధారంగా సినిమాని తెరకెక్కించడంలో దర్శకుడు మహి రాఘవ సక్సెస్ అయ్యాడని ప్రశంసించారు. ప్రజల మనసులను గెలిచిన మారాజు డా.వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి జీవన వృత్తాంతాన్ని చక్కగా సినిమాగా రూపొందించారని ప్రశంసించారు. ఈ ర్యాలీని మెల్బోర్న్ టీమ్ సభ్యులు కృష్ణారెడ్డి, భరత్, రామాంజి, నాగార్జున, మణిదీప్, సతీష్‌లు చక్కగా సమన్వయం చేశారు. సిద్ధం పోస్టర్‌ను ఆవిష్కరించడంతో పాటు, వైఎస్సార్సీపీ పోరాటానికి తిరుగులేని మద్దతునిస్తూ “జై జగన్”, “జోహార్ వైఎస్ఆర్”, “ఎన్నికల సమరానికి మేము సిద్ధం” నినాదాలతో.. వేదిక వద్ద వాతావరణం మారుమోగింది. ఉత్సాహభరితమైన ర్యాలీ తరువాత, వైఎస్సార్సీపీ మద్దతుదారులు "యాత్ర 2" చిత్రం ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేసారు. 2024లో జరగబోయే ఏపీ 175 అసెంబ్లీ ఎన్నికలకు, అలాగే లోక్‌సభ 25 స్థానాల ఎన్నికలకు YSRCP సిద్ధంగా ఉందని, సీఎం జగన్ నినాదం వైనాట్ 175ని నిజం చేసేందుకు ప్రతీ ఒక్క ప్రవాసాంధ్రుడు కృషి చేస్తారని తెలిపారు. గడచిన ఐదేళ్లలో రాష్ట్రానికి జరిగిన ప్రయోజనలు, విద్యా, వైద్య, పారిశ్రామిక, మౌలిక సదుపాయాల్లో జరిగిన అభివృద్ధి, సంక్షేమం గురించి ప్రతీ ఒక్క ఎన్నారై స్టార్ క్యాంపెయినర్‌గా మారి ప్రచారం చేస్తారని తెలిపారు. -
వైఎస్సార్సీపీకి మద్దతుగా మెల్బోర్న్లో భారీ కార్ ర్యాలీ
-
అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట: చిన్మయ మిషన్ పిట్స్బర్గ్ రామ మయం!
500 ఏళ్ల నిరీక్షణ తర్వాత జరిగిన బాల రాముడి ప్రాణ ప్రతిష్ట మహొత్సవం పురస్కరించుకుని చిన్మయ మిషన్ పిట్స్బర్గ్ రామనామంతో మారుమ్రోగిపోయింది. ఈ చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకుని చిన్మయ మిషన్ పిట్స్బర్గ్ జనవరి 21న పెద్ద ఎత్తున కార్లతో ఊరేగింపు నిర్వహించింది, ఆ తర్వాత లోకక్షేమం కోసం శ్రీ సీతా రామ కల్యాణం కూడా నిర్వహించింది. ఈ కారు యాత్ర చిన్మయ అమర్నాథ్ శివాలయం నుంచి 30 మైళ్ల దూరంలో ఉన్న చిన్మయ హనుమాన్ దేవాలయం వరకు సాగింది. అందుకోసం సుమారు 141 కార్లతో పెద్ద ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు చిన్నపిల్లలు, వృద్ధ తల్లిదండ్రులతో సహా కుటుంబాలు చలిని సైతం లెక్కచేయకుండా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. రామ నామాన్ని జపిస్తే -10 డిగ్రీల సెల్సియస్ చలి కూడా ఏం చేయలేదని ఈ కారు యాత్ర మనకు అవగతమయ్యేలా చేసింది. పుణ్యభూమి అయోధ్యతో పాటు పిట్స్బర్గ్ కూడా భక్తుల రామ భక్తితో మరో అయోధ్యగా మారింది. ఎక్కడ చూసినా "జై శ్రీరామ్" అనే భక్తి నినాదాలు ఆకాశంలో ప్రతిధ్వనించాయి. కారు ఊరేగింపు అనంతరం చిన్మయ సంజీవిని హనుమాన్ దేవాలయంలో లోక క్షేమం కోసం అని శ్రీ సీతా రామ కల్యాణ ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపించింది చిన్మయ మిషన్ పిట్స్బర్గ్. అలాగే మహా ప్రసాద వితరణతో ఈ ఉత్సవం ఘనంగా ముగిసింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వాలంటీర్స్‌కి , భక్తులకి సదరు ఆలయ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియచేశారు. (చదవండి: అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట: అసలేంటీ ప్రాణ ప్రతిష్ట? ఎందుకు నిర్వహిస్తారో తెలుసా?) -
అమెరికాలో కాంగ్రెస్ గెలుపు సంబురాలు
-
బీఆర్ఎస్ పార్టీ మద్దతుగా అమెరికాలో కారు ర్యాలీ
-
చంద్రబాబుకు మద్దతుగా ఐటీ ప్రొఫెషనల్ పేరుతో సంఘీభావ యాత్ర
-
టీడీపీ ఐటీ కార్ ర్యాలీకి అనుమతి లేదు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం)/గరికపాడు(జగ్గయ్యపేట): స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టయి, రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండు ఖైదీగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు సంఘీభావంగా టీడీపీ ఆధ్వర్యంలో హైదరాబాద్ నుంచి ఐటీ ఉద్యోగులు చేపట్టిన కార్ ర్యాలీకి అనుమతి లేదని రాష్ట్ర పోలీసులు స్పష్టం చేశారు. చలో రాజమండ్రి పేరుతో ఆదివారం హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు చేపట్టిన ర్యాలీ చట్టవిరుద్ధమని హెచ్చరించారు. ఈ ర్యాలీ నిర్వహించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాహనాల యజమానులు, డ్రైవర్లపైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ముందస్తు భద్రత చర్యలో భాగంగా తెలంగాణ, ఏపీ సరిహద్దుల్లో ఎన్టీఆర్ జిల్లా గరికపాడు వద్ద శనివారం రాత్రి పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ డీసీపీ ఎ.అజిత పర్యవేక్షణలో నందిగామ డీఎస్పీ జనార్దన్‌నాయుడు, సీఐ జానకిరామ్ ఆధ్వర్యంలో పికెట్ ఏర్పాటు చేశారు. అనుమతులు లేకుండా ర్యాలీ చేస్తే చర్యలు తీసుకుంటామని డీసీపీ హెచ్చరించారు. ర్యాలీ చేస్తే నిర్వాహకులపై చర్యలు: తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ జగదీష్ తూర్పు గోదావరి జిల్లాలో ఈ నెల 30వ తేదీ వరకు సెక్షన్–144, పోలీస్ యాక్ట్–30 అమలులో ఉన్నందున ఎటువంటి ర్యాలీలు, యాత్రలు, ధర్నాలు, నిరసనలకు అనుమతి లేదని జిల్లా ఎస్పీ పి.జగదీష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐటీ ప్రొఫెషనల్స్ పేరుతో చేపట్టిన కారు సంఘీభావ యాత్రకు ఎటువంటి అనుమతి లేదని, జిల్లాలోకి ఈ యాత్ర ప్రవేశిస్తే నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కారు యజమాని, డ్రైవర్ల లైసెన్సులు రద్దు చేస్తామని స్పష్టంచేశారు. రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేసి వాహన చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి, డ్రైవింగ్ లైసెన్సులను రద్దు చేస్తారని చెప్పారు. ఈమేరకు ఆర్టీవోకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. జిల్లా ప్రజల ప్రశాంత జీవనానికి ఆటంకం లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని, శాంతిభద్రతలను కాపాడాలని పోలీస్ అధికారులను ఆదేశించామని చెప్పారు. -
HYD: సీఎం జగన్‌కే మా మద్దతు.. ఐటీ ఉద్యోగుల భారీ ర్యాలీ
సాక్షి, మేడ్చల్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మద్దతుగా హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులు భారీ ర్యాలీ చేపట్టారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేయడం కరెక్టే అంటూ ఐటీ ఉద్యోగులు తమ మద్దతు ప్రకటిస్తూ కార్ల ర్యాలీ తీశారు. ఈ క్రమంలో ఐటీ ఉద్యోగులు భారీ సంఖ్యలో కీసర ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కార్లలో ర్యాలీ చేపట్టారు. తమ కార్ల ర్యాలీ ఔటర్ రింగ్ రోడ్డు నుంచి గచ్చిబౌలి వరకు సాగుతుందని ఐటీ ఉద్యోగులు తెలిపారు. ఈ సందర్భంగా జై జగన్.. జై జగన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. ఎవరెన్ని మాట్లాడినా మళ్లీ అధికారంలోకి వచ్చేది సీఎం జగన్ ప్రభుత్వమే. చంద్రబాబు అవినీతి చేయకపోతే అన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి. నిన్న ఓఆర్ఆర్పై పెయిడ్ ఆర్టిస్టులు చంద్రబాబుకు మద్దుతుగా ర్యాలీ చేశారు. అచ్చెన్నాయుడు.. ప్లీజ్.. ప్లీజ్ అని బ్రతిమాలుకుంటే, దండ పెడతాను అంటే వారు ర్యాలీ చేపట్టారు. ఓఆర్ఆర్ కట్టింది.. తెచ్చిందే వైఎస్సార్. ఇక్కడ చంద్రబాబు చేసిన అభివృద్ధి ఏమీ లేదు. రానున్న కాలంలో చంద్రబాబు జైల్లోనే ఉంటారు. హైటెక్ సిటీ కమాన్ ఒక్కటే చంద్రబాబు కట్టారు. పక్కన ఫైనాన్షియల్ డిస్ట్రిక్, గచ్చిబౌలి వచ్చింది వైఎస్సార్, కేసీఆర్ హయాంలోనే. వైఎస్సార్ ఉన్న సమయంలోనే ఎయిర్‌పోర్టు, రింగ్ రోడ్డు వచ్చాయి. చంద్రబాబు చేసిందేమీలేదు. స్కామ్ ప్రూవ్ అయ్యింది కాబట్టే.. కోర్టు రిమాండ్ ఇచ్చింది కాబట్టే.. చంద్రబాబు జైలుకు వెళ్లారు. ఎంత మంది వచ్చినా.. ఎన్ని మాటలు మాట్లాడినా.. సీఎం జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు ఇది ఫిక్స్ అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: ఫేక్ ప్రచారంలో టీడీపీ ‘స్కిల్’ -
‘తుంగతుర్తి టికెట్‌పై పునరాలోచించాలి’
సాక్షి ప్రతినిధి, సూర్యాపేట: ‘2001 నుంచి ఇప్పటి వరకు తుంగతుర్తి నియోజకవర్గంలో పార్టీ నాయకుడిగా తెలంగాణ కోసం ఉద్యమించా.. పార్టీని నియోజకవర్గంలో నేనే బలోపేతం చేశా.. తుంగతుర్తి నియోజకవర్గ టికెట్ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పునరాలోచించాలి. నాకు టికెట్ ఇస్తే అత్యధిక మెజార్టీ తో గెలుస్తా’అని టీఆర్ఎస్ నేత, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ మందుల సామేల్ అన్నారు. బుధవారం ఆయన హైదరాబాద్ నుంచి సూర్యాపేట జిల్లా తుంగతుర్తి వరకు తన అనుచరులతో కలసి కార్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు చోట్ల టీఆర్ఎస్ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. 2014లో ఓయూ నేతకు టికెట్ ఇస్తే కేసీఆర్ ఆదేశాల మేరకు ఆ అభ్యర్థి విజయం కోసం కృషి చేశానన్నారు. తాను ఎప్పటికీ కేసీఆర్ వెంటే ఉంటానని, టికెట్ విషయంలో పునరాలోచించాలని అన్నారు. ర్యాలీలో నియోజకవర్గ ముఖ్య నేతలు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లు పాల్గొన్నారు. -
మిలియన్ మామ్స్ ర్యాలీ ప్రారంభించిన ఆకాశ్ పూరీ
శంషాబాద్: నిత్యం కుటుంబ బాధ్యతల్లో తలమునకలయ్యే అమ్మలందరూ ఆరోగ్యంపై తప్పనిసరిగా శ్రద్ధ తీసుకోవాలని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్‌పోర్టులోని నొవాటెల్ హోటల్ వద్ద మిలియన్ మామ్స్ కార్ ర్యాలీని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. అమ్మ బాగుంటేనే కుటుంబంలోని సభ్యులంతా ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. మహిళల ఆరోగ్యంపై చైతన్యపరిచే ఉద్దేశంతో నిర్వహిస్తున్న ఈ ర్యాలీ విజయవంతం కావాలని ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ ఆకాంక్షించారు. సమయం, వేగం, గమ్యం ఆధారితంగా నిర్వహించే ఈ ర్యాలీలో మొత్తం 75 మంది మహిళలు పాల్గొన్నారని కార్యక్రమ నిర్వాహకులైన షాదాన్ విద్యాసంస్థల ప్రతినిధులు తెలిపారు. ఇందులోంచి ఇద్దరిని విజేతలు ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. ర్యాలీ నొవాటెల్ నుంచి కాళీమందిర్ సమీపంలోని షాదాన్ కాలేజీ వరకు ఉంటుందన్నారు. మొత్తం మిలియన్ మంది మహిళలను చైతన్యం చేసే విధ ంగా కార్యక్రమాలను రూపొందించినట్లు డాక్టర్ మనిపవిత్ర తెలిపారు. విజేతలను సోమవారం ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఈ ర్యాలీలో ప్రముఖ సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ కుమారుడు, నటుడు ఆకాష్ పూరి తదితరులు పాల్గొన్నారు. -
మతాలకు అతీతంగా అందరూ కలిసిఉండాలి
-
ఆకట్టుకున్న అంధుల కార్ ర్యాలీ
మాదాపూర్, న్యూస్‌లైన్: అంధుల చూపే మార్గంలో కారును నడిపే ప్రక్రియ అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. బ్రెయిలీ లిపి బోర్డు ఆధారంగా కారు ర్యాలీ గమ్యస్థానానికి చేరుకోవడాన్ని అంతా ఆసక్తిగా తిలకించారు. ఆదివారం గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్ వద్ద ఎయిర్‌సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంధుల కార్ ర్యాలీని సినీనటి మధుషాలిని ప్రారంభించారు. ఇందులో 50 కార్లు పాల్గొన్నాయి. కారులో అంధునితోపాటు ఓ డ్రైవర్ ఉంటారు. అంధుడు కారు ముందు సీట్లో కూర్చోని బ్రెయిలీ పటం ద్వారా చేసే సూచనల మేరకు డ్రైవర్ కారును నడుపుతూ గమ్యస్థానానికి చేరుకోవడం ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం. సమయం, వేగం, దూరం పద్ధతి ద్వారా ఈ ర్యాలీ 50 కిలోమీటర్ల మేరకు ప్రయాణించనున్నట్లు, విజేతలకు బహుమతి ప్రదానం చేయనున్నట్టు ఎయిర్‌సెల్ రీజినల్ బిజినెస్ హెడ్ (సౌత్) హమీబక్షి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో భవన నిర్మాణాలు చేపట్టేందుకు అవసరమైన నిధుల సమీకరణకు కోసం ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టినట్టు ఆయన పేర్కొన్నారు. ఇలాంటి ప్రదర్శన చూడలేదు: మధుషాలిని కంటి చూపు లేక ప్రపంచాన్ని చూడలేని వారు తమ ప్రతిభతో కారు ర్యాలీలో పాల్గొని గమ్యస్థానాన్ని చేరడం మరుపురాని అనుభూతిని కలిగించిందని సినీ నటి మధుషాలిని అన్నారు. అంధుల కారు ర్యాలీని తాను ఇప్పటివరకు చూడలేదన్నా రు. ఇలాంటి కార్యక్రమాలు సమాజానికి ఎంతో అసవరమన్నారు. -
అలహాబాద్‌లో అలరించిన వింటేజ్ కార్ ర్యాలీ