care taken
-
ఆలోచనల్ని ప్రోత్సహిస్తే చెప్పిన మాట వింటారు
చిన్న కుటుంబాలు ఎక్కువైన ప్రస్తుత కుటుంబ వ్యవస్థలో పిల్లల్లో నైతిక విలువలు పెంపొందించడం కత్తి మీద సాముగా మారింది. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబవ్యవస్థ.. నైతిక విలువలకు రక్షణ కవచంలా ఉండేది. ఈనాటి సాంకేతిక ప్రపంచంలో అనేక కారణాల వల్ల పిల్లలకు, తల్లిదండ్రులకు మధ్య ఒక అగాధం ఏర్పడుతోంది. పిల్లలు త్వరత్వరగా అభివృద్ధిలోకి రావాలనే ఆలోచనతో వారిని రోజులో మూడు వంతులు చదువు అనే రణరంగంలోకి వదిలేస్తున్నారు. పిల్లలూ శక్తికి మించి పోరాడుతూ ఒత్తిడితో అలసిపోతున్నారు. ఆ ఒత్తిడినుండి ఉపశమనం కోసం మొబైల్ ఫోన్స్, సామాజిక మాధ్యమాలు, వర్చ్యువల్ గేమ్స్లాంటి వ్యసనాలకు బానిసలవుతున్నారు. ఏది మంచి, ఏది చెడు.. చెప్పే ప్రయత్నం చేసినా వినే ధోరణి కనిపించడం లేదు! అలాగని పిల్లల్ని సరిదిద్దే ప్రయత్నంలో వారిని బలవంతం చెయ్యకూడదు. ఈ తరం పిల్లల్లో తెలివితేటలు, సమయస్ఫూర్తి ఎక్కువగా ఉంటున్నట్లు అధ్యయనాలు తెలుపుతున్నాయి. అందుకే వారి ఆలోచనల్ని, అభిప్రాయాలను ప్రోత్సహించాలి. దీనివల్ల తల్లిదండ్రులు చెప్పే మాటల పట్ల పిల్లల్లో సానుకూల దృక్పథం కలుగుతుంది. ఇలా కలిగాక పిల్లలకు నీతి కథలు, పురాణాలు, ఇతిహాసాలు, సంగీతం, నృత్యం ఇలా అనేక సాధనాల ద్వారా మానవ సంబంధాలు, విలువలు అర్థమయ్యేలా చెప్పాలి. పిల్లలు తప్పు చేస్తే దానిగురించి దీర్ఘ ప్రసంగం చేసి వారి తప్పును ఎత్తి చూపడం కాకుండా.. ఆ తప్పు, లేదా పొరపాటు వల్ల కలిగే పరిణామాలు వివరించాలి. పిల్లలు చాలా సున్నిత మనస్కులు. చిన్నతనంలో నాటే నైతికత విలువల విత్తనమే వారి ఉజ్వల భవితకు పునాది. అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్యలు దూరంగా ఉన్నా.. మనవలను కలిసినప్పుడల్లా నాలుగు మంచిమాటలు, నాలుగు మంచి కథలు చెప్పాలి. అంతేకాదు, వయస్సుకి తగ్గ పనులు వారికి అప్పచెప్పి, ఎప్పుడూ చురుకుగా ఉండేలా కూడా చేయాలి. – డా. పి.వి.రాధిక సైకాలజీ కన్సల్టెంట్ (విజయవాడ) ►ఈ తరం పిల్లల్లో చురుకుదనం, తెలివితేటలు ఎక్కువగా ఉంటున్నాయి. ఆ కారణంగా వాళ్లు కొన్ని తప్పులు చెయ్యొచ్చు. ఆ తప్పుల్ని సున్నితంగా సరిదిద్దాలే తప్ప.. దురుసుగా, దండన విధించినట్లుగా పెద్దలు ప్రవర్తించకూడదు. -
పశువుల్లో గర్భకోశ వ్యాధులు.. నివారణ
జంగారెడ్డిగూడెం: పశువులు ఆరోగ్యవంతంగా ఉండి సరైన సమయంలో ఎదకు వస్తే పశు సంపద పెరిగేందుకు అవకాశం ఉంటుంది. పశువులు తక్కువ వయసులో తొలి ఎదకు వచ్చి ఈనితే రైతుకు లాభం. దేశవాళీ పశువులు ఆలస్యంగా, విదేశీ పశువులు చాలాతక్కువ వయసులో తొలి ఎదకు వస్తాయి. పశువులు ఎదకు వచ్చే సమయం, పశువుల గర్భకోశ, జననేంద్రియ వ్యాధులు, నివారణ తదితర విషయాలను జంగారెడ్డిగూడెం పశువైద్యాధికారి బీఆర్ శ్రీనివాసన్ మాటల్లోనే.. పశువులు తొలి ఎదకు వచ్చినప్పుడు అవి యుక్త వయసుకు వచ్చినట్టు అర్థం. పశువు ఆరోగ్యంగా, బలంగా ఉంటే సహజ సంపర్కం అంటే గిత్తను దాటించడం లేదా ఇన్సిమినేషన్ చేయవచ్చు. పశువుల్లో రుతుచక్రం ఇలా.. ఆరోగ్యమైన పశువులు తొలి ఎదకు వచ్చినప్పటి నుంచి ప్రతి 3 వారాలకు సుమారు 21 రోజులకు ఒకసారి ఎదకు వస్తుంది. కొన్ని పశువులు 21 రోజుల కంటే 4, 5 రోజులు అటూ ఇటుగా వస్తాయి. అంటే ఎదకు సుమారు 18 నుంచి 24 రోజులు ఉంటుంది. ఒకవేళ ఆ ఎదలో గర్భం ధరించకపోతే తిరిగి 21 రోజులకు ఎదకు వస్తుంది. గర్భం ధరిస్తే ఎదకు రాదు. సాధారణంగా దేశీయ ఆవుదూడలు 4 సంవత్సరాల వయసులో యుక్తవయసుకు వస్తాయి. ఒంగోలు జాతి దూడలు మూడు సంవత్సరాలకు, సంకర జాతి పశువులు సంవత్సరానికి యుక్త వయసుకు వస్తాయి. నాటు గేదెలు వంటివి 4 సంవత్సరాలకు, ముర్రా జాతిగేదెలు 3 సంవత్సరాల వయసులో మొదట ఎదకు వస్తాయి. ఈ మొదటి ఎదకు రావటాన్ని జాతి లక్షణాలు, దాని బరువు, పెరుగుదలపై ఆధారపడి ఉంటుంది. సరైన పోషణ లేని పశువులు సాధారణంగా ఎదకు రావాల్సిన సమయంలో ఎదకు రావు. లేదా ఈనిన తరువాత తిరిగి ఎదకు తొందరగా రావు. ఒకవేళ పశువు సరైన ఎదుగుదల ఉండి వయసుకు వచ్చినా కూడా ఎదకు రాకపోతే వైద్యం చేయించడం అవసరం. గర్భకోశం ఎదగకపోవడం వల్ల కూడా.. కొన్ని పశువుల్లో మొదటి ఎద వయసు వచ్చినా సరే ఎదకు రాకుండా ఉంటాయి. దీనికి గర్భకోసం ఎదగకపోవడం కూడా ఒక కారణం కావచ్చు. పశువులు ఎదకు రాకపోతే వైద్యులకు చూపించి గర్భకోశం ఎదుగుదల పరీక్షించి తగిన చికిత్సలు చేయించాలి. గర్భస్రావాలు .. కొన్ని పశువులు నెల, 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు చూడు గర్భస్రావాలు జరుగుతాయి. దీనికి గర్భకోశ వ్యాధులు కారణం కావచ్చు. 3 నెలల గర్భం ప్రతిసారి పోతుంటే వైద్యునికి చూపించాలి. ట్రైకోమనియోసిస్ అనే వ్యాధి వల్ల ఇలా గర్భం నిలవకపోవడం జరుగుతుంది. 6 నెలలు గర్భం స్రావం బ్రూసిల్లోసిస్ అనే వ్యాధి వల్ల జరిగే అవకాశం ఉంది. ఇవి రెండూ అంటువ్యాధులే. పశువులు ఈనిన తరువాత 3 నుంచి 24 గంటల్లోపు మాయ వేయకపోతే తప్పనిసరిగా చికిత్స చేయించాలి. గర్భకోశం, యోని దిగజారుట .. కొన్ని పశువులు ఈనిన తరువాత యోని, గర్భకోశం బయటకు వస్తాయి. లిగమెంట్లు వదులు కావడం వల్ల అవి గర్భకోశాన్ని, యోనిని గట్టిగా తన స్థానంలో ఉండేట్టుగా బంధించి ఉంచలేవు. కొన్ని పశువులు ఈనక ముందే యోని బయటకు వస్తుంది. దీనికి ముందు జాగ్రత్తగా పశువుకు కడుపునిండా నీరు ఒక సారే పెట్టకూడదు. కొంచెం, కొంచెం చొప్పున ఎన్నిసార్లు అయినా పెట్టవచ్చు. అలానే పశువు పడుకోకుండా చూడాలి. ఈనిన పశువుకు గర్భకోశం బయటకు వచ్చినటై్టతే దానిని శుభ్రంగా చల్లటి నీళ్లతో సబ్బుతో కడిగి లోపలకు నెట్టాలి. అవసరమైతే మానం పెదవులు రెండూ కుట్టివేయాలి. సాధ్యమైనంత వరకు పడుకోనివ్వరాదు. ఈనక ముందు బయటకు వచ్చినా ఇదేవిధంగా చేయాలి. ఎండోమైట్రైసిస్ ..గర్భకోశ వ్యాధులలో ఇది ముఖ్యమైనది. ఈ వ్యాధి ఉన్న పశువులు త్వరగా ఎదకు రావు. తొందరగా కట్టకుండా తిరిగి తిరిగి ఎదుకు వస్తాయి. గర్భకోశం నుంచి చీములాగా స్రావం వస్తుంది. గర్భాశయద్వారపు వాపులు(సర్వీసైటిస్) .. సాధారణంగా పశువు చూడికట్టగానే గర్భాశయ ద్వారం మూసుకుపోతుంది. తిరిగి గేదె ఈనె సమయంలో తెరుచుకుంటుంది. ఈ వ్యాధిలో గర్భాశయ ద్వారం ఎప్పుడూ తెరుచుకునే ఉంటుంది. దీనివల్ల పశువు చూడికట్టుట, చూడి నిలబడటం కష్టం. ఈ వ్యాధిలో ఎలాంటి లక్షణాలు బయటకు కనబడవు. పరీక్ష చేస్తే తెలుస్తుంది. ఎప్పుడూ తిరుగ కట్టే పశువుల్లో ఈ వ్యాధి ఒక కారణం