Carl Hooper
-
సచిన్, నేనూ కాదు.. అత్యుత్తమ క్రికెటర్ అతడే: లారా
క్రికెట్ ప్రపంచంలో టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్, వెస్టిండీస్ లెజెండ్ బ్రియన్ లారా రికార్డుల రారాజులుగా వెలుగొందారు. తమ తరంలోని ఆటగాళ్లకు సాధ్యం కాని అరుదైన ఘనతలెన్నో సాధించారు.అంతర్జాతీయ క్రికెట్లో వంద శతకాల వీరుడిగా సచిన్ చెక్కు చెదరని రికార్డుని సొంతం చేసుకుంటే.. టెస్టుల్లో క్వాడ్రపుల్ సెంచరీ(400) బాది రికార్డుల్లో తన పేరును పదిలం చేసుకున్నాడు లారా.ఇక ఈ ఇద్దరు దిగ్గజాలు పరస్పరం గౌరవ, మర్యాదలతో మెలగడమే కాకుండా చిరకాల స్నేహితులుగా కూడా కొనసాగుతున్నారు. సందర్భం వచ్చినపుడల్లా సచిన్‌పై ప్రశంసలు కురిపించే బ్రియన్ లారా తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.తామిద్దరి కంటే కూడా అత్యంత ప్రతిభావంతుడైన ఆటగాడు వేరొకరు ఉన్నారంటూ అభిమానులను ఆశ్చర్యపరిచాడు. లారా చెప్పిన క్రికెటర్ మరెవరో కాదు ఆల్‌రౌండర్ కార్ల్ హూపర్. విండీస్ మాజీ కెప్టెన్.ఈ విషయం గురించి తన పుస్తకంలో ప్రస్తావించిన లారా.. ‘‘కార్ల్ వంటి అత్యుత్తమ ఆటగాడిని నేను ఇంత వరకు చూడలేదు. టెండుల్కర్ గానీ, నేను గానీ ప్రతిభ విషయంలో అతడికి దరిదాపుల్లో కూడా లేమంటే అతిశయోక్తి కాదు.కెప్టెన్‌గానూ కార్ల్ కెరీర్ ఎంతో మెరుగ్గా ఉంది. సారథిగా ఉన్న సమయంలోనూ సగటున 50కి పైగా పరుగులు సాధించాడు. నిజానికి వివియన్ రిచర్ట్స్కి నాకంటే కూడా కార్ల్ అంటేనే ఎక్కువ ఇష్టం.అతడి ఆటను ఇష్టపడేవాడు. తనపైనే ప్రేమను కురిపించేవాడు’’ అని పేర్కొన్నాడు. కాగా 1987- 2003 మధ్య కాలంలో వెస్టిండీస్‌కు ప్రాతినిథ్యం వహించాడు కార్ల్ హూపర్.కుడిచేతి వాటం కలిగిన ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్.. రైటార్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్. కెరీర్లో మొత్తంగా 102 టెస్టులు ఆడిన హూపర్ 5762 పరుగులు సాధించాడు. ఇందులో 13 శతకాలతో పాటు ఒక డబుల్ సెంచరీ ఉంది. ఇక 114 వికెట్లు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.ఇక 227 వన్డేల్లో ఏడు సెంచరీల సాయంతో 5761 రన్స్ చేసిన కార్ల్ హూపర్.. 193 వికెట్లు పడగొట్టాడు. కాగా 1999 వరల్డ్‌కప్ టోర్నీకి ముందు రిటైర్మెంట్ ప్రకటించిన హూపర్.. 2001లో కెప్టెన్‌గా రీఎంట్రీ ఇవ్వడం గమనార్హం. 22 టెస్టుల్లో విండీస్‌కు అతడు సారథిగా వ్యవహరించాడు.కెప్టెన్ కాకముందు హూపర్ బ్యాటింగ్ సగటు 36.46గా ఉంటే.. నాయకుడిగా పగ్గాలు చేపట్టిన తర్వాత 46కు పైగా ఉండటం విశేషం. ఈ నేపథ్యంలోనే లారా హూపర్‌ను ఉద్దేశించి ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. -
వెస్టిండీస్ జట్టు కోచ్‌గా మాజీ కెప్టెన్.. ఎవరంటే?
జింబాబ్వే వేదికగా జరగనున్న వన్డే వరల్డ్‌కప్-2023 క్వాలిఫియర్స్కు ముందు క్రికెట్ వెస్టిండీస్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. విండీస్ అసిస్టెంట్ కోచ్‌గా ఆ జట్టు మాజీ కెప్టెన్ కార్ల్ హూపర్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని విండీస్ క్రికెట్‌బోర్డు ఓ ప్రకటనలో వెల్లడించింది. హూపర్ ప్రస్తుతం బార్బడోస్‌లోని వెస్టిండీస్ హై-పెర్ఫార్మెన్స్ సెంటర్లో ఇన్స్ట్రాక్టర్గా ఉన్నాడు. కాగా హూపర్కు గతంలో కోచ్‌గా, మెంటార్‌గా పనిచేసిన అనుభవం ఉంది. గతేడాది బిగ్‌బాష్ లీగ్‌లో అడిలైడ్ స్ట్రైకర్స్‌కు అసిస్టెంట్ కోచ్‌గా పనిచేశాడు. అదేవిధంగా కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో గత కొన్ని సీజన్లగా గయానా అమెజాన్ వారియర్స్ కోచింగ్ స్టాప్‌లో కూడా హూపర్ భాగంగా ఉన్నాడు. ఇక విండీస్ తరపున 329 మ్యాచ్‌లు ఆడిన హూపర్.. 5000 పైగా పరుగులతో పాటు 100 వికెట్లు సాధించాడు. దాదాపు 15 ఏళ్లపాటు కరీబియన్ జట్టుకు హూపర్ సేవలు అందించాడు. ఇక ఐసీసీ వన్డే సూపర్ లీగ్ పాయింట్ల పట్టికలో టాప్-8లో విండీస్ జట్టు లేకపోవడంతో.. ఈ ఏడాది భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్‌కు నేరుగా అర్హతసాధించలేదు. ఈ క్రమంలో హోప్ సారధ్యంలోని విండీస్ క్వాలిఫియర్స్ మ్యాచ్‌లు ఆడనుంది. ఈ క్వాలిఫియర్ రౌండ్ మ్యాచ్‌లు జూన్ 18 నుంచి జింబాబ్వే వేదికగా జరగనున్నాయి. ఇందులో మొత్తం 10 జట్లు పాల్గొనున్నాయి. వీటిలో రెండు జట్లు ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తాయి. ఇక క్వాలిఫియర్స్కు ముందు వెస్టిండీస్.. యూఏఈతో మూడు వన్డేల సిరీస్‌లో తలపడనుంది. ఈ సిరీస్ జూన్ 4 నుంచి ప్రారంభం కానుంది. చదవండి: WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు ఆసీస్‌కు ఆ ఇద్దరంటే భయం పట్టుకుంది: పాంటింగ్ -
‘మా సీనియర్ క్రికెటర్లకు సిగ్గుండాలి’
ఆంటిగ్వా: టీమిండియాతో ద్వైపాక్షిక సిరీస్‌కు పలువురు వెస్టిండీస్ సీనియర్ క్రికెటర్లు గైర్హాజరీ కావడంతో ఆ జట్టు మాజీ ఆటగాడు కార్ల్ హూపర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. ఒక పటిష్టమైన జట్టును ఢీకొట్టేందుకు వెళ్లేటప్పుడు సీనియర్ క్రికెటర్లు డుమ్మా కొట్టడం అనేది చాలా సిగ్గుచేటన్నాడు. చాలామందికి విండీస్ తరపున ఆడాలనే ఉద్దేశం లేకపోవడంతోనే వారు ఏదొక వంకతో దూరమవుతున్నారంటూ విమర్శించాడు. ‘వెస్టిండీస్ తరపున ఆడాలనే ఉద్దేశమే వారికి లేదు. కొద్దిరోజులుగా వారు వ్యవహరిస్తున్న తీరుతోనే అది స్పష్టమవుతోంది. దానికి వారు సిగ్గుపడాలి. సీనియర్లు జట్టులో లేకపోవడంతో టీ20ల్లో వెస్టిండీస్‌ని ఓడించడం భారత్‌కి చాలా సులువు. ప్రస్తుతం జట్టులో ఉన్న ఆటగాళ్లకి అనుభవం తక్కువ. వారు కుదురుకునేందుకు కొంత సమయం పడుతుంది. కుర్రాళ్లలో ప్రతిభ ఉంది.. కానీ.. నిలకడగా మాత్రం రాణించలేకపోతున్నారు' అని కార్ల్ హూపర్ పేర్కొన్నాడు. వెస్టిండీస్ జట్టు భారత్‌తో వన్డే సిరీస్ ఆడే సమయంలో క్రిస్‌గేల్ అఫ్గానిస్థాన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడుతున్నాడు. మూడేళ్లుగా వెస్టిండీస్ బోర్డు, సీనియర్ క్రికెటర్ల మధ్య జీతాల విషయమై విభేదాలు కొనసాగుతుండటంతో.. అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడేందుకు వారు ఆసక్తి కనబర్చడం లేదు. ఈ క్రమంలో సీనియర్ క్రికెటర్లకి అసలు వెస్టిండీస్ జాతీయ జట్టుకు ఆడాలనే శ్రద్ధే లేదంటూ హూపర్ తాజాగా ధ్వజమెత్తాడు. భారత్‌తో సిరీస్‌కు గేల్ దూరం