జైలుకు వెళ్లడం ఇది మూడోసారి
‘ప్రత్యేకం’గా చూడాలన్న రాజయ్య విజ్ఞప్తి తిరస్కరణ
ములాఖత్‌లో కలిసిన ఓ మిత్రుడు, కార్యకర్త
పోచమ్మమైదాన్ : కోడలు, మనవళ్లు అనుమానాస్పద మృతి కేసులో అరెస్ట్ అయిన మాజీ ఎంపీ సిరిసిల్ల రాజ య్య, ఆయన భార్య, కుమారుడిని వరంగల్ కేంద్ర కారాగారానికి గురువారం రాత్రి 11 గంటలకు త రలించిన విషయం విదితమే. అక్కడ అర గంట వారిని తనిఖీ చేసి న సిబ్బందికి లోపలకు పంపించారు. అయితే, తనకు స్పెషల్ కేటగిరీ కేటాయించాలని రాజయ్య కోరగా కోర్టు ఆదేశాలు లేనందున అధికారులు నిరాకరించినట్లు తెలి సింది. ఆ తర్వాత రాజయ్యకు అండర్ ట్రైలర్ ఖైదీ నంబ ర్ 2971, అనిల్‌కు 2970, మాధవికి 7856 నంబర్లు కేటాయించారు. ఇక శుక్రవారం ఉదయం 5.30 గంటలకు జైలు సిబ్బంది నిద్ర లేపగా కాలకృత్యాల అనంతరం ఉద యం 7గంటలకు రాజయ్య టామాటా బాత్ తిన్నారు. ఆ తర్వాత దినపత్రికలు చూసి నిద్రపోయిన ఆయన మధ్యాహ్నం, సాయంత్రం సాధారణ భోజనం చేశారుకాగా, ములాఖత్‌లో భాగంగా వెంకయ్య అనే మిత్రుడు రాజయ్యని కలిసి వెళ్లగా.. మరో కాంగ్రెస్ నేత వచ్చి రాజ య్యకు లుంగీ, ఒక డ్రెస్, అనిల్‌కు నైట్ ప్యాంట్, ఒక డ్రెస్, మాధవికి రెండు చీరలతో పాటు డజన్ అరటి పండ్లు ఇచ్చి వెళ్లారు.
ఓసారి ఉద్యోగంలో ఉన్నప్పుడు...
మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య జైలుకు వెళ్లడం ఇది మూ డో సారి. జెడ్పీ సీఈఓగా విధులు నిర్వర్తిస్తున్నప్పుడు అవినీతి పాల్పడిన సందర్భంలో 8 డిసెంబర్ 2006లో ఓ సారి, తెలంగాణ ఉద్యమ సమయంలో రైల్ రోకో చేస్తుం డగా పోలీసులు అరెస్ట్ చేయడంతో 2013లో మరోసారి జైలుకు వెళ్లిన ఆయన ఇప్పుడు కోడలు, మనువలు అనుమాస్పద మృతితో జైలుకు వెళ్లాల్సి వచ్చింది.
కేయూలో కొవ్వొత్తుల ర్యాలీ
కేయూ క్యాంపస్ : మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, ఆమె ముగ్గురు కుమారుల మృతికి సంతాప సూచకంగా కేయూలో టీజీవీపీ ఆధ్వర్యాన శుక్రవా రం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి వారికి నివాళులర్పించారు. క్యాంపస్‌లోని మహిళా హాస్టల్ నుంచి మొదటి గేట్ వరకు ఈ ర్యాలీ సాగింది. టీజీవీపీ నాయకులు రంజిత్, శ్రావణ్, శివ, సుధీర్, రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
మాధవిపై సస్పెన్షన్ వేటు ?
కేయూ క్యాంపస్ : హన్మకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో బయోటెక్నాలజీ విభాగంలో అసిస్టెం ట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సిరిసిల్ల మాధవిపై యూనివర్సిటీ అధికారులు సస్పెన్షన్ వేటు వేసే యోచనలో ఉన్నా రు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిం చిన సారిక, ఆమె పిల్లల అనుమానాస్పద మృతి కేసులో.. సారిక అత్త అయిన మాధవిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన విషయం విదితమే. గురువారం రాత్రి ఆమెను జైలుకు తరలించగా.. రిమాం డ్‌లోనే 48గంటలు ఉంటే పోలీస్ రిపోర్ట్ ఆధారంగా మాధవిని అధికారులు సెస్పెన్షన్ చేయనున్నారు. ఏ ప్రభుత్వ శాఖ ఉద్యోగి అయినా ఏదేని కేసులో జైలుకు వెళ్లి 48గంటలు ఉన్నట్లు రిమాండ్ రిపోర్టు అందితే సస్పెన్షన్ చేయాలనే నిబంధనలు ఉన్నాయి. ఈ మేరకు ఆమెపై సస్పెన్షన్ వేటు పడే అవకాశముందని తెలుస్తోంది. కాగా, మాధవిని సస్పెండ్ చేయాలని కోరుతూ తెలంగాణ విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణమాచారి, రాష్ర్ట అధికార ప్రతినిధి ఈశ్వర్ప్రసాద్, బాధ్యులు మండలోజు జగన్, చక్రపాణి, గజ్జెల వీరన్న, మాందాటి వినోద్‌కుమార్, కె.రవి తదితరులు శుక్రవారం కేయూ వీసీ చిరంజీవులును కలిసి వినతిపత్రం అందజేశారు.