case for vote case
-
చంద్రబాబు నీవు నిప్పులాంటి వాడివా?
విశాఖ : టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ నిప్పులు చెరిగారు. ఆయన సోమవారమిక్కడ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ..’చంద్రబాబు తాను నిప్పు, నిజాయితీపరుడని అంటున్నారని, నిజంగా చంద్రబాబు నిప్పుయితే వేరే పార్టీ ఎమ్మెల్యేలను ఎందుకు కోట్లు ఇచ్చి కొన్నట్లు. ఎమ్మెల్యేను కొన్న డబ్బంతా ఎక్కడిది? చంద్రబాబు నీ డొల్లతనం, నీ నైజం ఏంటో అందరికీ తెలుసు. ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంటే చంద్రబాబు పదవి నుంచి తప్పుకోవాలి. ఏదైనా మేనేజ్ చేయవచ్చనే ధైర్యం చంద్రబాబుకు ఉంది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సమంజమా?. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబును తాట తీస్తానన్న కేసీఆర్ వ్యాఖ్యలు ఏమయ్యాయి?. ప్రజాస్వామ్య పరిరక్షణను తెలంగాణ ప్రభుత్వం కాపాడాలి. ఈ కేసులో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు లాలూచీ పడ్డాయి. వాళ్ల వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి సంజీవని అయిన ప్రత్యేక హోదాను కూడా కేంద్రం వద్ద తాకట్టు పెట్టారు’ అని ధ్వజమెత్తారు. -
చంద్రబాబు నీవు నిప్పులాంటి వాడివా?
-
చంద్రబాబును ఎవరూ కాపాడలేరు: అంబటి
హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఎవరూ కాపాడలేరని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. ఆయన సోమవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఓటుకు కోట్లు కేసుకు సంబంధించి తమ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్ని సాక్ష్యాధారాలతో కోర్టును ఆశ్రయించారన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోది, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ జోక్యం చేసుకున్నా ఈ కేసు నుంచి చంద్రబాబు తప్పించలేరన్నారు. త్వరలో ఈ కేసుకు సంబంధించిన వాస్తవాలు బయటకు రాబోతున్నాయని అంబటి రాంబాబు అన్నారు. గతంలో ఈ కేసులో చంద్రబాబును రక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నించిందన్నారు. ప్రతిఫలంగా ఏపీ ప్రయోజనాలను చంద్రబాబు తాకట్టు పెట్టారని అంబటి ధ్వజమెత్తారు. ఈ కేసు జరిగిన 14 నెలలు గడిచినా తెలంగాణ ప్రభుత్వం అదనపు ఛార్జిషీట్ ఎందుకు దాఖలు చేయలేదని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఇక ప్రత్యేక హోదాతో పాటు పలు అంశాలపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రశ్నలకు ప్రధాని మోదీ, చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలని అంబటి అన్నారు. ప్రత్యేక హోదా, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరు పోరాటం చేసినా తమ పార్టీ మద్దతు ఇస్తుందన్నారు. సెప్టెంబర్ 2న వైఎస్ రాజశేఖరరెడ్డి వర్థంతి సందర్భంగా పార్టీ శ్రేణులు, అభిమానులు సేవా కార్యక్రమాల్లో పాల్గొవాలని అంబటి రాంబాబు పిలుపునిచ్చారు. -
‘బ్లాక్ మెయిల్‌కు ఆయన బ్రాండ్ అంబాసిడర్’
హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో చట్ట ప్రకారమే వ్యవహరిస్తున్నామని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ అన్నారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ ఈ అంశం కోర్టు పరిధిలో ఉందన్నారు. బ్లాక్ మెయిల్‌కు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి అని బాల్క సుమన్ వ్యాఖ్యానించారు. కాగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలకు రాజకీయ భాగస్వామ్యం లేదని, రాష్ట్రంలో ఆడబిడ్డలను సీఎం కేసీఆర్ బతుకమ్మ, బోనాలకే పరిమితం చేశారని రేవంత్ రెడ్డి విమర్శలు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించిన ఓటుకు కోట్లు కేసు మళ్లీ తెరమీదకు వచ్చింది. ఈ కేసును పునర్విచారణ చేయాలని ఏసీబీ కోర్టు సోమవారం ఆదేశాలు ఇచ్చింది. వచ్చేనెల 29వ తేదీలోగా ఈ విచారణ పూర్తి చేయాలని ఏసీబీని ఆదేశించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వరంపై ఫోరెన్సిక్ పరీక్షల నివేదికను మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కోర్టు ముందు ఉంచిన విషయం తెలిసిందే.