చంద్రబాబు నీవు నిప్పులాంటి వాడివా? | Botsa satyanarayana dares chandrababu naidu to prove clean | Sakshi
Sakshi News home page

చంద్రబాబు నీవు నిప్పులాంటి వాడివా?

Published Mon, Aug 29 2016 4:06 PM | Last Updated on Tue, May 29 2018 2:42 PM

చంద్రబాబు నీవు నిప్పులాంటి వాడివా? - Sakshi

చంద్రబాబు నీవు నిప్పులాంటి వాడివా?

విశాఖ : టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ నిప్పులు చెరిగారు. ఆయన సోమవారమిక్కడ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ..’చంద్రబాబు తాను నిప్పు, నిజాయితీపరుడని అంటున్నారని, నిజంగా చంద్రబాబు నిప్పుయితే వేరే పార్టీ ఎమ్మెల్యేలను ఎందుకు కోట్లు ఇచ్చి కొన్నట్లు. ఎమ్మెల్యేను కొన్న డబ్బంతా ఎక్కడిది? చంద్రబాబు నీ డొల్లతనం, నీ నైజం ఏంటో అందరికీ తెలుసు.  ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంటే చంద్రబాబు పదవి నుంచి తప్పుకోవాలి. ఏదైనా మేనేజ్ చేయవచ్చనే ధైర్యం చంద్రబాబుకు ఉంది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సమంజమా?.

ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబును తాట తీస్తానన్న కేసీఆర్ వ్యాఖ్యలు ఏమయ్యాయి?. ప్రజాస్వామ్య పరిరక్షణను తెలంగాణ ప్రభుత్వం కాపాడాలి.  ఈ కేసులో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు లాలూచీ పడ్డాయి. వాళ్ల వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి సంజీవని అయిన ప్రత్యేక హోదాను కూడా కేంద్రం వద్ద తాకట్టు పెట్టారు’ అని ధ్వజమెత్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement