cash supply
-
రోజూ 3వేల కోట్ల విలువైన రూ. 500 నోట్ల ముద్రణ
మనీలా: దేశంలో నెలకొన్న డిమాండ్ నేపథ్యంలో రూ. 3 వేల కోట్ల విలువైన రూ.500 నోట్లను ప్రతి రోజూ ముద్రిస్తున్నామని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ తెలిపారు. దేశంలో ప్రస్తుతం నగదు లభ్యత సంతృప్తికర స్థాయిలో ఉందని, అదనపు డిమాండ్‌ను అందుకుంటున్నామని ఆయన చెప్పారు. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలోని ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు(ఏడీబీ) వార్షిక సమావేశానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో నగదు పరిస్థితిపై గతవారం తాను సమీక్షించానని, 85 శాతం ఏటీఎంలు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయని వెల్లడించారు.‘అవసరం మేరకు నగదును సరఫరా చేస్తున్నాం. అదనపు డిమాండ్ మేరకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం దేశంలో నగదు సంక్షోభం ఉందని నేను భావించడం లేదు’ అని చెప్పారు. దేశంలో రూ.7 లక్షల కోట్ల విలువైన రూ. 2 వేల నోట్లు చలామణిలో ఉన్నాయని గార్గ్ తెలిపారు. అవసరాని కంటే ఎక్కువ లభ్యత ఉందని అందువల్ల కొత్తగా రూ. 2 వేల నోట్లు ముద్రించాల్సిన అవసరం లేదన్నారు. -
నోట్ల కష్టాలపై తీపికబురు
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో నగదు కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, ఏటీఎంల వద్ద నగదు లభ్యత క్రమంగా మెరుగవుతున్నదని ఎస్బీఐ పేర్కొంది. గత 24 గంటల్లో నగదు సరఫరా క్రమంగా పుంజుకుందని తెలిపింది. ఏటీఎంల వద్ద నగదు కొరత కొన్ని ప్రాంతాలకే పరిమితమైందని పీఎన్బీ, కెనరా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్‌లు పేర్కొన్నాయి. గత 24 గంటల్లో ఎస్బీఐ ఏటీఎంల వద్ద నగదు లభ్యత మెరుగైందని, నగదు కొరత నెలకొన్న ప్రాంతాల్లోనూ నగదు సరఫరా పెంచేందుకు చర్యలు చేపడుతున్నామని, త్వరలోనే నగదు అందుబాటు సాధారణ స్థితికి చేరుకుంటుందని ఎస్బీఐ సీఓఓ నీరజ్ వ్యాస్ చెప్పారు. తమ ఏటీఎంల్లో నగదు లభ్యత పెంచేందుకు అన్ని చర్యలూ చేపడుతున్నామని ఎస్బీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. మరోవైపు తమ ఏటీఎంల వద్ద నగదు లభ్యత మెరుగ్గా ఉందని, ఎలాంటి సమస్యలూ లేవని ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్ తెలిపింది. ఇతర బ్యాంకుల ఖాతాదారులు నగదు విత్‌డ్రా కోసం తమ ఏటీఎంలకు రావడంతోనే కొన్నిచోట్ల ఏటీఎంల్లో నగదు కొరత ఏర్పడిందని పేర్కొంది. ఇక కరెన్సీ కొరతను అధిగమించేందుకు అన్ని చర్యలూ చేపడుతున్నామని, తగినంత నగదు సరఫరా ఉందని ఆర్బీఐ స్పష్టం చేయగా రూ. 500 నోట్ల ముద్రణను ఐదు రెట్లు పెంచామని కేంద్రం తెలిపింది. -
ఆర్బిఐ నుంచి బ్యాంకులకు తగ్గిన నగదు సరఫరా
-
రూ.185 కోట్ల నగదు సరఫరా
అనంతపురం అగ్రికల్చర్ : ఆర్బీఐ నుంచి శనివారం జిల్లాకు రూ.185 కోట్ల నగదు సరఫరా అయినట్లు లీడ్ బ్యాంకు జిల్లా మేనేజర్ (ఎల్డీఎం) జయశంకర్ తెలిపారు. ఎస్బీఐతో పాటు ఆంధ్రాబ్యాంక్ కరెన్సీ చెస్ట్‌కు నగదు చేరిందన్నారు. ఎక్కడా నో క్యాష్ బోర్డులు పెట్టకుండా గరిష్ట మొత్తం విత్‌డ్రాలు చేస్తున్నట్లు తెలిపారు. ఏటీఎం సేవలు కూడా పెంచినట్లు ఆయన వివరించారు. వివిధ వర్గాలకు ఇప్పటి వరకు 802 పీవోఎస్ (స్వైపింగ్) మిషన్లు పంపిణీ చేశామన్నారు. ఎస్బీఐ శాఖల్లో కూడా రూ.20 నుంచి రూ.24 వేల వరకు విత్‌డ్రా ఇవ్వడంతో పాటు ఎక్కువ ఏటీఎంలు పనిచేసేలా చర్యలు చేపట్టినట్లు ఎస్బీఐ ఆర్ఎం ఎంవీఆర్ మురళీకృష్ణ తెలిపారు. -
కొత్త నోట్ల సప్లై వారికి పెంచండి: ఆర్బీఐ
-
కొత్త నోట్ల సప్లై వారికి పెంచండి: ఆర్బీఐ
ముంబై : పెద్ద నోట్ల రద్దు అనంతరం తీసుకొచ్చిన కొత్త కరెన్సీ నోట్ల సరఫరాను గ్రామాలకు పెంచాలని రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా బ్యాంకులను ఆదేశించింది. దూర ప్రాంతాలకు సప్లై చేసే కరెన్సీ నోట్లపై కరెన్సీ చెస్ట్‌లు(నోట్లను భద్రపరిచే స్థలం) రోజువారీ రిపోర్టు చేయాలని పేర్కొంది. అవసరానికి తగ్గ నోట్ల సరఫరా గ్రామాలకు చేయడం లేదని గుర్తించిన సెంట్రల్ బ్యాంకు ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. కనీసం 40 శాతం బ్యాంకు నోట్లను గ్రామాలకు సరఫరా చేయాలని బ్యాంకులను ఆదేశిస్తూ బ్యాంకింగ్ రెగ్యులేటరీ ఆర్బీఐ ఓ ప్రకటన విడుదల చేసింది. అవసరాల మేరకు ఈ విధానాన్ని గ్రామీణ ప్రాంతాల్లో అమలు చేయాలని బ్యాంకులకు సూచించింది. ఆర్ఆర్బీ, డీసీసీబీ, కమర్షియల్ బ్యాంకుల గ్రామీణ కార్యాలయాల్లో బ్యాంకులు తమ కరెన్సీ చెస్ట్‌లను తగినంత ఏర్పాటుచేసుకోవాలని సూచిస్తున్నట్టు పేర్కొంది. రూరల్ బ్రాంచ్‌లకు గ్రామీణ ప్రాంతాల్లో అవసరాలు జిల్లా జిల్లాకు తేడాలుంటాయని పేర్కొంది. అదేవిధంగా తక్కువ విలువ కల్గిన నోట్లనూ రూరల్ సెంటర్లకు, గ్రామాలకు సరఫరా చేయాలని బ్యాంకు కరెన్సీ చెస్ట్‌లను రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ఆదేశించింది. రూ.500, అంతకంటే తక్కువ విలువ కలిగిన నోట్లను చెస్ట్‌లు జారీచేస్తున్నాయి. రూ.100 కంటే తక్కువ విలువ కలిగిన నోట్లనూ కరెన్సీ చెస్ట్‌లు స్వేచ్ఛగా జారీచేయాలని ఆర్బీఐ పేర్కొంది. -
నాలుగురెట్లు డబ్బు రవాణా!
న్యూఢిల్లీ: పాత పెద్ద నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న నోట్ల కష్టాలను తీర్చేందుకు భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ) చర్యలు ముమ్మరం చేసింది. జీతాలు చేతికందే సమయం కావడంతో నేటి నుంచి బ్యాంకులకు ప్రజలు పోటెత్తుతారన్న అంచనాతో నగదు రవాణాను నాలుగింతలు పెంచనుంది. రూ. 500 నోట్ల ముద్రణను వేగవంతం చేసింది. రూ. 500 నోట్లను త్వరగా చెలామణిలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. నాలుగు ముద్రణాలయాల్లో ప్రింటింగ్ కొనసాగుతోంది. ఆర్బీఐ పరిధిలో ఉన్న మైసూరు, సాల్ బోనీ ముద్రణాలయాలతో పాటు ప్రభుత్వ పరిధిలోని నాసిక్, దేవాస్ ప్రింటింగ్ ప్రెసుల్లో సిబ్బంది నిర్విరామంగా నోట్లు ముద్రిస్తున్నారు. దీని కోసం రెండు షిప్టులను మూడు షిఫ్టులకు పెంచారు. ప్రధానంగా రూ.500 నోట్ల ముద్రిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. బ్యాంకులు, ఏటీఎంలలో నగదు లభ్యంకాక ప్రజలు అల్లాడుతున్నారు. నెలారంభం కావడంతో నేటి నుంచి నగదుకు మరింత డిమాండ్ పెరుగుతుందన్న అంచనాతో ఆర్బీఐ సన్నద్దమైందని, బ్యాంకులకు నగదు సరఫరాను నాలుగు రెట్లు పెంచేందుకు ప్రయత్నిస్తోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గత కొన్నేళ్లుగా జీతాల నగదును ఏటీఏంల ద్వారా తీసుకుంటున్నారని, ఈ నేపథ్యంలో ఏటీఏంలలో డబ్బు నింపేందుకు ప్రాధాన్యమిస్తున్నట్టు వెల్లడించాయి. అయితే ఇప్పటికీ 90 శాతం బ్యాంకుల్లో నోక్యాష్ బోర్డులు దర్శనిమిస్తున్నట్టు సమచారం. పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రజలకు మరిన్ని కష్టాలు తప్పకపోవచ్చు.