Cash transfer scheme
-
కనీస ఆదాయ పధకం అసాధ్యం : నీతి ఆయోగ్
సాక్షి, న్యూఢిల్లీ : తాము అధికారంలోకి వస్తే దేశంలోని ఐదు కోట్ల పేద కుటుంబాలకు వారి బ్యాంకు ఖాతాల్లో ఏటా రూ 72,000 జమ చేస్తామని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ చేసిన ప్రకటనపై నీతి ఆయోగ్ పెదవివిరిచింది. ఈ పధకానికి బడ్జెట్లో 13 శాతం నిధులు అవసరమవుతాయని, దీని అమలు అసాధ్యమని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. పనిచేయకుండా ఎవరికైనా భారీగా నగదు బదిలీ చేయడం ఆర్థిక క్రమశిక్షణా రాహిత్యానికి దారితీస్తుందని ఈ పధకం ఎన్నడూ అమలుకు నోచుకోదని పెదవివిరిచారు. జీడీపీలో రెండు శాతం, బడ్జెట్లో 13 శాతం కనీస ఆదాయ హామీ పధకానికి ఖర్చవుతాయని, ఇంతటి వ్యయంతో వీటిని అమలు చేస్తే ప్రజల వాస్తవ అవసరాలు మరుగునపడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, కాంగ్రెస్ పార్టీ 1971లో గరీబీ హఠావో, 2008లో ఒన్ ర్యాంక్ ఒన్ పెన్షన్, 2014లో ఆహార భద్రత నినాదాలతో ఎన్నికల సమరాంగణంలో నిలిచినా వాటి అమలు మాత్రం సాధ్యం కాలేదన్నారు. కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన కనీస ఆదాయ హామీ పధకానికీ ఇదే గతి పడుతుందని ఆయన ట్వీట్ చేశారు. -
దేశవ్యాప్తంగా రైతుబంధు!
న్యూఢిల్లీ: మూడు రాష్ట్రాల్లో ఓటమిపాలైన బీజేపీ రైతులకు చేరవయ్యేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఒక్కో పంటకాలానికి రైతులకు ఎకరాకు రూ.4 వేల చొప్పున నేరుగా వారి ఖాతాలోకే నగదును బదిలీచేసే కొత్త పథకానికి కేంద్రం సన్నాహాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అలాగే, ఎకరానికి రూ.50 వేల వడ్డీ రహిత (రైతుకు గరిష్టంగా రూ.లక్ష) రుణాలు అందించాలని యోచిస్తున్నట్లు తెలిసింది. ఈ రెండు పథకాల వల్ల కేంద్ర ఖజానాపై ఏటా రూ.2.3 లక్షల కోట్ల భారం పడే అవకాశాలున్నాయి. ఎరువుల సబ్సిడీ పథకాన్ని కూడా వీటిలో విలీనం చేయాలని యోచిస్తున్నట్లు తెలిసింది. వీటికి సంబంధించిన అధికారిక ప్రకటన ఈ వారంలోనే వెలువడుతుందని భావిస్తున్నారు. -
రేపటి నుంచి దేశవ్యాప్తంగా నగదు బదిలీ పథకం
న్యూఢిల్లీ: గ్యాస్ వినియోగదారులకు నూతన సంవత్సరం ఆరంభం, అంటే రేపటి నుంచి దేశమంతటా నగదు బదిలీ పథకం అమలవుతుంది. గత నవంబరు 15 నుంచి దేశంలోని 54 జిల్లాలలో ఈ పథకం అమలవుతోంది. జనవరి 1 నుంచి మిగిలిన 676 జిల్లాలలో కూడా అమలవుతుంది. వంట గ్యాస్‌కు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ సొమ్ము రేపటి నుంచి బ్యాంకు ఖాతాలలో జమ చేస్తారు. నగదు బదిలీ పథకంలో చేరగానే ఒక్కో గ్యాస్ కనెక్షన్‌కు మొదట 568 రూపాయలు బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. వినియోగదారులు ఇక నుంచి మార్కెట్ ధరకు గ్యాస్‌ను కొనుగోలు చేయాలి. సిలెంబర్ బుకింగ్ చేయగానే అడ్వాన్స్ రూపంలో సబ్జిడీ సొమ్ము బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. ప్రస్తుతం 14.2 కిలోల గ్యాస్ సిలెండర్ సబ్సిడీ ధర 417 రూపాయలు. మార్కెట్ ధర 752 రూపాయలు. ఒక్కో వినియోదారుడికి 12 వరకు 14.2 కిలోల గ్యాస్ సిలెండర్లకు సబ్సిడీ వస్తుంది. మార్కెట్ ధరకు, సబ్సిడీ ధరకు మధ్య వ్యత్యాసం ఎంత ఉందో అంత మొత్తం బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. -
నేటి నుంచి నగదు బదిలీ
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: సబ్సిడీ గ్యాస్ వినియోగదారులకు నగదు బదిలీ పథకం జనవరి 1వ తేదీ నుంచి అమలు కానుందని జాయింట్ కలెక్టర్ కె.కన్నబాబు తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈ పథకం అమల్లోకి వచ్చినా వినియోగదారులు కంగారుపడాల్సిన అవసరం లేదన్నారు. గ్రేస్ పీరియడ్ నెల రోజుల వరకు ఉంటుందని తెలిపారు. ఈలోగా ఆధార్, బ్యాంకు అకౌంట్ , సెల్‌ఫోన్ నంబర్లు సంబంధిత గ్యాస్ డీలర్లకు ఇవ్వాలని పేర్కొన్నారు. బ్యాంకు ఖాతాను ఆధార్‌తో అనుసంధానం చేయడం పూర్తి చేసిన వినియోగదారులకు ఇప్పటికే ఒక సిలిండర్ సబ్సిడీ బ్యాంకు ఖాతాలకు జమ అయి ఉంటుందని తెలిపారు. జమ కాకపోయివుంటే త్వరలో ఒక సిలిండర్ సబ్సిడీ అడ్వాన్స్‌గా జమ అవుతుందని తెలిపారు. గ్రేస్ పీరియడ్ పూర్తి అయ్యేలోగా వినియోగదారులు ఆధార్, బ్యాంకు ఖాతాలు ఇవ్వకపోతే పూర్తి ధరతో సిలిండర్ కొనాల్సి వస్తుందని చెప్పారు. జిల్లాలో 42 లక్షల జనాభా ఉండగా, ఇందులో 32 లక్షల మందికి ఆధార్ నంబర్లు వచ్చాయని తెలిపారు. వివిధ జిల్లాలతో పోలిస్తే కర్నూలు జిల్లాలో ఆధార్‌లో పురోగతి ఎక్కువగా ఉందని వివరించారు. జిల్లాలో మొత్తం గ్యాస్ వినియోగదారులు 5,53,481 మంది ఉండగా, వీరిలో 2,28,646 మంది నుంచి ఆధార్ నెంబర్లు 2,08,170 మంది నుంచి బ్యాంకు ఖాతాలు సేకరించామని వివరించారు. మరో 67,138 మంది వినియోగదారుల నుంచి ఆధార్ ఎన్రోల్మెంట్ నంబర్లు సేకరించామని వివరించారు. ఆధార్ నమోదు అయి యుఐడీ రాకపోయి ఉంటే అటువంటివారికి యుఐడీ నంబర్లు తెప్పించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. నగదు బదిలీ పథకంతో గ్యాస్ వినియోగదారులకు ఎవ్వరికీ ఎటువంటి నష్టం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఆధార్, బ్యాంకు ఖాతాలు ఇవ్వని రైతులు వెంటనే ఈ వివరాలతో పాటు సెల్‌ఫోన్ నంబర్ కూడా గ్యాస్ డీలర్లకు ఇచ్చి సహకరించాలని కోరారు. గ్యాస్ వినియోగదారుల నగదు బదిలీ పథకం అమలుపై మరింత చొరవ తీసుకుని సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు.