రేపటి నుంచి దేశవ్యాప్తంగా నగదు బదిలీ పథకం
న్యూఢిల్లీ: గ్యాస్ వినియోగదారులకు నూతన సంవత్సరం ఆరంభం, అంటే రేపటి నుంచి దేశమంతటా నగదు బదిలీ పథకం అమలవుతుంది. గత నవంబరు 15 నుంచి దేశంలోని 54 జిల్లాలలో ఈ పథకం అమలవుతోంది. జనవరి 1 నుంచి మిగిలిన 676 జిల్లాలలో కూడా అమలవుతుంది. వంట గ్యాస్కు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ సొమ్ము రేపటి నుంచి బ్యాంకు ఖాతాలలో జమ చేస్తారు. నగదు బదిలీ పథకంలో చేరగానే ఒక్కో గ్యాస్ కనెక్షన్కు మొదట 568 రూపాయలు బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. వినియోగదారులు ఇక నుంచి మార్కెట్ ధరకు గ్యాస్ను కొనుగోలు చేయాలి.
సిలెంబర్ బుకింగ్ చేయగానే అడ్వాన్స్ రూపంలో సబ్జిడీ సొమ్ము బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. ప్రస్తుతం 14.2 కిలోల గ్యాస్ సిలెండర్ సబ్సిడీ ధర 417 రూపాయలు. మార్కెట్ ధర 752 రూపాయలు. ఒక్కో వినియోదారుడికి 12 వరకు 14.2 కిలోల గ్యాస్ సిలెండర్లకు సబ్సిడీ వస్తుంది. మార్కెట్ ధరకు, సబ్సిడీ ధరకు మధ్య వ్యత్యాసం ఎంత ఉందో అంత మొత్తం బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది.