Cash transport
-
ప్రైవేటు భద్రతా ఏజెన్సీ చట్టానికి మార్పులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రైవేటు భద్రతా ఏజెన్సీల నియంత్రణా చట్టం-2005కు కొత్తమార్గదర్శకాలు విడుదల చేస్తూ బుధవారం నోటిఫికేషన్ జారీ అయింది. కేంద్ర హోంశాఖ సూచనల మేరకు ప్రభుత్వం ప్రైవేటు భద్రతా ఏజెన్సీలు, నగదు రవాణా నిబంధనలపై మార్పులు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం సిఫార్సులతో ప్రైవేటు భద్రతా ఏజెన్సీలు, నగదు రవాణా నిబంధనలపై కొత్త నోటిఫికేషన్‌ను జారీ చేసి పలు సూచనలు చేసింది. నగదు తరలింపు చేసే ప్రైవేటు భద్రతా ఏజెన్సీలు ప్రభుత్వం వద్ద తమ వివరాలను నమోదు చేసుకోవాలని స్పష్టం చేసింది. ప్రైవేటు, ప్రభుత్వ బ్యాంకులు భద్రతా ఏజెన్సీల నియామకానికి సంబంధించిన వివరాలను ప్రభుత్వానికి సమర్పించాలని పేర్కోంది. ప్రైవేటు భద్రతా ఏజెన్సీలు రూ. 10 లక్షలకు మించి నగదు తరలిస్తే.. ఇద్దరు సాయుధ గార్డులు, నిర్దేశిత ప్రమాణాలతో కూడిన నగదు తరలింపు వాహనం ఉండాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అంతేకాక నగదు తరలింపు వాహనాలకు జీపీఎస్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశించింది. పట్టణ ప్రాంతాల్లో రాత్రి 9 గంటల తర్వాత, గ్రామీణ ప్రాంతాల్లో 6 గంటల తర్వాత నగదు తరలించేందుకు వీల్లేదని ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఇక మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటలలోపు మాత్రమే నగదు తరలింపు చేపట్టాలని సూచించింది. -
లెక్కుంటే ఎంతైనా తీసుకెళ్లొచ్చు
సాక్షి, హైదరాబాద్: నగదు రవాణాపై ఎలాంటి పరిమితులు లేవని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈఓ) రజత్ కుమార్ పేర్కొన్నారు. రవాణా చేసే వారి దగ్గర సరైన పత్రాలు, లెక్కలుంటే సరిపోతుం దని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు రూ.55 కోట్లు సీజ్ చేసినట్లు చెప్పారు. ఇందులో రూ.17.55 కోట్లు ఐటీ, 36.67 కోట్లు పోలీసులు సీజ్ చేశారన్నారు. 2014 ఎన్నికల సీజ న్లో రూ.76 కోట్లు సీజ్ చేసినట్లు గుర్తు చేశారు. శుక్రవారం సచివాలయంలోని మీడియా పాయింట్ వద్ద సీఈఓ రజత్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు సంబంధించి ఇప్పటివరకు 82 కేసులు నమోదు చేశామని, వీటిలో 33 కేసులు హైదరాబాద్‌లో నమోదైనట్లు వివరించారు. మొత్తం కేసుల్లో 51 కేసులకు సంబంధించి పూర్తి స్థాయి సమాచారం రావాల్సి ఉందన్నారు. ఫోన్ ట్యాపింగ్‌పై వస్తున్న ఫిర్యాదులపై డీజీపీతో చర్చించానని, ఎవరి ఫోన్లనూ ట్యాప్ చేయలేదని ఆయన స్పష్టం చేశారన్నారు. ఏపీ ఇంటెలిజెన్స్ పోలీసులు ఇక్కడ డబ్బులు పంపిణీ చేస్తున్నారనే ఫిర్యాదుపై స్పందించి వివరాలు తెలుసుకున్నామని, ఎక్కడా డబ్బు సీజ్ చేయలేదని ఇరు రాష్ట్రాల డీజీపీలు వివరణ ఇచ్చినట్లు తెలిపారు. జనగామలో డబ్బులు పంచే విషయంలో కేసు నమోదు చేసినట్లు చెప్పారు. అంతర జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల విషయంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించామని, పాత జిల్లాలను పరిగణనలోకి తీసుకుంటే ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావడం లేదన్నారు. ఆ మేరకు సిబ్బందికి విధులు కేటా యిస్తున్నట్లు చెప్పారు. అసెంబ్లీ నియోజకవర్గాలపై పూర్తిగా జిల్లా ఎన్నికల అధికారే బాధ్యత వహిస్తారని తెలిపారు. పోలీస్ కేటగిరీలో ఇబ్బందులు వస్తున్నాయని, దీంతో డీఎస్పీ స్థాయి అధికారిని నియోజకవర్గానికి బాధ్యతలు అప్పగిస్తే సరిపోతుందన్నారు. హోంగార్డుల కోసం పొరుగు రాష్ట్రాల సాయం రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు పోలీస్ సిబ్బంది కొరత వస్తోందని, ఈ నేపథ్యంలో 5 వేల హోంగార్డులు కావాలని తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుంచి పంపించాలని అడిగామని, త్వరలో దీనిపై ఈసీఐ నిర్ణయం తీసుకుం టుందని రజత్ కుమార్ తెలిపారు. బ్యాంకర్లు, ఏటీఎం నిర్వాహకులు నగదు రవాణాకు సంబంధించి పూర్తి స్థాయి సమాచారాన్ని వెంట తెచ్చుకోవాలని సూచించారు. రాజకీయ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టో లు విడుదల చేసే మూడు రోజుల ముందే తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో మూడు కాపీలను రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారికి సమర్పించాల్సి ఉంటుందన్నారు. రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో పాల్గొనవద్దు రాజకీయ పార్టీలు నిర్వహించే కార్యక్రమాల్లో ప్రభు త్వ అధికారులు, ఉద్యోగులు పాల్గొనవద్దని, అలా పాల్గొన్నట్లు ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఈఓ తెలిపారు. ఐఏఎస్ అధికారి మురళి విషయం మా దృష్టికి వస్తే ఆయన వివరణ ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు మద్యనిషేధం అమలు చేయాలని పలు రాజకీయ పార్టీలు కోరుతున్నాయని, కానీ అది మా పరిధి కాదన్నారు. మద్యం విక్రయాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు 20 శాతం ఆదాయం వస్తుందన్నారు. ఇప్పటివరకు దాదాపు రూ.3.31 కోట్ల విలువైన 1.45 లక్షల లీటర్ల మద్యం సీజ్ చేశామని తెలిపారు. వ్యయం పెంచినా పరిమితులు.. ఎన్నికల వ్యయాన్ని కూడా పెంచినప్పటికీ పరిమితులు పెట్టామని రజత్ కుమార్ తెలిపారు. ఇప్పటివరకు సీజ్ చేసిన డబ్బంతా ఎన్నికల కోసం బయటకు వచ్చిందేమీ కాదన్నారు. సరైన ఆధారాలు చూపించి తీసుకెళ్లేవాళ్లు కూడా ఉన్నారని తెలిపారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం రేవంత్‌రెడ్డికి భద్రత కల్పించాలని డీజీపీకి సూచించారు. -
ఆరు రోజుల్లోనే కొత్త కరెన్సీ తరలింపు..
న్యూఢిల్లీ: నోట్ల రద్దు అనంతరం తలెత్తిన పరిణామాలను అంచనా వేయడంలో విఫలమైన రిజర్వ్ బ్యాంక్, ప్రభుత్వ వర్గాలు.. ఇప్పుడు కొత్త కరెన్సీ నోట్ల తరలింపుకు భారీ సన్నాహాలు చేశాయి. కరెన్సీ ముద్రణా కేంద్రాల నుంచి కొత్త నోట్లను బ్యాంకులకు తరలించే సమయాన్ని గణనీయంగా తగ్గించగలిగారు. ఇంతకుముందు ఆయా కేంద్రాల నుంచి కొత్త కరెన్సీ బండిళ్లు బ్యాంకులకు చేరడానికి కనీసం 21 రోజులు పట్టేది. సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలోని నాసిక్, దేవాస్ ప్రెస్‌లతోపాటు భారతీయ రిజర్వు బ్యాంక్ నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన సాల్బోని(పశ్చిమ బెంగాల్), మైసూరు ముద్రణాలయాల నుంచి కొత్త నోట్ల రవణాను వేగవంతం చేశామని, కేవలం ఆరు రోజుల్లోనే కొత్త కరెన్సీ బ్యాంకులకు చేరుతున్నదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇందు కోసం ఆర్మీ యుద్ధ హెలికాప్టర్లను సైతం వినియోగిస్తున్నామని, జనవరి 15 నాటికి దేశంలో సాధారణ పరిస్థితి నెలకొనే అవకాశాలున్నాయని తెలిపాయి. మిగిలిపోయే డబ్బు జన్‌ధన్ ఖాతాల్లోకి..? ప్రస్తుతం దేశవ్యాప్తంగా 25 కోట్ల జన్‌ధన్ ఖాతాలున్నాయి. వీటిలో సుమారు 6 కోట్ల అకౌంట్లలో ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా జమకాలేదు. అలాంటి జీరో బ్యాలెన్స్ అకౌంట్లలోకి ప్రభుత్వం రూ.10వేల చొప్పున జమచేస్తుందని.. తద్వారా నోట్ల రద్దు నిర్ణయంతో అందరికీ షాకిచ్చిన కేంద్ర ప్రభుత్వం పేదలకు వరాన్ని ప్రకటిస్తుందని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే ఇదంతా వట్టిదేనని, ప్రధానికిగానీ, ప్రభుత్వానికి గానీ జన్‌ధన్ ఖాతాల్లోకి డబ్బు మళ్లించాలనే ఆలోచన ఏమాత్రమూ లేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. నోట్ల రద్దు ద్వారా (వెనక్కి రాని నల్లధనం వల్ల) సుమారు 3లక్షల కోట్ల రూపాయలు మిగులుతాయని ప్రభుత్వం లెక్కకట్టిందని, వాటిని పేదలకు ఊరికే పంచెయకుండా ఉత్పాదకత పెంపు చర్యలకు వినియోగించాలని ప్రధాని భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్రస్తుతం 18 నుంచి 20 శాతం వడ్డీతో బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయని, నోట్ల రద్దు ప్రక్రియ తర్వాత ఆ వడ్డీని గణనీయంగా తగ్గించి ఆయా పరిశ్రమలకు సులువుగా రుణాలు అందిపజేయాలని మోదీ ఆలోచిస్తున్నారని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. -
రైళ్లలోనూ తనిఖీలు
నగదు రవాణాను అడ్డుకోవడానికి తనిఖీలు మరింత ముమ్మరం చేయాలని రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం నిర్ణయించింది. అందులో భాగంగా రైళ్లు, రైల్వేస్టేషన్లలోనూ తనిఖీలకు ఆదేశించింది. ప్రతి ప్రయాణికుడి బ్యాగులు, సూట్ కేసులు తనిఖీలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. నామినేషన్లు సమర్పించేందుకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ముందుగా ప్రత్యేక బ్యాంకు ఖాతాలు సిద్ధం చేసుకోవాలన్న ఆదేశాలు వెలువడ్డాయి. నామినేషన్ల పత్రంలో బ్యాంకు ఖాతాలు లేని పక్షంలో తిరస్కరణకు గురి కావడం తథ్యం. సాక్షి, చెన్నై: ఎన్నికల్లో నగదు, తాయిలాల పంపిణీ అడ్డుకట్ట లక్ష్యంగా ఎన్నికల ప్రధాన అధికారి ప్రవీణ్‌కుమార్ ముందుకు సాగుతున్నారు. ఓటర్లలో చైతన్యం తెచ్చే విధంగా ఓటుకు నోటు వద్దన్న నినాదంతో అవగాహనా కార్యక్రమాలు వేగవంతం చేసి ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తం గా వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. బస్సులు, లారీలు, నాలుగు చక్రాలు, మూడు చక్రాలు, ద్విచక్ర వాహనాలు సైతం వదలి పెట్టకుండా తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీల్లో కోట్లాది రూపాయల నగదు, బంగారు ఆభరణాలు, పలు రకాల సామాగ్రి పట్టుబడుతూ వస్తోంది. రికార్డులు ఉన్న వాటిని పరిశీలనానంతరం సంబంధిత వ్యక్తులకు కొంత మేరకు అప్పగిస్తున్నారు. పోలీసులు తమ చేతి వాటాన్ని సైతం పలు చోట్ల ప్రదర్శిస్తున్నారు. అదే సమయంలో ఎలాంటి రికార్డులు లేని సుమారు ఎనిమిది కోట్ల మేరకు నగదు, నగలు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీలు ఉధృతం కావడంతో రాజకీయ పక్షాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి. రైళ్లలోనూ తనిఖీలు : రోడ్డు మార్గంలో తనిఖీలు ముమ్మరం కావడంతో రైలు మార్గాన్ని ఎంపిక చేసుకుని నగదు తరలిస్తున్నట్టుగా ఈసీకి సమాచారం అందింది. దీంతో ఇక రైళ్లలోనూ తనిఖీలు చేపట్టేపనిలో ఉన్నారు. రైళ్లల్లో తనిఖీలు అన్నది అంత సులభం కాదు కాబట్టి, రైల్వు స్టేషన్లలో ప్రత్యేక బృందాల్ని రంగంలోకి దించి, అనుమానం వచ్చే వాళ్ల బ్యాగులు, సూట్ కేసులు తనిఖీలు చేసేందుకు ఈసీ చర్యలు చేపడుతోంది. ఎలాగూ రాష్ర్టంలోని అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో మెటల్ డిటెక్టర్లు, తనిఖీలు జరుగుతున్న దృష్ట్యా, చిన్న చిన్న రైల్వే స్టేషన్ల మీద ప్రత్యేక దృష్టి పెట్టే పనిలో ఉన్నారు. ఆంక్షల కొరడా: నామినేషన్లకు సమయం ఆసన్నం అవుతుండడంతో అందుకు తగ్గ ఏర్పాట్లలో ఎన్నికల యంత్రాంగం నిమగ్నం అయింది. అభ్యర్థులకు ఆంక్షల కొరడాను శనివారం ప్రకటించింది. ఎన్నికల బరిలో నిలబడే ప్రతి అభ్యర్థి ప్రత్యేక బ్యాంకు ఖాతాను ఏర్పాటు చేసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. నామినేషన్ పత్రంలో బ్యాంకు ఖాతా నెంబర్‌ను తప్పని సరిగా పొందు పరచాల్సి ఉంటుందని సూచించారు. ఈ ఖాతా ద్వారానే నగదు బదలాయింపులు జరగాలని వివరించారు. బ్యాంక్ ఖాతాకు వ్యక్తిగత చిరునామా లేదా, పార్టీ ఎన్నికల కార్యాలయాల చిరునామాలు అయినా సమర్పించ వచ్చని సూచించారు. అలాగే, నామినేషన్లు దాఖలు చేయడానికి వచ్చే సమయంలో హంగు ఆర్భాటాలు ఉండకూడదని హెచ్చరించారు. అభ్యర్థితో పాటుగా మరో నలుగురిని మాత్రమే నామినేషన్ దాఖలుకు అనుమతించడం జరుగుతుందన్నారు. ప్రధాన కూడళ్లలో ఓపెన్ టాప్ వాహనాల నుంచి ఎన్నికల ప్రచారాలు, బహిరంగ సభలకు అనుమతి తప్పనిసరి చేశారు. ముందస్తుగా అనుమతులు తీసుకోవాలని, ఎవరు ముందుగా దరఖాస్తు చేసుకుంటారో వారికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. ముఖ్య నేతల పర్యటన వివరాలు ముందుగానే సమర్పించాలని సూచించారు. హెలికాప్టర్లను దించేందుకు ప్రైవేటు స్థలాల్లో హెలిప్యాడ్ల ఏర్పాటుకు, ప్రైవేట్ హెలి ప్యాడ్లను ఉపయోగించుకునే సమయంలో ముందుగా ఆయా జిల్లా కలెక్టర్ల నుంచి అనుమతి తీసుకోవాలని వివరించారు. హెలికాప్టర్లలో పయనించే ముఖ్య నేతల వివరాలను సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.