castration
-
కెమికల్ కాస్ట్రేషన్ బిల్లుకు ఆమోదం..ఏ దేశాల్లో అమల్లో ఉందంటే..!
బ్యాంకాక్: ప్రపంచవ్యాప్తంగా మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కామంతో కళ్లు మూసుకుపోయిన మానవ మృగాలు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. భారత్‌లో నిర్భయ వంటి కఠిన చట్టాలు తెచ్చినప్పటికీ లాభం లేకుండా పోతోంది. అలాంటి వారికి కఠిన శిక్షలు అమలు చేయాలని ప్రపంచవ్యాప్తంగా డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రేపిస్టులపై కొరడా ఝులిపించింది థాయ్‌లాండ్. అత్యాచారాలకు పాల్పడిన వారిని కఠినమైన కెమికల్ కాస్ట్రేషన్‌కు గురి చేసే చట్టానికి ఆ దేశ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. కొత్త చట్టం ప్రకారం.. సైకియాట్రిక్, అంతర్గత మెడిసన్ స్పెషలిస్ట్‌ల ఆమోదంతో పాటు నేరస్థుడి అనుమతితో కెమికల్ కాస్ట్రేషన్ చేపట్టాలి. లైంగిక సామర్థ్యాన్ని తగ్గించేలా శరీరంలో టెస్టోస్టిరాన్ స్థాయులను తగ్గించే ఇంజెక్షన్లు, చికిత్సకు అంగీకరించిన వారి జైలు శిక్ష తగ్గించనున్నారని బ్యాంకాక్ పోస్ట్ తెలిపింది. 'హింస సంబంధిత పునర్విచారణ నిరోధక బిల్లు'ను న్యాయశాఖ పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. ఈ బిల్లును దిగువ సభ గత ఫిబ్రవరిలోనే ఆమోదించగా.. తాజాగా ఎగువసభ సెనేట్ ఆమోద ముద్ర వేసింది. 147 సభ్యులతో కూడిన సభలో బిల్లుకు ఇద్దరు గైర్హాజరు కాగా 145-0 తేడాతే ఏకగ్రీవంగా ఆమోదం లభించటం గమనార్హం. స్వచ్ఛంద కెమికల్ కాస్ట్రేషన్ బిల్లుకు ఆమోదం లభించిన క్రమంలో.. చేపట్టాల్సిన ప్రక్రియను అధికారులు సిద్ధం చేయనున్నారు. ఈ బిల్లు రాయల్ గెజిట్‌లో పబ్లీష్ అయ్యాక చట్టంగా మారనుంది. ఏ దేశాలు ఈ శిక్షను అమలు చేస్తున్నాయి? కెమికల్ కాస్ట్రేషన్ అనేది శిక్షల్లో కొత్తదేమి కాదు. ఇది దక్షిణ కొరియా, పాకిస్థాన్, పోలాండ్, అమెరికాలోని ఎనిమిది రాష్ట్రాల్లో దీనిని అమలు చేస్తున్నారు. మరోవైపు.. నార్వే, డెన్మార్క్, జర్మనీ వంటి దేశాల్లో సర్జికల్ కాస్ట్రేషన్‌ను పాటిస్తున్నారు. అయితే.. ఈ విధమైన శిక్షలు మానవ హక్కులను హరిస్తున్నాయనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. కాస్ట్రేషన్ చేయటం వల్ల నేరస్థుడు తన జీవితాంతం లైంగిక చర్యలో పాల్గొనలేడు. దీనికి గురైన వ్యక్తి క్రూరంగా ప్రవర్తించటం, వివాహద్వేషిగా మారతాడని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మహిళలు, బాలికలను ద్వేషించటం, వారికి హాని కలిగించటం వంటి నేరాలకు పాల్పడే అవకాశం ఉందని తెలిపారు. సెక్స్ అనేది ఒక్కటే దాడికి మార్గం కాదని, ఇతర దారుల్లో మహిళలు, బాలికలపై దాడులకు పాల్పడే అవకాశం ఉందన్నారు. మరోవైపు.. అత్యాచార ఘటనలు పెరిగిపోతున్న క్రమంలో ఇలాంటి కఠిన శిక్షలు అవసరమని మరోవర్గం వాదిస్తోంది. కాస్ట్రేషన్ భయంతో నేరాలకు పాల్పడేందుకు వెనకడుగువేస్తారని బావిస్తున్నారు. ఇదీ చూడండి: యూపీలో 'బై బై మోదీ' హోర్డింగ్.. అది టీఆర్ఎస్ మద్దతుదారుల పనేనా? -
డేరా బాబాను కాపాడేందుకు దిగ్గజ లాయర్లు
సాక్షి, న్యూఢిల్లీ : లైంగిక దాడి కేసులో శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా సౌథ చీఫ్ గుర్మీత్ రాం రహీం సింగ్ తన ఆశ్రమంలో పలువురిని సామూహికంగా నపుంసకులుగా మార్చారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో తనకు మద్దతుగా వాదనలు వినిపించేందుకు ప్రముఖ న్యాయవాదులను ఆయన ఎంపిక చేసుకున్నారు. ఆరుషి హత్య కేసులో తల్వార్లకు విముక్తి కల్పించిన లక్నోకు చెందిన న్యాయవాదులు తన్వీర్ అహ్మద్ మిర్, ధ్రువ్ గుప్తాలు ఈ కేసులో డేరా బాబా తరపున వాదనలు వినిపించనున్నారు. డేరా ప్రధాన కార్యాలయంలో గుర్మీత్ సింగ్, ఇద్దరు వైద్యుల సాయంతో దాదాపు 400 మంది డేరా అనుచరులను బలవంతంగా వృషణాలు తొలగించడం ద్వారా నపుంసకులుగా మార్చారని సీబీఐ ఈ ఏడాది ఫిబ్రవరి 1న డేరా బాబాపై చార్జిషీట్ నమోదు చేసింది. వైద్యులు పంకజ్ గార్గ్, ఎంపీ సింగ్‌ల సహకారంతో గుర్మీత్ ఈ దారుణానికి పాల్పడ్డాడని సీబీఐ ఆరోపిస్తోంది. పంచ్‌కుల ప్రత్యేక న్యాయస్ధానంలో డేరా బాబాపై సీబీఐ ఈ మేరకు అభియోగపత్రాన్ని నమోదు చేసింది. పంజాబ్ హర్యానా హైకోర్టు ఆదేశాల మేరకు గుర్మీత్ సింగ్‌పై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. -
డేరా బాబాపై ఛార్జిషీటు దాఖలు
చండీగఢ్: రేప్ కేసులో శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం, ఆయన ఇద్దరు అనుచరులపై సీబీఐ గురువారం ఛార్జిషీటు దాఖలు చేసింది. గుర్మీత్ రామ్ రహీం తన ఆశ్రమంలో పని చేసే ఇద్దరు యువతులపై అత్యాచారం చేయడంతో కోర్టు ఆయనకు 20 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. మరో రెండు హత్య కేసుల్లో కూడా గుర్మీత్ రామ్ రహీం నిందితుడిగా ఉన్నాడు. డేరా ఆశ్రమంలోని తన అనుచరులను నపుంసకులుగా మార్చారనే ఆరోపణలపై పంజాబ్, హర్యానా హైకోర్టు విచారణకు ఆదేశించిన 3 సంవత్సరాల తర్వాత సీబీఐ చార్జిషీటు దాఖలు చేసింది. డేరా ఆశ్రమ చీఫ్ గుర్మీత్ మాజీ అనుచరుడు హన్స్‌రాజ్ చౌహన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తనతో పాటు ఆశ్రమంలో పనిచేస్తున్న 400 మంది అనుచరులను డేరా ఆశ్రమంలో నపుంసకులుగా మార్చివేశాడని హన్స్‌రాజ్ చౌహన్ పిటిషన్లో పేర్కొన్నారు. గుర్మీత్ రామ్ రహీం రోహ్తక్లోని సునారియా జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. -
గుర్మీత్ పీఏను చూసి సీబీఐ షాక్
సాక్షి, న్యూఢిల్లీ : అత్యాచార కేసులో శిక్ష అనుభవిస్తున్న గుర్మీత్ రాం రహీమ్ సింగ్ పై నమోదయిన మరికొన్ని కేసుల్లో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఇందులో 400 మందిని నంపుసకులుగా మార్చారన్న కేసు ఒకటి. డేరాబాబా మాజీ అనుచరుడు హంసరాజ్ చౌహాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీబీఐ అధికారులు విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. అది ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంది. ప్రత్యేక కోర్టు అనుమతితో బుధవారం రోహ్తక్ జైల్లో ఉన్న గుర్మీత్ నుంచి సీబీఐ స్టేట్మెంట్ను నిన్న రికార్డు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు త్వరలో పూర్తి నివేదికను పంజాబ్ హర్యానా హైకోర్టుకు అందిస్తామని సీబీఐ తెలిపింది. అందులోని సమాచారం ప్రకారం... భగవంతుడిని చేరాలంటే మగతానాన్ని పరిత్యజించి తనను పూజించాలని గుర్మీత్ చెప్పేవాడని.. 2000 సంవత్సరంలో తనతోపాటు మరో 400 మంది వృషణాలను తొలగించి నపుంసకులుగా మార్చాడని హంసరాజ్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. అంతేకాదు తనకు నష్టపరిహారం ఇప్పించాలని 2012లో హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశాడు కూడా. దీంతో సీబీఐ దర్యాప్తునకు కోర్టు ఆదేశించగా.. 2015లో కేసు కూడా నమోదు అయ్యింది. డేరాలోని డాక్టర్లే ఈ శస్త్రచికిత్సలు చేశారని దర్యాప్తులో సీబీఐ అధికారులు గుర్తించారు. స్త్రీలను శృంగారానికి వాడుకున్న డేరా బాబా, అనుచరులను మాత్రం నపుంసకులుగా మార్చిన సంగతి తెలిసిందే. చివరకు డేరాబాబా తన వ్యక్తిగత సలహాదారు రాకేష్‌ను కూడా వదల్లేదు. తాను వద్దని వేడుకుంటున్నా తనకు కూడా ఆపరేషన్ చేయించాడని రాకేష్ తెలిపాడు. రాకేష్‌తోపాటు, న్యాయసలహాదారు దాస్‌లకు వైద్య పరీక్షలు నిర్వహించగా వారిద్దరికీ కూడా వృషణాలు లేవని తేలింది. దీంతో షాక్ తిన్న అధికారులు మరికొందరు ప్రధాన అనుచరుల్ని పరీక్షించి చివరకు డేరా బాబా స్టేట్మెంట్ నమోదు చేశారు. గుర్మీత్ దగ్గర పైసల్లేవ్... అత్యాచార కేసులో బాధిత మహిళలకు 30 లక్షలు చెల్లించాలన్న పంచకుల కోర్టు ఆదేశాలపై గుర్మీత్ అభ్యంతరం పిటిషన్ దాఖలు చేశాడు. డేరా ఆస్తులను ప్రభుత్వం జప్తు చేసినందున బాధితులకు చెల్లించేందుకు తన దగ్గర డబ్బు లేదని పిటిషన్లో గుర్మీత్ పేర్కొన్నాడు. దీంతో కోర్టు గుర్మీత్‌కు రెండు నెలల గడువు విధించింది. అల్లర్ల అనంతరం జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకు డేరా సచ్ఛా సౌధా ఆస్తులను జప్తు చేయాలని హర్యానా ప్రభుత్వాన్ని పంచకుల ప్రత్యేక కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. -
‘ఆ కేసులో డేరా బాబా స్టేట్మెంట్ నమోదు’
సాక్షి,న్యూఢిల్లీ: డేరా అధిపతి గుర్మీత్ రామ్ రహీం సింగ్ డేరా ప్రాంగణంలో 400 మంది తన అనుచరుల వృషణాలను బలవంతంగా తొలగించారన్న కేసుకు సంబంధించి సీబీఐ బుధవారం ఆయన స్టేట్మెంట్ను నమోదు చేసింది. 2000 సంవత్సరంలో జరిగిన ఈ అమానుష ఘటనపై సీబీఐ విచారణను కోరుతూ హన్సరాజ్ చౌహాన్ అనే డేరా అనుచరుడు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో డేరా చీఫ్‌ను ప్రశ్నించినట్టు సీబీఐ ప్రతినిధి తెలిపారు. అత్యాచార కేసుల్లో 20 ఏళ్ల జైలు శిక్షను అనుభవిస్తూ రోహ్తక్ జైలులో ఉన్న గుర్మీత్ సింగ్‌ను ప్రత్యేక కోర్టు అనుమతితో సీబీఐ అధికారులు కలిసి ఆయన స్టేట్మెంట్ను రికార్డు చేశారు.పంజాబ్ హర్యానా హైకోర్టు ఆదేశాల మేరకు 2015, జనవరిలో ఈ అభియోగాలపై సీబీఐ కేసు నమోదు చేసింది. -
రేపిస్టులపై హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు
కోచి: రేపిస్టులపై ప్రముఖ హీరోయిన్ మీరా జాస్మిన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. మహిళలపై లైంగిక దాడులను చేసేవారికి క్యాస్ట్రేషన్ (బీజకోశాలను కత్తిరించి నపుంసకులుగా మార్చడం) ఒక్కటే సరైన శిక్ష అని, రేపిస్టుల సైతం ఆ బాధను అనుభవించినప్పుడు ఇలాంటి ఘటనలు తగ్గుతాయని ఆమె పేర్కొన్నారు. ఇటీవల కేరళలోని పెరుంబవూర్‌లో దళిత మహిళ అత్యాచారానికి గురై.. హత్య చేయబడింది. ఈ నేపథ్యంలో బాధితురాలి తల్లితోపాటు, నటుడు అనూప్‌తో కలిసి మీరా జాస్మిన్ మీడియాతో మాట్లాడింది. ప్రస్తుతమున్చ చట్టాలతో లైంగిక దాడులు వంటి నేరాలను సమర్థంగా ఎదుర్కొనలేకపోతున్నామని పేర్కొంది. ‘మహిళలపై లైంగిక దాడులు జరుపుతున్న వారికి నొప్పి కలిగించే శిక్షలు ఇవ్వాల్సిన అవసరముంది. అలాంటివారిని ఎదుర్కోవడానికి క్యాస్ట్రేషన్ (అంగ విచ్ఛేదన) ఒక్కటే మార్గం’ అని పేర్కొంది. ‘అలాంటి నొప్పి కలిగించే శిక్షలు విధిస్తే.. వారు జీవితంలో మహిళలను తాకడానికి సాహసించరు’ అని తెలిపింది. రేప్ బాధితురాళ్లపై మీరా జాస్మిన్ నటించిన తాజా సినిమా ‘పాథు కల్పనకల్’ సినిమా ప్రమోషన్లో భాగంగా ఆమె ఈ విలేకరుల సమావేశం నిర్వహించింది. -
ఒక ఎద్దు... పదెకరాల విత్తు!
ఆత్మకూరు : ఆత్మకూరుకు చెందిన రైతు కందుల లోకనాథరెడ్డి బుధవారం తన ఒంటెద్దు కళ్లకు గంతలు కట్టి, చేతి పగ్గాలు, కాడి పట్టెళ్లు లేకుండా తొమ్మిది గంటల వ్యవధిలో పదెకరాల్లో జొన్న విత్తనం వేశారు. రైతు చేపట్టిన ఈ విన్యాసాన్ని పలువురు ఆసక్తిగా చూశారు. సాయంత్రం గ్రామంలో ఎద్దుతో పాటు రైతునూ స్థానికులు ఊరేగించారు. -
'పిల్లలపై అత్యాచారాలకు అదే మందు'
పిల్లలపై అత్యాచారాలను అరికట్టాలంటే.. ఒకటే మందు ఉంటుందని మద్రాసు హైకోర్టు అభిప్రాయపడింది. అదే.. విత్తుకొట్టడం. అవును.. మీరు సరిగ్గానే చదివారు. ఈ శిక్ష విధిస్తే మాత్రమే చిన్నారులపై అత్యాచారాలు తగ్గుతాయని మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. కిరుబకరన్ వ్యాఖ్యానించారు. సంప్రదాయ చట్టాలు వీళ్లమీద ఎలాంటి ప్రభావం చూపించడం లేదని, వాస్తవానికి విత్తుకొట్టడం లాంటి శిక్షలు అరాచకంగా అనిపించినా.. అచారకమైన నేరాలకు తప్పనిసరిగా అరాచక శిక్షలే విధించాలని ఆయన అన్నారు. దీంతో చాలామంది అంగీకరించకపోవచ్చు గానీ, సమాజంలో పెరిగిపోతున్న దారుణాలకు ఇది మాత్రమే సరైన మందు అని ఆయన చెప్పారు. 2008 నుంచి 2014 వరకు చిన్నపిల్లలపై జరిగిన అత్యాచారాల కేసుల్లో శిక్షలు పడినది కేవలం 2.4 శాతం మంది నేరస్థులకేనని, అయితే ఇదే సమయంలో పిల్లలపై నేరాలు 400 శాతం పెరిగాయని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. అమెరికా సహా పలు దేశాల్లో ఇప్పటికే విత్తుకొట్టడం లాంటి శిక్షలు అమలులో ఉన్నాయని, అందుకే అక్కడ ఈ తరహా నేరాలు బాగా తగ్గాయని చెప్పారు. తమిళనాడులో పిల్లలపై అత్యాచారం చేసిన ఓ విదేశీయుడు పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను కొట్టేసే సందర్భంగా జస్టిస్ ఎన్. కిరుబకరన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో గత వారం ఇద్దరు చిన్నారులపై దారుణంగా జరిగిన సామూహిక అత్యాచారాల నేపథ్యంలో కోర్టు ఇంత తీవ్రంగా స్పందించింది. పిల్లలపై అత్యాచారాలు చేసిన వాళ్లకు విత్తుకొట్టే శిక్షలను ఇప్పటికే రష్యా, పోలండ్, ఈస్టోనియా, అమెరికాలోని తొమ్మిది రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని, తాజాగా ఆసియాలో మొట్టమొదటిగా దక్షిణ కొరియా కూడా ఈ శిక్షలను అమలు చేయడం ప్రారంభించిందని అన్నారు. -
భర్త పురుషాంగం కోసిన భార్య
నంద్యాల: రోజూ తప్పతాగి వేధిస్తున్న భర్తతో విసిగిపోయిన భార్య ఏకంగా అతని పురుషాంగాన్ని కోసేసింది. సకాలంలో వైద్యం అందడంతో అతనికి ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటన శనివారం రాత్రి కర్నూలు జిల్లా నంద్యాల మండల పరిధిలోని పొన్నాపురంలో చోటు చేసుకుంది. ఆళ్లగడ్డకు చెందిన వ్యక్తికి.. పొన్నాపురానికి చెందిన మహిళతో 20ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి నలుగురు మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు. ఇటుకల బట్టీలో కార్మికుడిగా పని చేస్తున్న ఆ వ్యక్తి కుటుంబ పోషణను గాలికొదిలేసి అప్పులు చేస్తూ.. తాగుడుకు బానిసయ్యాడు. శనివారం రాత్రి తాగొచ్చి భార్యతో గొడవ పడటంతో విసిగిపోయిన ఆమె బ్లేడ్‌తో పురుషాంగం కోసేసింది. తేరుకున్న అతను వెంటనే ఓ ప్రైవేట్ వైద్యుడిని వద్దకు వెళ్లాడు. చికిత్స అనంతరం కోలుకుంటున్నాడు. -
మోసం చేసిన ప్రియుడిపై దాడి
హైదరాబాద్: ప్రేమ.. పెళ్లి పేరుతో వెంట తిప్పుకొని ...ఆపై మరో అమ్మాయిన పెళ్లి చేసుకున్న ప్రియుడిపై ఓ యువతి దాడి చేసింది. దుండిగల్ పోలీసుల కథనం ప్రకారం.. రాజమండ్రికి చెందిన కాకరపల్లి ప్రతాప్ (32) బాచుపల్లిలో ఉంటూ హైటెక్ సిటీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. 2001లో అమలాపురంలోని ఓ కళాశాలలో డిప్లొమో చదివే సమయంలో అదే ప్రాంతానికి చెందిన రమ్యతో పరిచయం ఏర్పడింది. రమ్యను పెళ్లి చేసుకుంటానని చెప్పి ప్రతాప్ ఆమెను లోబర్చుకున్నాడు. ఈ నేపథ్యంలోనే అతను బాచుపల్లికి వచ్చి స్థిరపడగా రమ్య చందానగర్‌లో ఉంటోంది. కాగా, మే నెలలో ప్రతాప్‌కు మరో అమ్మాయితో నిశ్చితార్థం జరిగింది. విషయం తెలుసుకున్న రమ్య పెళ్లి పేరుతో ప్రతాప్ తనను మోసం చేశాడని చందానగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేయగా... బెయిల్‌పై వచ్చి జూన్‌లో విడుదలయ్యాడు. నిశ్చితార్థం చేసుకున్న అమ్మాయిని ఆగస్టులో పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలో రమ్య బుధవారం ఉదయం 10 గంటలకు బాచుపల్లిలోని ప్రతాప్ ఇంటికి వచ్చింది. అదే సమయంలో స్నానం చేసి లుంగీపై బయటకు వస్తున్న ప్రతాప్ మర్మాంగంపై తన వెంట తెచ్చుకున్న చిన్న కత్తితో దాడి చేసేందుకు యత్నించింది. ప్రతాప్ తప్పించుకోవడానికి ప్రయత్నించడంతో తొడపై గాయాలయ్యాయి. వెంటనే ప్రతాప్‌ను ఇంట్లోకి గెంటివేసి బయట గడియ పెట్టి రమ్య పరారైంది. తేరుకున్న ప్రతాప్ తన స్నేహితుడికి ఫోన్ ద్వారా సమాచారం అందించడంతో అతడు వచ్చి ప్రతాప్‌ను ఆస్పత్రికి తరలించారు. అదే రోజు రాత్రి దుండిగల్ పోలీసులకు రమ్యపై ప్రతాప్ ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.