భర్త పురుషాంగం కోసిన భార్య | angry wife castrates husband at nandyal | Sakshi
Sakshi News home page

భర్త పురుషాంగం కోసిన భార్య

Published Mon, Sep 22 2014 6:27 PM | Last Updated on Sat, Sep 2 2017 1:48 PM

angry wife castrates husband at nandyal

నంద్యాల: రోజూ తప్పతాగి వేధిస్తున్న భర్తతో విసిగిపోయిన భార్య ఏకంగా అతని పురుషాంగాన్ని కోసేసింది. సకాలంలో వైద్యం అందడంతో అతనికి ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటన శనివారం రాత్రి కర్నూలు జిల్లా నంద్యాల మండల పరిధిలోని పొన్నాపురంలో చోటు చేసుకుంది.

ఆళ్లగడ్డకు చెందిన వ్యక్తికి.. పొన్నాపురానికి చెందిన మహిళతో 20ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి నలుగురు మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు. ఇటుకల బట్టీలో కార్మికుడిగా పని చేస్తున్న ఆ వ్యక్తి  కుటుంబ పోషణను గాలికొదిలేసి అప్పులు చేస్తూ.. తాగుడుకు బానిసయ్యాడు.

శనివారం రాత్రి తాగొచ్చి భార్యతో గొడవ పడటంతో విసిగిపోయిన ఆమె బ్లేడ్‌తో పురుషాంగం కోసేసింది. తేరుకున్న అతను వెంటనే ఓ ప్రైవేట్ వైద్యుడిని వద్దకు వెళ్లాడు. చికిత్స అనంతరం కోలుకుంటున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement