Published
Thu, Aug 11 2016 1:00 AM
| Last Updated on Mon, Sep 4 2017 8:43 AM
విత్తనం వేస్తున్న రైతు
ఆత్మకూరు :
ఆత్మకూరుకు చెందిన రైతు కందుల లోకనాథరెడ్డి బుధవారం తన ఒంటెద్దు కళ్లకు గంతలు కట్టి, చేతి పగ్గాలు, కాడి పట్టెళ్లు లేకుండా తొమ్మిది గంటల వ్యవధిలో పదెకరాల్లో జొన్న విత్తనం వేశారు. రైతు చేపట్టిన ఈ విన్యాసాన్ని పలువురు ఆసక్తిగా చూశారు. సాయంత్రం గ్రామంలో ఎద్దుతో పాటు రైతునూ స్థానికులు ఊరేగించారు.