వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల ప్రమాణం నేడు
హైదరాబాద్: కొత్తగా ఎన్నికైన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు కోలగట్ల వీరభద్రస్వామి, పిల్లి సుభాష్‌చంద్రబోస్ ఈ నెల 30వ తేదీన పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వారిద్దరూ ఉదయం 10.30 గంటలకు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ ఎ.చక్రపాణి చాంబర్లో పదవీ ప్రమాణం చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి