Cauvery Hospital
-
కరుణానిధికి రాష్ట్రపతి పరామర్శ
సాక్షి, చెన్నై: ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డీఎంకే అధ్యక్షుడు కరుణానిధిని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పరామర్శించారు. హైదరాబాద్ నుంచి ఆదివారం మధ్యాహ్నం చెన్నై వచ్చిన ఆయన, తమిళనాడు గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్‌తో కలిసి నేరుగా ఆళ్వార్‌పేటలోని కావేరి ఆసుపత్రికి వెళ్లారు. కరుణానిధిని పరామర్శించిన అనంతరం డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్, ఎంపీ కనిమొళిలతో రాష్ట్రపతి కాసేపు మాట్లాడారు. కరుణానిధి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు కోవింద్ ట్విట్టర్లో తెలిపారు. జూలై 28 నుంచి కరుణానిధి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సహా పలువురు నేతలు ఆయనను పరామర్శించడం తెలిసిందే. కాగా కరుణానిధికి ఆరోగ్యం బాగాలేదనే బాధతో పుదుకోట్టై జిల్లా కరంబకుడికి చెందిన మూడో వార్డు డీఎంకే కార్యదర్శి మనోహరన్ ఆదివారం గుండె ఆగి మరణించినట్లు సమాచారం. కరుణానిధి ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి మనోహరన్ తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని ఆయన కుటుంబసభ్యులు చెప్పారు. -
నిలకడగా కరుణ ఆరోగ్యం
సాక్షి ప్రతినిధి, చెన్నై: డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్యం నిలకడగా ఉంది. చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స కొనసాగుతోంది. ఆదివారం రాత్రి కరుణానిధి ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడంతో ఒక్కసారిగా కుటుంబసభ్యులు, అభిమానుల్లో ఆందోళన నెలకొన్న విషయం తెలిసిందే. వైద్యుల చికిత్సతో ఆయన ఆరోగ్యం మెరుగైందని ఆ కాసేపటికి ఆసుపత్రి యాజమాన్యం ప్రకటించడంతో కొంతవరకు ఆందోళనలు తగ్గాయి. ప్రస్తుతం కరుణ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన కుమారుడు, డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ ప్రకటించారు. సోమవారం రాత్రి ఆసుపత్రి వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. ‘నిన్న రాత్రి ఆసుపత్రి యాజమాన్యం నాన్న ఆరోగ్యంపై ప్రకటన విడుదల చేసినప్పటి పరిస్థితే ఇప్పటికీ కొనసాగుతోంది. డాక్టర్లు ఇంటెన్సివ్ కేర్‌లో చికిత్స అందిస్తున్నారు’ అని తెలిపారు. కరుణానిధి ఆరోగ్యం ఒక్కసారిగా విషమించిందని, అయితే, వెంటనే తక్షణ చికిత్స అందించడంతో సాధారణ స్థాయికి వచ్చిందని ఆదివారం అర్ధరాత్రి కావేరీ ఆసుపత్రి ఒక ప్రకటన విడుదల చేయడం తెలిసిందే. సీఎం పరామర్శ మూడురోజుల పర్యటన నిమిత్తం సేలం జిల్లాకు వెళ్లిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి అర్ధాంతరంగా పర్యటన ముగించుకుని హడావుడిగా చెన్నైకి చేరుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, మరికొందరు మంత్రులు వెంటరాగా సోమవారం ఉదయం కావేరి ఆస్పత్రికి వెళ్లి స్టాలిన్‌ను కలుసుకుని కరుణ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం ఎడపాడి మీడియాతో మాట్లాడుతూ, కరుణకు చికిత్స జరుగుతోందని, కోలుకుంటున్నారని చెప్పారు. ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ సోమవారం చెన్నైకి వచ్చి కరుణను చూసి స్టాలిన్‌ను కలుసుకున్నారు. శ్రీలంక అధ్యక్షుడు, ప్రధాని తరఫున నలుగురు ప్రతినిధులు కావేరి ఆస్పత్రికి వచ్చారు. ఆగిన అభిమానుల గుండెలు తమ అభిమాన నేత కరుణానిధిని తలచుకుంటూ ఆవేదనకు గురై 8 మంది అభిమానుల గుండెలు ఆగిపోయాయి. ఓ అభిమాని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరో వ్యక్తి బలవన్మరణానికి ప్రయత్నించాడు. కొందరు డీఎంకే కార్యకర్తలు కరుణ కోలుకోవాలంటూ కావేరి ఆస్పత్రి ముందు గుండు కొట్టించుకుని దేవుళ్లకు మొక్కుకున్నారు. అనేకచోట్ల ప్రత్యేక ప్రార్థనలు చేశారు. -
ఆసుపత్రిలోనే కరుణ
►కొనసాగుతున్న చికిత్స ► శుక్రవారం డిశ్చార్జ్ కు అవకాశం సాక్షి, చెన్నై : డీఎంకే అధినేత ఎం కరుణానిధికి మంగళవారం ఆరో రోజుగా కావేరి ఆసుపత్రి వైద్యులు చికిత్స అందించారు. ఇన్ఫెక్షన్ కాకూడదన్న ఉద్దేశంతో ఆయన్ను చూడడానికి ఎవర్నీ అనుమతించ లేదు. పీఎంకే అధినేత రాందాసు, సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజాలతో పాటు పలువురు ఆసుపత్రికి చేరుకుని ఆరోగ్య పరిస్థితి గురించి విచారించారు. శ్వాస సంబంధిత ఇబ్బందులు, ఇన్ఫెక్షన్ కారణంగా ఈనెల పదిహేనో తేదీన కరుణానిధి రెండోసారిగా ఆళ్వార్ పేట కావేరి ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరిన విషయం తెలిసిందే. ఆయనకు వైద్య చికిత్సలు వేగవంతం చేశామని, రెండు మూడు రోజుల్లో ఇంటికి వెళ్ల వచ్చనట్టుగా వైద్య వర్గాలు ప్రకటించాయి. అయితే, కరుణానిధికి చికిత్స కొనసాగుతుండడంతో డీఎంకే వర్గాల్లో ఆందోళన కలుగుతోంది. వీరికి భరోసా ఇచ్చే విధంగా డీఎంకే దళపతి ఎంకే స్టాలిన్ స్పందిస్తూ వస్తున్నారు. మంగళవారం ఆయన డిశ్చార్జ్ కావచ్చన్న సంకేతాలు వెలువడ్డాయి. అందుకు తగ్గ పరిస్థితులు కానరాని దృష్ట్యా, తమఅధినేత ఎప్పుడు ఆసుపత్రి నుంచి బయటకు వస్తారోనన్న ఎదురు చూపులు డీఎంకే వర్గాల్లో పెరిగాయి. మంగళవారం కూడా కరుణానిధికి వైద్య చికిత్సలు కొనసాగించారు.ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గే వరకు ఆయన ఆసుపత్రిలో ఉండాల్సిన అవసరం ఉందని, అంత వరకు ఆయన్ను చూడడానికి ఎవ్వరికీ ఆసుపత్రి వర్గాలు అనుమతి ఇవ్వ లేదు. శుక్రవారం డిశ్చార్జ్ కు అవకాశం : కరుణానిధిని పీఎంకే అధినేత రాందాసు పరామర్శించేందుకు కావేరి ఆసుపత్రి వద్దకు మధ్యాహ్నం పన్నెండు గంటలకు వచ్చారు. ఆయన్ను డీఎంకే దళపతి ఎంకే స్టాలిన్ ఆహ్వానించారు. ఆయన వెంట పీఎంకే సీనియర్ నాయకుడు ఏకే.మూర్తి సైతం ఉన్నారు. పదిహేను నిమిషాల పాటు ఆసుపత్రి వద్ద ఉన్న రాందాసు తదుపరి మీడియాతో మాట్లాడారు. తన ప్రియ మిత్రుడి ఆరోగ్యం మెరుగు పడుతున్నదని పేర్కొన్నారు. వందేళ్ల పాటుగా సంపూర్ణ ఆరోగ్యంగా మన ముందు ఆయన ఉండాలని ఆకాంక్షిస్తున్నట్టు వ్యాఖ్యానించారు. ఇన్ఫెక్షన్ సమస్య ఉన్నందున, కరుణానిధిని తాను చూడ లేదన్నారు. ఇంటికి వచ్చాక, వెళ్లి పరామర్శిస్తానన్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శి , ఎంపీ డి.రాజా కరుణను పరామర్శించేందు కావేరి ఆసుపత్రి వద్దకు చేరుకుని, కాసేపు అక్కడే ఉన్నారు. తదుపరి మీడియాతో మాట్లాడుతూ, కరుణానిధి ఆరోగ్యం మెరుగు పడుతున్నదని, శుక్రవారం డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు కుటుంబీకులు, వైద్యులు పేర్కొన్నట్టు చెప్పారు. ఇక, కరుణానిధిని బీజేపీ నేత మోహన్ రాజులు, మాజీ ఐఎఎస్ అధికారి చంద్రలేఖ, సినీ దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్, హాస్య నటుడు వివేక్, మాజీ ఎంపీ విశ్వనాథన్ పరామర్శించేందుకు వచ్చిన వారిలో ఉన్నారు. మూడున జల్లికట్టు కోసం ఆందోళన : డీఎంకే నేతృత్వంలో జనవరి మూడో తేదీన జల్లికట్టు సాధన లక్ష్యంగా మధురై జిల్లా అలంగానల్లూరులో ఆందోళన కార్యక్రమం జరగనుంది. ఈ మేరకు డీ ఎంకే దళపతి ఎంకే స్టాలిన్ ప్రకటించా రు. అన్ని పార్టీల నేతలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. పార్టీ ప్రధాన కార్యదర్శి అన్భళగన్ తో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. -
పరామర్శల హోరు
మెరుగ్గా కరుణ ఆరోగ్యం సాక్షి, చెన్నై : డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్యం మరింత మెరుగు పడ్డట్టు కావేరి ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. అలాగే, అధినేత ఆరోగ్యంగా ఉన్నారని ఆందోళన వద్దంటూ కేడర్‌కు డీఎంకే దళపతి ఎంకే స్టాలిన్ భరోసా ఇచ్చారు. శ్వాస సమస్య, గొంతు ఇన్ఫెక్ష¯ŒSతో డీఎంకే అధినేత ఎం కరుణానిధి మరో మారు ఆళ్వార్‌పేటలోని కావేరి ఆసుపత్రిలో గురువారం చేరిన విషయం తెలిసిందే. ఆయనకు ఆసుపత్రి వర్గాలు తీవ్ర చికిత్స అందిస్తూ వచ్చాయి. నాలుగో రోజు ఆదివారం కరుణానిధి ఆరోగ్యం మరింత మెరుగు పడ్డట్టు ఆసుపత్రి వర్గాలు ప్రకటిం చాయి. సహజరీతిలో శ్వాస తీసుకుంటున్నారని, ఒకటి రెండు రోజు ల్లో డిశ్చార్జ్ అవకాశాలు ఉన్నట్టు పేర్కొన్నాయి. కరుణ ఆరోగ్యం మెరుగుపడడంతో పార్టీ కార్యక్రమాలపై డీఎంకే కోశాధికారి, ప్రధాన ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ దృష్టి పెట్టారు. ఆదివారం నామక్కల్‌లో యువజన విభాగం నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో స్టాలిన్ ప్రసంగిస్తూ అధినేత ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు ప్రకటించారని, ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేడర్‌కు సూచించారు. ఇక, ఆ కార్యక్రమం వేదికగా యువత, విద్యార్థులు రాజకీయాల వైపు మొగ్గు చూపించాలని స్టాలిన్ పిలుపునిచ్చారు. ఇక, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరుణానిధిని పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి, డీఎంకే ప్రధాన కార్యదర్శి అన్భళగన్, తమిళ మానిల కాంగ్రెస్ నేత జీకే వాసన్, వర్తక సమాఖ్య నేత విక్రమరాజా, తమిళర్ వాల్వురిమై కట్చి నేత వేల్ మురుగన్, కాంగ్రెస్ నేతలు కేవీ తంగబాలు, కుమరి ఆనందన్, వ్యవసాయ సంఘం నేత పీఆర్.పాండియన్, దక్షిణ భారత నటీ నటుల సంఘం కార్యదర్శి విశాల్, హాస్య నటుడు వడివేలు పరామర్శించారు. ఆసుపత్రి ఆవరణలో కరుణ గారాల పట్టి కనిమొళి, డీఎంకే బహిష్కృత నేత, కరుణ పెద్దకుమారుడు అళగిరిల వద్ద ఆరోగ్య పరిస్థితి గురించి విచారించారు. వైద్యులతో మాట్లాడారు. ఈసందర్భంగా మీడియాతో నారాయణస్వామి మాట్లాడుతూ సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా కరుణానిధి ప్రజాసేవకు మళ్లీ అంకితం కావాలని ఆకాంక్షించారు. వైద్యుల్ని సంప్రదించామని, రెండు, మూడు రోజుల్లో ఆయన ఇంటికి చేరుకునే అవకాశాలు ఉన్నట్టు పేర్కొన్నారు. తమిళ మానిల కాంగ్రెస్ నేత జీకే వాసన్ మాట్లాడుతూ ఆరోగ్యంగా కరుణానిధి ఉన్నారని, ప్రజలకు, డీఎంకేకు ఆయన సేవలు కొనసాగాలని, వంద శాతం సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఆయన ఆసుపత్రి నుంచి బయటకు రావాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, కరుణానిధి ఆరోగ్య పరిస్థితిపై అన్నాడీఎంకే తరఫున రాష్ట్ర మంత్రి జయకుమార్, ఎంపీ, పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ తంబిదురై ఆసుపత్రికి వచ్చి విచారించడం ఆరోగ్యకర, నాగరికతతో కూడిన రాజకీయ వాతావరణానికి నాందిగా డీఎంకే సీనియర్ నేత దురైమురుగన్ వ్యాఖ్యానించారు. ఇందుకుగాను చిన్నమ్మ శశికళను అభినందించారు. ఇక, కరుణానిధిని పరామర్శించేందుకు ఆసుపత్రికి వచ్చిన ఎండీఎంకే నేత వైగోను డీఎంకే వర్గాలు అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలకు పాల్పడ వద్దని కేడర్‌కు విజ్ఞప్తి చేశారు. వైగోను డీఎంకే వర్గాలు అడ్డుకున్న సమాచారంతో స్టాలిన్ విచారం వ్యక్తం చేయడాన్ని తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ ఆహ్వానించారు. -
ఆస్పత్రి నుంచి కరుణానిధి డిశ్చార్జ్
-
ఆస్పత్రి నుంచి కరుణానిధి డిశ్చార్జ్
చెన్నై: గత వారం రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు మాజీ సీఎం, డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడింది. చెన్నైలో తాను చికిత్స పొందిన కావేరీ హాస్పిటల్ నుంచి బుధవారం రాత్రి కరుణానిధి డిశ్చార్జ్ అయ్యారు. డీఎంకే చీఫ్ ఆరోగ్యం మెరుగైందని అందుకే ఆయనను డిశ్చార్జ్ కావాలని సూచించినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కొన్ని రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని సలహా ఇచ్చినట్లు వైద్యులు చెప్పారు. మరోవైపు కరుణానిధి అనారోగ్యం కోలుకుని ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్తున్నారన్న విషయం తెలియగానే డీఎంకే నేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. డిసెంబర్ 1వ తేదీన డీహైడ్రేషన్, అలర్జీ సంబంధిత అనారోగ్య కారణాలతో కరుణానిధి చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. -
ఆరోగ్యంగా కరుణ
► కోలుకున్న నేతలు ►అన్నాడీఎంకే, డీఎంకే వర్గాల ప్రకటన ►కరుణకు పరామర్శలు సాక్షి, చెన్నై : కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డీఎంకే అధినేత ఎం.కరుణానిధి సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్టు ఆ పార్టీ వర్గాలు ప్రకటించారుు. ఆయన ఆరోగ్యం మెరుగు పడిందని సోమ లేదా మంగళవారం డిశ్చార్జ్ అయ్యే అవకాశాలున్నట్టు పేర్కొంటున్నారుు. ఇలా ఉండగా పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి ఆదివారం ఉదయం కావేరి ఆసుపత్రి వద్దకు చేరుకుని కరుణానిధి ఆరోగ్యం గురించి ఆయన కుమార్తె, ఎంపీ కనిమొళి వద్ద విచారించారు. వైద్య చికిత్సలు అందిస్తున్న డాక్టర్ గోపాల్‌తో మాట్లాడారు. తదుపరి మీడియాతో మాట్లాడుతూ, కరుణానిధి ఆరోగ్యంగానే ఉన్నారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎప్పుడు పార్టీ వర్గాలతో, కార్యకర్తలతో మమేకమై ఉండే కరుణానిధి మరికొద్ది రోజుల్లో మళ్లీ తన బాటలో పయనిస్తారని వ్యాఖ్యానించారు. ఇక, సీపీఎం నేత జి.రామకృష్ణన్, సీపీఐ నేత తిరుమావళవన్ కావేరి ఆసుపత్రికి చేరుకుని కరుణ ఆరోగ్యంపై డాక్లర్ల వద్ద విచారించారు. ఇక, దక్షిణ భారత చలన చిత్ర సూపర్‌స్టార్ రజనీకాంత్ కరుణానిధి ఆరోగ్యం గురించి డీఎంకే కోశాధికారి ఎంకే.స్టాలిన్‌కు ఫోన్ చేసి ఆరోగ్య సమాచారం తెలుసుకున్నారు. -
నిలకడగా బాలచందర్ ఆరోగ్యం
ప్రఖ్యాత సినీ దర్శకుడు కె.బాలచందర్ నగరంలోని కావేరి ఆస్పత్రిలో అత్యవసర వైద్య విభాగంలో చికిత్స పొందుతున్నారు. కిడ్నీ సమస్య మినహా మిగతా అన్ని అవయవాలు కుదుటపడినట్లు వైద్యులు మంగళవారం సాయంత్రం విడుదల చేసిన బులెటన్లో వెల్లడించారు. కిడ్నీలకు డయాలసిస్ చికిత్స అంది స్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం బాలచందర్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడిం చారు. పలువురు సినీ ప్రముఖులు బాలచందర్‌ను ఆస్పత్రిలో కలిసి పరామర్శించారు. డీఎంకే నేత స్టాలిన్, విజయకుమార్, నటి కె ఆర్ విజ య, రాజేష్, తమిళనాడు దర్శకుల సంఘం అధ్యక్షుడు విక్రమన్ మొదలగు పలువురు కె.బాలచందర్‌ను పరామర్శించారు. కె ఆర్ విజయ బాలచందర్‌ను చూసి బోరున విలపించారు. ఆయన త్వరగా కోలుకుని ఇంటికి చేరాలని ఆమె ఆకాంక్షించారు.