► కోలుకున్న నేతలు
►అన్నాడీఎంకే, డీఎంకే వర్గాల ప్రకటన
►కరుణకు పరామర్శలు
సాక్షి, చెన్నై : కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డీఎంకే అధినేత ఎం.కరుణానిధి సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్టు ఆ పార్టీ వర్గాలు ప్రకటించారుు. ఆయన ఆరోగ్యం మెరుగు పడిందని సోమ లేదా మంగళవారం డిశ్చార్జ్ అయ్యే అవకాశాలున్నట్టు పేర్కొంటున్నారుు. ఇలా ఉండగా పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి ఆదివారం ఉదయం కావేరి ఆసుపత్రి వద్దకు చేరుకుని కరుణానిధి ఆరోగ్యం గురించి ఆయన కుమార్తె, ఎంపీ కనిమొళి వద్ద విచారించారు. వైద్య చికిత్సలు అందిస్తున్న డాక్టర్ గోపాల్‌తో మాట్లాడారు. తదుపరి మీడియాతో మాట్లాడుతూ, కరుణానిధి ఆరోగ్యంగానే ఉన్నారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎప్పుడు పార్టీ వర్గాలతో, కార్యకర్తలతో మమేకమై ఉండే కరుణానిధి మరికొద్ది రోజుల్లో మళ్లీ తన బాటలో పయనిస్తారని వ్యాఖ్యానించారు. ఇక, సీపీఎం నేత జి.రామకృష్ణన్, సీపీఐ నేత తిరుమావళవన్ కావేరి ఆసుపత్రికి చేరుకుని కరుణ ఆరోగ్యంపై డాక్లర్ల వద్ద విచారించారు. ఇక, దక్షిణ భారత చలన చిత్ర సూపర్‌స్టార్ రజనీకాంత్ కరుణానిధి ఆరోగ్యం గురించి డీఎంకే కోశాధికారి ఎంకే.స్టాలిన్‌కు ఫోన్ చేసి ఆరోగ్య సమాచారం తెలుసుకున్నారు.
ఆరోగ్యంగా కరుణ
Published Mon, Dec 5 2016 2:43 AM | Last Updated on Mon, Sep 4 2017 9:54 PM
Advertisement
Advertisement