అక్రమాస్తుల కేసులో మాజీ ప్రభుత్వ అధికారికి జైలు
న్యూఢిల్లీ: ఉద్యోగంలో ఉండగా రూ.24.88 లక్షల అక్రమాస్తులను సంపాదించిన ఓ ప్రభుత్వ మాజీ అధికారికి స్థానిక కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. టెలికమ్యూనికేషన్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్‌లో 1965 నుంచి 2001 మధ్య కాలంలో ప్రాజెక్ట్ డెరైక్టర్‌గా పనిచేసిన వీరేందర్ సింగ్‌కి ప్రత్యేక సీబీఐ జడ్జి సంజీవ్ జైన్ రూ.ఐదు లక్షల జరిమానా విధించారు. తన ఉద్యోగ కాలంలో రూ.31.14 లక్షల అక్రమాస్తులు సంపాదించినట్టు సీబీఐ కోర్టుకి వివరించింది.