ccb arrested
-
గాలి జనార్దనరెడ్డికి బెయిలు
సాక్షి బెంగళూరు: యాంబిడంట్ ముడుపుల కేసులో గత ఆదివారం అరెస్టయిన కర్ణాటక మాజీ మంత్రి, గనుల వ్యాపారి గాలి జనార్దనరెడ్డికి బుధవారం బెయిలు మంజూరైంది. దీంతో బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. జనార్దనరెడ్డి తరపు న్యాయవాది చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ ఈ కేసులో సీసీబీ (కేంద్ర నేర విచారణ విభాగం) సక్రమంగా వ్యవహరించలేదనీ, ప్రభుత్వ ఒత్తిళ్లకు తలొగ్గి జనార్దనరెడ్డిని అరెస్టు చేశారని ఆరోపించారు. కాగా, తనకు ప్రాణహాని ఉందనీ, రక్షణ కల్పించాలంటూ హోం మంత్రి పరమేశ్వరను జనార్దనరెడ్డి కోరారు. -
గాలి జనార్దన రెడ్డి అరెస్టు
సాక్షి బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, గనుల వ్యాపారి గాలి జనార్దన రెడ్డి యాంబిడంట్ కంపెనీ ముడుపుల కేసులో అరెస్టయ్యారు. ఈ కేసుకు సంబంధించి విచారణను ఎదుర్కొనేందుకు శనివారం సాయంత్రమే జనార్దన రెడ్డి బెంగళూరులోని సీసీబీ (కేంద్ర నేర విభాగం) పోలీసు కార్యాలయానికి రావడం తెలిసిందే. శనివారం అర్ధరాత్రి 2 గంటల వరకు జనార్దన రెడ్డిని ప్రశ్నించామనీ, ఆదివారం ఉదయం కూడా విచారణను కొనసాగించి 9 గంటల సమయంలో అరెస్టు చేశామని అదనపు పోలీస్ కమిషనర్ అలోక్ కుమార్ చెప్పారు. అనంతరం ఆయనకు వైద్య పరీక్షలు చేయించి, 6వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరచగా 24 వరకు జనార్దన రెడ్డికి జ్యుడీíషియల్ కస్టడీ విధిస్తూ ఆదేశాలిచ్చారు. దీంతో ఆయనను పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు తరలించారు. ఐపీసీ సెక్షన్లు 120, 204, 420లకింద కేసులు నమోదు చేశారు. కాగా జనార్దన రెడ్డికి, యాంబిడంట్ సంస్థకు ఎలాంటి సంబంధమూ లేదని ఆయన తరఫు న్యాయవాది చంద్రశేఖర రెడ్డి తెలిపారు. కాగా, ఇదే కేసులో పోలీసుల అదుపులో ఉన్న జనార్దన రెడ్డి వ్యక్తిగత సహాయకుడు అలీఖాన్‌ను ఆదివారం విడుదల చేశారు. అయితే తన యజమాని అరెస్టయినందున తాను కూడా జైలులోనే ఉంటానని అలీఖాన్ చెప్పడం గమనార్హం. ఏమిటీ యాంబిడంట్ కేసు? 2016లో సయ్యద్ అహ్మద్ ఫరీద్ అనే బడా వ్యాపారి ఆధ్వర్యంలో యాంబిడంట్ పేరుతో గొలుసుకట్టు పెట్టుబడుల వ్యాపారం ప్రారంభమైంది. నాలుగు నెలలకే పెట్టుబడిపై 50 శాతం రాబడి ఉంటుందంటూ రూ. 600 కోట్లను రాబట్టి అనంతరం చేతులెత్తేసింది. ఈడీ, ఐటీ అధికారులు ఫరీద్‌పై కేసులు నమోదు చేశారు. వీటి నుంచి బయటపడేస్తానంటూ జనార్దన రెడ్డి తన పీఏ ద్వారా ఫరీద్‌తో రూ. 25 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నారనేది ఆయనపై ఉన్న ఆరోపణ. ఇందులో భాగంగా రూ.18 కోట్లను చెందిన బంగారం వ్యాపారి రమేష్ కొఠారి ఖాతాకు జమ చేశారని తేలింది. ఆ సొమ్ముతో 57 కిలోల బంగారం కొన్నారు. రమేష్‌ను విచారణ చేయగా అలీఖాన్‌కు బంగారం అందించినట్లు చెప్పాడు. -
బ్లాక్‌మనీ వైట్ మనీగా మార్చాలని ఘరానామోసం
బెంగళూరు : బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చాలని అమాయకులను మోసం చేస్తున్న ఐదుగురుని బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను తమిళనాడుకు చెందిన జయకుమార్, పాండిచ్చేరికి చెందిన రాజన్ అలియాస్ రాజ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అల్తాఫ్, శ్రీనివాస్, శ్రీనివాసులుగా గుర్తించినట్లు సీసీబీ పోలీసులు శుక్రవారం చెప్పారు. నిందితుల నుంచి విలువైన కారు, మొబైల్ ఫోన్లు, వివిధ పత్రాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. వివరాలు.. బెంగళూరులో నివాసముంటున్న రవికిరణ్ అనే వ్యక్తిని జయకుమార్, రాజన్ సంప్రదించారు. తమ దగ్గర రూ. 30 వేల కోట్ల బ్లాక్ మనీ ఉందని, దానికి వైట్ మనీగా మార్చి ఇవ్వాలని చెప్పారు. 75 శాతం నగదు వైట్ మనీ చేసి ఇవ్వాలని అన్నారు. మిగిలిన 15 శాతం వివిధ ట్రస్ట్‌ల నిర్వహణకు, 10 శాతం నగదు మార్చి ఇచ్చే మద్య వర్థులకు పంచి పెడుతామని నమ్మించారు. మీరు వైట్ మనీగా మార్చడానికి అవసరం అయిన ప్రాససింగ్ ఫీజు, మా ట్రస్ట్ పత్రాలు పరిశీలించడానికి, ఈ వ్యవహారం మాట్లాడటానికి జయనగరలోని పవిత్ర హోటల్ దగ్గరకు రావాలని రవికిరణ్‌కు చెప్పారు. అందరు కలిసి పవిత్ర హోటల్లో కుర్చున్నారు. విషయం తెలుసుకున్న సీసీబీ పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. వీరు ఈ విధంగా ఆరు నెలల నుంచి బెంగళూరు, చెన్నయ్‌లో ఇలా మోసం చే స్తున్నాని బెంగళూరు సీసీబీ పోలీసులు తెలిపారు.