బెంగళూరు : బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చాలని అమాయకులను మోసం చేస్తున్న ఐదుగురుని బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను తమిళనాడుకు చెందిన జయకుమార్, పాండిచ్చేరికి చెందిన రాజన్ అలియాస్ రాజ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అల్తాఫ్, శ్రీనివాస్, శ్రీనివాసులుగా గుర్తించినట్లు సీసీబీ పోలీసులు శుక్రవారం చెప్పారు. నిందితుల నుంచి విలువైన కారు, మొబైల్ ఫోన్‌లు, వివిధ పత్రాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. వివరాలు.. బెంగళూరులో నివాసముంటున్న రవికిరణ్ అనే వ్యక్తిని జయకుమార్, రాజన్ సంప్రదించారు. తమ దగ్గర రూ. 30 వేల కోట్ల బ్లాక్ మనీ ఉందని, దానికి వైట్ మనీగా మార్చి ఇవ్వాలని చెప్పారు. 75 శాతం నగదు వైట్ మనీ చేసి ఇవ్వాలని అన్నారు.
మిగిలిన 15 శాతం వివిధ ట్రస్ట్‌ల నిర్వహణకు, 10 శాతం నగదు మార్చి ఇచ్చే మద్య వర్థులకు పంచి పెడుతామని నమ్మించారు. మీరు వైట్ మనీగా మార్చడానికి అవసరం అయిన ప్రాససింగ్ ఫీజు, మా ట్రస్ట్ పత్రాలు పరిశీలించడానికి, ఈ వ్యవహారం మాట్లాడటానికి జయనగరలోని పవిత్ర హోటల్ దగ్గరకు రావాలని రవికిరణ్‌కు చెప్పారు.
అందరు కలిసి పవిత్ర హోటల్‌లో కుర్చున్నారు. విషయం తెలుసుకున్న సీసీబీ పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. వీరు ఈ విధంగా ఆరు నెలల నుంచి బెంగళూరు, చెన్నయ్‌లో ఇలా మోసం చే స్తున్నాని బెంగళూరు సీసీబీ పోలీసులు తెలిపారు.
బ్లాక్‌మనీ వైట్ మనీగా మార్చాలని ఘరానామోసం
Published Sat, Nov 29 2014 4:03 AM | Last Updated on Wed, Apr 3 2019 5:16 PM
Advertisement