White Money
-
బ్లాక్ & వైట్
‘నల్ల’ రాకాసికి తెల్లరంగు వేసే మార్గాలెన్నో! పెద్ద నోట్ల రద్దు కష్టాలు సామాన్యులకే.. ►దర్జాగా దందా నడిపిస్తున్న నల్లకుబేరులు ►కోట్లకు కోట్లు మార్చుకుంటున్న అక్రమార్కులు ►ఇప్పటివరకు పట్టుబడిన నల్లడబ్బులో రూ. 400 కోట్లు కొత్త నోట్లే ‘నల్లధనాన్ని తెల్లధనంగా మార్చడం ఎలా?’ నోట్ల రద్దు ప్రకటన అనంతరం గూగుల్‌లో భారత్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన అంశమిది. అందులో అగ్రస్థానంలో ఉన్నది ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రం గుజరాత్. ఆ తర్వాతి స్థానాల్లో.. మహారాష్ట్ర, హరియాణా, పంజాబ్, ఢిల్లీలు ఉన్నాయి. ఇప్పటిదాకా ఏయే మార్గాల్లో నల్లధనాన్ని ‘తెల్ల’గా మార్చారో ఓసారి చూద్దాం... (సాక్షి నాలెడ్జ్సెంటర్) : శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు – అనే మన సామెత ఊరకే పుట్టలేదు. ‘నల్లధనాన్ని, అవినీతిని ఊడ్చిపారేస్తా’నంటూ మోదీ సర్కారు పెద్ద నోట్లను రద్దుచేశారు. దీంతో అమాయకులైన సామాన్యులు నోట్ల మార్పిడి కోసం బ్యాంకుల ముందు బారులు తీరుతున్నారు. ఒక్క కొత్త నోటు కోసం రోజూ గంటల తరబడి కిలోమీటర్ల క్యూల్లో నిలువుకాళ్లపై నిలుచుంటున్నారు. ఈ క్రమంలో అల్పజీవులు ప్రాణాలూ కోల్పోతున్నారు. కానీ.. ఒక్క అక్రమార్కుడూ ఆ క్యూల్లో కనిపించడు. ఒక్క అవినీతి పరుడూ నోట్ల రద్దుకు వెరవలేదు. తమ నల్లరాశులను దొడ్డిదారుల్లో దర్జాగా మార్పిడి చేసుకుంటున్నారు. అందుకు అనేక మార్గాలను కనుగొంటున్నారు. వారికి బ్యాంకు అధికారులు, పోలీసుల నుంచీ కావలసినంత సాయం లభిస్తోంది. దేశవ్యాప్తంగా ఆదాయ పన్ను శాఖ, సీబీఐ, పోలీసు అధికారుల దాడుల్లో కట్టల కొద్దీ బయటపడుతున్న నల్లధనంలో కొత్త నోట్ల వాటా భారీగానే కనిపిస్తోంది. అనేక ఆంక్షలతో పరిమితంగా విడుదల చేసిన కొత్త నోట్లు అనతికాలంలో నల్లకుబేరుల భోషాణాలకు కోట్లల్లో చేరడం విస్తుగొలుపుతోంది. నోట్లు రద్దు చేసిన నవంబర్ 8వ తేదీ తర్వాత డిసెంబర్ 19వ తేదీ వరకూ దేశవ్యాప్తంగా 677 దాడులు నిర్వహించారు. పాత, కొత్త నోట్లు, బంగారం అన్నీ కలిపి దాదాపు రూ. 3,185 కోట్ల విలువైన లెక్కలో లేని ఆదాయం (నల్లధనం) దొరికిందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఇలా చిక్కిన నల్లధనంలో రూ. 400 కోట్లు కొత్త నోట్లే ఉన్నాయని అంచనా. అయితే.. ప్రభుత్వ వర్గాలు మాత్రం కొత్త నోట్ల మొత్తం రూ. 86 కోట్లుగా లెక్కిస్తున్నాయి. ఏదేమైనా.. ఈ దాడుల్లో దొరుకుతున్న కొత్త నోట్లను చూస్తే.. పెద్ద నోట్ల రద్దు అనంతరం నల్లధనం భారీ స్థాయిలోనే రూపు మార్చుకుందని నిపుణులు చెప్తున్నారు. అయితే.. మొత్తంగా ఎంత నల్లధనం రంగు మారివుంటుందన్నది మాత్రం అంచనా వేయలేకపోతున్నారు. హుండీల్లో ‘గుప్త’ దానం.. దేవుడి గుళ్లలోని హుండీల్లో రహస్యంగా దానం చేయడం ఒక మార్గం. వెండి, బంగారం, పాత నోట్లను ఈ హుండీల్లో పెద్ద ఎత్తున సమర్పించారు. హుండీల్లో డబ్బుకు ఎలాంటి పన్నూ ఉండదు. దీంతో పెద్ద నోట్ల రద్దు అనంతరం దేశవ్యాప్తంగా దేవాలయాల ఆదాయం ఒక్కసారిగా పెరిగిపోయింది. నవంబర్ 8వ తేదీ తర్వాత పది రోజుల్లో తిరుమలలో హుండీ విరాళాలు రూ.30.36 కోట్లు వచ్చాయి. గత ఏడాది అదే పది రోజులకన్నా రూ.8 కోట్లు పెరిగింది. ముంబైలోని సిద్దివినాయక ఆలయంలో ఆదాయం రెట్టింపయింది. కేరళలోని శబరిమల ఆలయంలో గతేడాది ఇదే కాలానికన్నా రూ.2 కోట్లు అధికంగా రూ.13 కోట్ల ఆదాయం వచ్చింది. వెల్లూరులోని జలకంఠేశ్వరాలయానికి సాధారణంగా రూ.10 వేల చొప్పున విరాళాలు లభిస్తాయి. నోట్ల రద్దు అనంతరం హుండీలో రూ.500, రూ.1000 నోట్ల కట్టల రూపంలో రూ.44 లక్షలు ప్రత్యక్షమయ్యాయి. హుండీలో పడే ఈ నల్లధనాన్ని ఆలయాల నిర్వాహకులు గుప్త దానాలుగా చూపిస్తాయి. వాటిని కొత్త కరెన్సీ నోట్లలోకి మార్చుకుంటాయి. అందులో కొంత మొత్తాన్ని కమీషన్‌గా ఉంచుకుని.. మిగతా మొత్తాన్ని సంబంధిత ‘గుప్తదాత’కు తిరిగి ఇచ్చేస్తాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో చాలా చోట్ల ఈ హుండీ దందా నడుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కార్మికులను క్యూల్లో నిల్చోబెట్టి.. పంజాబ్‌లోని లూధియానాలో బజాజ్ అండ్ సన్స్ అనే ఆటోమొబైల్ విడిభాగాల తయారీ సంస్థ యజమాని వద్ద రూ.1.2 కోట్ల నల్లడబ్బు దొరికింది. అందులో రూ.72 లక్షలు కొత్త నోట్లు. తన సంస్థలో పనిచేసే కార్మికులను బ్యాంకులకు పంపించి, వారి పేర్లతో పాత నోట్లను మార్చినట్లు ఆ సంస్థ యజమాని ఎస్.బజాజ్ వెల్లడించినట్లు చెప్తున్నారు. దినసరి వేతన కార్మికులకు రోజువారీ కూలీ చెల్లించి ఇలా క్యూల్లో నిల్చోబెట్టి పాత నల్ల నోట్లను మార్చుకున్న ఉదంతాలు కోకొల్ల లుగా ఉన్నాయి. వ్యాపారుల ‘చేతి’లో డబ్బు.. నిర్మాణ రంగం, ఆటోమొబైల్ రంగం వంటి చాలా వ్యాపార సంస్థలకు రోజువారీ లావాదేవీల కోసం డబ్బు రూపంలో పెద్ద మొత్తాలను ఉంచుకునే వెసులుబాటు ఉంది. వాటికి నగదు రూపంలో చెల్లింపులు భారీగా వస్తుంటాయి. ఇటువంటి సంస్థలు.. రద్దయిన నోట్ల రూపంలోని నల్లధనాన్ని తీసుకుని ‘చేతిలో డబ్బు’పేరుతో బ్యాంకుల్లో జమచేస్తున్నాయి. ఇలా మార్పిడి చేసినందుకు 20 నుంచి 40 శాతం కమీషన్ తీసుకుంటున్నాయి. ఇలాంటి సంస్థలు తమ త్రైమాసిక పద్దులను సమర్పించడానికి డిసెంబర్ 30 వరకూ సమయముంది. కాబట్టి అలాంటి సంస్థలు తమ పద్దులను ‘సరి’చేసుకోవడానికి ఇంకా ఐదు రోజుల సమయముంది. ఎన్నికల్లో పంపిణీ.. మహారాష్ట్రలో ఇటీవల 147 పురపాలక సంఘాలకు జరిగిన ఎన్నికల్లో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు.. పాత నోట్ల రూపంలో ఉన్న నల్లధనాన్ని ఓట్ల కొనుగోలుకు పెద్ద ఎత్తున పంపిణీ చేశారు. ఒక్కో ఓటుకు రూ.2,000 నుంచి రూ.2,500 వరకూ పంచారు. ఈ నోట్లు అందుకున్న వారు వాటిని తమ తమ బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకున్నారు. బ్యాంకుల నుంచే నేరుగా.. నల్లధనాన్ని తెల్లగా మార్చడం లో జాతీయ బ్యాం కులు, సహకార బ్యాంకుల పాత్ర కూడా ఉంది. రాజస్తాన్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీ ర్ అండ్ జైపూర్ దౌసా బ్రాంచిలో నకిలీ ఐడీ కార్డు లు ఉపయోగించి రూ.కోటి మేరకు పాత నోట్లను కొత్త నోట్లుగా మార్చిన ఆరోపణలతో బ్యాంక్ హెడ్ క్యాషియర్‌ను నవంబర్ 30న సస్పెండ్ చేశారు. మహారాష్ట్రలోని లాతూర్ జిల్లా ఉద్గిర్లో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఉద్యోగులు నలుగురు 30 శాతం కమీషన్ తీసుకుని.. ఇతర వినియోగదారుల ఖాతాల్లో లెక్కరాసి.. రూ. 20 లక్షల విలువైన పాత నోట్లను కొత్త నోట్లుగా మార్చారు. ప్రైవేట్ కార్పొరేట్ బ్యాంక్ అయిన యాక్సిస్ బ్యాంకు నోయిడా బ్రాంచిలో నకిలీ సంస్థల డైరెక్టర్ల పేర్లతో 20 బ్యాంకు ఖాతాలను తెరిచి రూ. 60 కోట్ల నల్లధనాన్ని డిపాజిట్ చేసినట్లు, చాందినీ చౌక్ (ఢిల్లీ) బ్రాంచిలో 44 నకిలీ ఖాతాలు తెరిచి రూ.100 కోట్ల మేర డిపాజిట్ చేసినట్లు ఐటీ దాడుల్లో వెలుగుచూడటం సంచలనం సృష్టించింది. ఇక రాజకీయ నియంత్రణలో ఉండే సహకార బ్యాంకుల్లో పాత నోట్ల డిపాజిట్లు అమాంతం పెరిగిపోయాయి. ఈ బ్యాంకుల్లో ఖాతాదారుల పూర్తి వివరాలు నమోదు చేసేదే తక్కువ. పశ్చిమబెంగాల్ లోని రాణిగంజ్‌లో ఒక సహకార బ్యాంకులో పది రోజుల్లోనే రూ.42 కోట్లు డిపాజిట్ అయ్యాయి. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో రూ.47 కోట్లు ఎలాంటి ఆధారం లేకుండా మార్చినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇక టీటీడీ మాజీ సభ్యుడు శేఖర్‌రెడ్డి వద్ద దొరికిన రూ.100 కోట్ల నల్లధనంలో రూ.10 కోట్లు కొత్త కరెన్సీ నోట్లే. అవి నేరుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒక బ్యాంకు నుంచే అతనికి అందినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా ఢిల్లీలోని కోటక్ మహీంద్రా బ్యాంక్ కస్తూర్బా గాంధీ మార్గ్ బ్రాంచిలోనూ అక్రమ లావాదేవీల ఆరోపణలపై ఐటీ దాడులు నిర్వహించింది. బంగారంలోకి మార్పిడి.. నోట్ల రద్దు ప్రకటన వెలువడిన రోజు రాత్రి హైదరాబాద్ సహా దేశంలోని అనేక ప్రాంతాల్లో బంగారం కొనుగోళ్లు, అమ్మకాలు పెద్ద ఎత్తున సాగాయి. నగల దుకాణాల్లో పాత నోట్లను తీసుకుని.. పాత తేదీలతో విక్రయాలు జరిపినట్లు పద్దులు రాసేశారు. అయితే.. మార్కెట్ రేటుకన్నా అధికంగా రేట్లు తీసుకున్నారు. ఉదాహరణకు.. ఒక వ్యాపారి 5,000 మంది కస్టమర్లు ఒక్కొక్కరూ 5 లక్షల బంగారం కొనేందుకు రూ. 2 లక్షల చొప్పున అడ్వాన్సులు ఇచ్చారని లెక్క రాసి రూ. 100 కోట్ల మేర పాత నోట్లను చిన్న మొత్తాలుగా బ్యాంకుల్లో జమ చేస్తారు. రాజస్తాన్‌లో రశీదులు లేకుండా వ్యాపారం చేసే కొందరు నగల వ్యాపారులు ఇలాంటి నల్లకుబేరులకు నకిలీ బంగారాన్ని అంటగట్టిన ఉదంతాలూ వెలుగుచూశాయి. ఢిల్లీలోని బంగారం మార్కెట్‌పై ఐటీ విభాగం తాజాగా నిర్వహించిన సోదాల్లో రూ. 250 కోట్ల విలువైన బంగారం విక్రయాలు అక్రమంగా సాగినట్లు గుర్తించారు. 677 నవంబర్ 8 నుంచి డిసెంబర్ 19 వరకూ ఐటీ, పోలీస్, సీబీఐ తదితర సంస్థలు చేసిన దాడులు రూ.3,185 కోట్లు ఈ దాడుల్లో స్వాధీనం చేసుకున్న లెక్కలో లేని నగదు, బంగారం రూ.400 కోట్లు ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న కొత్త నోట్ల విలువ ఇంకా ఎన్నెన్ని దారులో.. రాజకీయ పార్టీలు నల్లధనాన్ని పాత తేదీలతో విరాళాలుగా రాసేసి బ్యాంకుల్లో డిపాజిట్ చేసినట్టు వార్తలు వచ్చాయి. పోస్టాఫీసుల్లో తప్పుడు ధ్రువపత్రాలతో భారీగా పాత నోట్లను మార్చిన ఉదంతాలు చాలా వెలుగుచూశాయి. ఆర్టీసీ బస్సుల్లో వచ్చే చిన్న నోట్లు, చిల్లర స్థానంలో రద్దయిన పెద్ద నోట్లు పెట్టేసి లెక్కలు రాసిన ఉదంతాలూ ఉన్నాయి. ఇక చాలా మంది ఛోటా మోటా నల్లకుబేరులు తమ బంధువులు, స్నేహితుల బంగారు రుణాలు, బ్యాంకు అప్పులను పాత నోట్లతో తీర్చేసి.. ప్రామిసరీ నోట్లు రాయించుకున్నారు. ఇంకొందరు పాత నోట్లను కొత్తగా తక్కువ వడ్డీకి అప్పులు ఇచ్చి జాగ్రత్తపడ్డారు. ఇలా అనేకానేక మార్గాల్లో నల్లధనం తెల్లగా మారిపోతోంది. కాలేజీలే ఫీజులు కట్టేశాయ్.. ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులను అందించే ప్రొఫెషనల్ విద్యా సంస్థలు కొన్ని.. డొనేషన్ల రూపంలోని నల్లధనాన్ని మార్చుకునేందుకు విద్యార్థులు తమకు నగదు రూపంలో ఫీజులు చెల్లించినట్లు పద్దుల్లో పాత తేదీలతో లెక్కలు రాసి, బ్యాంకుల్లో డిపాజిట్ చేశాయి. కానీ.. తమ పేరుతో ఇలా ఫీజులు కట్టిన విషయం విద్యార్థులకు తెలియదు. అంతేకాదు కాలేజీ యాజమాన్యాలు తమ సంస్థల్లో పనిచేసే లెక్చరర్లు, ఉద్యోగులకు నాలుగైదు నెలల జీతాలను ముందుగానే పాత నోట్లతో చెల్లించిన ఉదంతాలూ బయటపడ్డాయి. పెట్రోలు, మందుల షాపుల్లో జమ పాత నోట్ల చెల్లుబాటును అనుమతించిన పెట్రోల్ బంకులు, ఆస్పత్రులు, మందుల షాపులు, టోల్గేట్లను సైతం నల్లధనం మార్పిడికి వినియోగించుకున్నారు. ఆయా దుకాణాల్లో కొనుగోళ్ల కోసం, ఆస్పత్రుల్లో చికిత్స కోసం చెల్లించిన కొత్త నోట్లు, రూ.100 నోట్లు, అంతకన్నా చిన్న నోట్లను ఉంచేసుకుని.. ఆ స్థానంలో రద్దయిన నోట్లను పెట్టేసి బ్యాంకుల్లో జమ చేసే అవకాశం చాలా మందికి లాభించింది. అద్దె చెల్లింపులతో.. కోల్‌కతాలో చాలా మంది తమ ఇళ్లకు ఆరేడు నెలల నుంచి మూడేళ్ల వరకూ అద్దెను ముందుగానే పాత నోట్లతో చెల్లించేశారు. నెలకు రూ.10 వేలు అద్దె ఉంటే.. దానిని రూ.50 వేలుగా చూపుతూ మూడేళ్ల పాటు ఆ అద్దె కింద రూ.18 లక్షలు కట్టేశారు. అలా నల్లధనాన్ని తెల్లగా మార్చుకున్నారు. దీనికి పలువురు చార్టర్డ్ అకౌంటెంట్లు సహకారాలు అందించారు. కార్ల కొనుగోళ్లలో.. బ్రోకర్ల ద్వారా పాత కార్ల కొనుగోలు ఒక్కసారిగా పెరిగిపోయింది. కొందరు ఐదారు పాత కార్లను బుక్ చేసుకుని.. ఒక్కో దానికి రూ.2 లక్షల వరకూ అడ్వాన్సు చెల్లించారు. బ్రోకర్లు పాత డేట్లతో బిల్లులు ఇచ్చి, ఒక్కో డీల్‌కు 10 శాతం కమీషన్ తీసుకున్నారు. బకాయిల చెల్లింపులు.. నోట్ల రద్దు నేపథ్యంలో అన్ని ప్రభుత్వ, కార్పొరేట్ బకాయిల చెల్లింపులూ భారీగా పెరిగిపోయాయి. ఆస్తి పన్ను, కరెంటు బిల్లు, నీటి బిల్లు వంటి బకాయిలన్నింటినీ పాత నోట్లతో కట్టేందుకు అన్ని రకాల ప్రభుత్వ సంస్థలూ అవకాశం ఇవ్వడంతో నల్ల డబ్బును ఈ చెల్లింపుల కోసం వినియోగించారు. ముందస్తు వేతనాలు.. నగదు రూపంలో వేతనాలు చెల్లించే చాలా చిన్న, మధ్యతరహా పరిశ్రమల్లో.. యజమానులు నవంబర్, డిసెంబర్లతో పాటు మూడు, నాలుగు నెలల జీతాలను రద్దయిన నోట్ల రూపంలో ముందుగానే చెల్లించిన ఉదంతాలు ఉన్నాయి. -
పిట్ట బ్యాంకు!
‘‘ఈ లోకంలో పిట్టలు హ్యాపీగా బతుకుతుంటాయి. ఎందుకంటే వాటిదంతా వైట్ మనీయే. అవి అస్సలు బ్లాక్ చేయవు’’ అన్నాడు మా రాంబాబుగాడు. ‘‘బ్యాంకుల ముందు క్యూలు చూసీ చూసీ, క్యూల్లో నిలబడీ నిలబడీ నీకు విరక్తి వచ్చింది. పిచ్చి ముదిరి పిట్టలకు బ్యాంకింగు అంటగడుతున్నావు. పిట్టలకు బ్లాకులేమిటి? బ్యాంకులేమిట్రా?’’ అయోమయంగా అన్నాను నేను. ‘‘వాటికి పర్ఫెక్ట్ బ్యాంకింగు వ్యవస్థ ఉంది’’ అన్నాడు వాడు స్థిరంగా. ‘‘నీ మాటలకు బ్యాక్ సపోర్టు ఇచ్చుకోవడం కోసం నువ్వు బ్యాంకు గురించి ఏదైనా కూస్తావు. కానీ నీది పిట్ట కూతలా శ్రావ్యంగా ఉండదు. గుడ్లగూబ కూతలా వికృతంగా ఉంటుంది’’ అన్నాను నేను. ‘‘పిచ్చివాడా? గుడ్లగూబ ఆకృతిని చూసి అది వికృతంగా కూస్తుందని ఊహించుకుంటావు. కానీ అది కూయగా ఎప్పుడైనా విన్నావా?’’ అడిగాడు వాడు. ‘‘లేదు’’ అన్నాను నేను. ‘‘అలాగే పిట్టల బ్యాంకింగు కూడా నువ్వు చూడలేదు’’ అన్నాడు వాడు. ‘‘మళ్లీ చెబుతున్నాను. పిట్టలకు బ్యాంకులేమిట్రా. వింత కాకపోతే’’ అడిగా. ‘‘ఒరేయ్... చెట్టు మీద పండును తిని పిట్ట రెట్ట వేస్తుంది. అంటే... పండులోని గింజను భూమి బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తుందన్న మాట. ఎందుకూ... ఆ ఫిక్స్డ్ డిపాజిట్ మళ్లీ వడ్డీ రూపంలో మరో చెట్టుగా పెరుగుతుంది. మరిన్ని కాయలు దొరుకుతాయి. తన బిడ్డలకు పనికి వస్తుంది కదా అని పిట్ట అలా ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తుందన్న మాట’’ వివరించాడు రాంబాబుగాడు. అప్పటికీ హతాశుడినైపోయాన్నేను. ‘‘అది ఫిక్స్డ్ డిపాజిట్టా?’’ అన్నాను .‘‘ఆ... ఇంకా చెబుతా విను. పిట్ట ఎప్పుడూ బ్లాక్ మనీ ఉంచుకోదు. అంటే పండు రూపంలో మొత్తం ఇచ్చినా సరే... కేవలం కొద్ది కొద్దిగా మాత్రమే తింటుంది. చిలక దీనికి ఎగ్జాంపుల్. చిలక అనే పేరున్న ఈ పిట్ట... పండు రూపంలో ఎంత పెట్టినా.. కొద్దిగా మాత్రమే కొరికి వదిలేస్తుంది. చూశావా? అలా అది బ్లాక్ చేయదన్నమాట. కానీ మరో పిట్ట అవసరానికి బ్లాక్ చేస్తుంది’’ అన్నాడు. ‘‘మరో పిట్ట బ్లాక్ చేస్తుందా?’’ అయోమయంగా అన్నాను నేను. ‘‘అవును... ఈ పిట్ట లొట్టి పిట్ట’’ ట్విస్టు ఇచ్చినట్టుగా మరింత క్యూరియాసిటీని క్రియేట్ చేస్తూ అన్నాడు వాడు. ‘‘ఒరేయ్... లొట్టిపిట్ట అంటే ఒంటె రా. ఫస్ట్ అది అసలు పండ్లే తినదు. అలాంటప్పుడు నీ భాషలో చెప్పాలన్నా బ్లాక్ చేయడం ఎలా కుదురుతుంది’’ అన్నాను. ‘‘మామూలు పిట్టలు బ్లాక్ చేయవు. కానీ ఎడారిలో చాలా కాలం పాటు తిరగాల్సి వస్తుంది కాబట్టి నీళ్లను బాగా తాగాక... ఒంటె ఆ నీళ్లను బ్లాక్ చేస్తుందన్న మాట. ఆ పిట్టలు బ్లాక్ చేయవు... ఇది బ్లాక్ చేస్తుంది కాబట్టి పిట్టలతో ఉన్న ఈ వైరుద్ధ్య సారూప్యాన్ని మన తెలుగువాళ్లు గ్రహించారు. ఈ విషయాన్ని పసిగట్టినందువల్లే తెలుగువాళ్లు దానికి లొట్టి పిట్ట అంటూ పేరు పెట్టారు. భాషాశాస్త్రాన్ని మధించి నా మెదడు బ్యాంకులో ఇన్వెస్ట్ చేస్తే లాజికల్‌గా వడ్డీ రూపంలో దొరికిన నా పరిశోధన ఫలితమిది’’ అంటూ కన్విన్స్ చేయబోయాడు వాడు. ‘‘ఊ... ఇంకా’’ అంటూ వ్యంగ్యంగా అడిగా. ‘‘ఇంకా అంటే...’’ కాస్త ఆలోచించాడు వాడు. అలా కాస్త ఆలోచిస్తుండగానే వాడి ఆలోచనల పరంపరను బ్లాక్ చేద్దామని వాడి మెదడును బ్లాంక్ చేద్దామని అనుకున్నాను. కానీ వాడి థాట్ ప్రాసెస్ నన్ను కట్టినడేసింది. ‘‘ఆ అర్థమైందిరా. చీమలు కూడా కూలీ చీమలతో చాలా సంపదను బ్లాక్ చేయిస్తుంటాయి కదా’’ అంటూ నాకు తెలియకుండానే వాడి ఆలోచన ధోరణిలోకి నేనూ కొట్టుకుపోతున్నానని ఈ మాట అన్న తర్వాతగానీ నాకు అర్థం కాలేదు. ‘‘యా... యువార్ రైట్. అయితే పిట్టలు బ్లాక్ చేయవు. కానీ పువ్వు పువ్వుకూ తిరిగి సంపాదించినంతా బ్లాక్ చేసేది తేనెటీగ. అందుకే ఐటీ వాళ్ల రూపంలో మనుషులు దాన్ని పొగబెట్టి వెళ్లగొట్టి తాము దోచుకుంటారు’’ అన్నాడు వాడు. కానీ ఎందుకో ప్రతిసారీ లాజిక్ లేకుండానే వాడు ఏదో మాట్లాడుతుండటం... వాడి ధోరణికి నన్నూ లాగుతుండటం... నాకు తెలియకుండానే నేను వాడికి సపోర్ట్ చేయాల్సి రావడం నన్ను చిరాకు పరచింది.‘‘ఒరేయ్... నువ్వు చెప్పిందే నిజమని నేను నమ్ముతా’’ అంటుండగా విజయగర్వంతో నవ్వాడు వాడు. ‘‘ఎవ్వరైనా నమ్మక తప్పదు’’ అన్నాడు. ‘‘అయితే...’’ కాస్త పాజ్ ఇచ్చి ‘‘ఎప్పటికీ బ్లాక్ చేయనందుకు పిట్టలను కొట్టి తింటారు. కానీ బ్లాక్ చేసే తేనెటీగలను ఎవ్వడూ తినడు’’ అన్నాను నేను. అలా క్లైమాక్స్ డైలాగ్ చెప్పి వాడిని అడ్డుకున్నా. అలా వాడి ఆలోచన ప్రవాహానికి అడ్డుకట్ట వేశా. అలా మొట్టమొదటిసారిగా వాడిని బ్లాక్ చేసేలా వాడి మాటలకు బ్రిక్స్‌ను సక్సెస్‌ఫుల్‌గా అడ్డుపెట్టగలిగాను నేను. – యాసీన్ -
నిర్మాతలపై నయనతార, అనుష్క వత్తిడి
-
నిర్మాతలపై నయనతార, అనుష్క వత్తిడి
తమ పారితోషికాలకు పన్ను చెల్లించి వైట్ మనీగా చేయండని టాప్ నాయికలు నయనతార,అనుష్కలు నిర్మాతలపై వత్తిడి చేస్తున్నారన్న ప్రచారం కోడంబాక్కంలో హల్చల్ చేస్తోంది.ఇది ప్రధాని నరేంద్రమోది పెద్ద నోటుల రద్దు నిర్ణయం ఫెక్టే.తమిళం,తెలుగు,మలయాళం,కన్నడం మొదలగు దక్షిణాది చిత్ర పరిశ్రమలో టాప్ పొజిషన్ ఉండి అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్లు 10 మంది వరకూ ఉంటారు.ఇకటి రెండు చిత్రాలలో నటించి మార్కెట్‌ను కోల్పోయిన వారు 50 మంది వరకూ ఉంటారు.ఇక ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న హీరోయిన్లు పారీతోషికం విజయాలను బట్టి చిత్ర చిత్రానికి పెరుగుతుండటం తెలిసిందే.కాగా నటి నయనతార,అనుష్కల పారితోషికం మాత్రం నానాటికీ పెరగడమే గానీ తరగడం అంటూ జరగలేదు.ముఖ్యంగా నయనతార గురించి చెప్పాలంటే ప్రారంభ దశలో ఆమె పారితోషికం 20 లక్షలు మాత్రమే. ఆ తరువాత స్టార్ హీరోల సరసన నటిస్తూ తన పారితోషికాన్ని పెంచుకుంటూ పోయారు.ఒక ఇటీవల లేడీ సూపర్‌స్టర్ స్థాయికి చేరుకుని మూడు కోట్ల పారితోషికం పుచ్చుకుంటున్నట్లు తెలిసింది.అంతే కాదు తెలుగులో చిరంజీవి 150 వ చిత్రంలో నటిచండానికి మూడున్నర కోట్లు ఆఫర్ ఇచ్చినట్లు కోలీవుడ్ వర్గాల టాక్.అయినా ఆ అవకాశాన్ని త్రోచి పుచ్చారట.కాగా ప్రస్తుతం నయనతార హీరోయిన్ ఓరియన్‌టెడ్ చిత్రాల వైపే మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు ఆమె చేస్తున్న దోర,అరమ్,ఇమైక్కా నోడిగళ్,కొలైయుధీర్ కాలం మొదలగు చిత్రాలన్నీ హీరోయిన్ ఓరియన్‌టెడ్ చిత్రాలే. వీటిలో ప్రముఖ హీరోలంటూ ఎవరూ లేక పోవడంతో నయనతారకు అధిక పారితోషికం ఇవ్వడానికి నిర్మాతలు వెనుకాడటం లేదన్నది సినీ వర్గాల మాట.అదే విధంగా నయనతార తరువాత అధిక పారితోషికం తీసుకుంటున్న నటి అనుష్కనే.ఆమె పారితోషికం అరుందతి చిత్రానికి ముందు,ఆ తరువాతగా మారిపోయింది.అంతకు ముందు కమర్శియల్ చిత్లాల్లో గ్లాయరస్ పాత్రలను పోషించిన అనుష్కకు అరందతి చిత్రం తరువాత నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు వరిస్తున్నాయని చెప్పవచ్చు.అనుష్క రెండు కోట్లు పారితోషికం వసూలు చేస్తున్నట్లు సమాచారం.ప్రస్తుతం తను నటిస్తున్న లేడీ సెంట్రిక్ కథా చిత్రం బాగమతికి రెండున్నర కోట్లు పుచ్చుకున్నట్లు టాక్. వైట్ మనీ చేయండి కాగా నల్లధనాన్ని వెలికి తీసే చర్యల్లో భాగంగా ప్రధాని నరేంద్రమోది పెద్ద నోట్లను రద్దు చేయడంతో భారీ పారితోషికాలు పుచ్చుకుంటున్న నయనతార,అనుష్క వంటి తారలు ఒక్క సారిగా ఉలిక్కి పడి ఆనక సర్దుకునే ప్రయత్నాల్లో పడ్డట్టు సమాచారం.దీంతో తాము నటిస్తున్న చిత్రాల నిర్మాతలను తన పారితోషికాలకు పన్ను కట్టి వైట్ మనీ చేసి పెట్టమని వత్తిడి తీసుకొస్తునట్లు దీంతో నిర్మాతలు ఇబ్బందులకు గురవుతున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. -
‘నల్ల’ పాముల..‘తెల్ల’దారులు
– నల్లధనాన్ని వైట్ చేసుకుంటున్న వైనం – ఆదాయ మార్గంగా ఎంచుకుంటున్న కొందరు బ్యాంకర్లు – ఈ నెల 8న రాత్రి కాంట్రాక్టర్‌కు సంబంధించి భారీగా నగదు మార్చిన ఓ బ్యాంకు – విద్యుత్ బిల్లుల స్వీకరణ కేంద్రాలు, పెట్రోలు బంకుల్లోనూ నగదు మార్పిడి – వైట్ చేసేందుకు 20–30శాతం కమీషన్ తీసుకుంటున్న దళారులు – రూ.122 కోట్ల పాత నోట్లను ఓ కాంట్రాక్టరుకు ఇచ్చిన అధికార పార్టీ కీలక నేత – 'ప్రత్యేక' దాడులు చేస్తే పగలనున్న ‘కట్టల’ పుట్టలు (సాక్షి ప్రతినిధి, అనంతపురం) 'రూ.122 కోట్ల నగదు ఉంది. ఇందులో 70శాతం మొత్తానికి కొత్తనోట్లు నాకివ్వు. అవసరమైతే ఏడాది సమయం తీసుకో. సమస్యను మాత్రం తీర్చాలి. నువ్వు పెద్ద కాంట్రాక్టర్. కాబట్టి ఏదో రకంగా మార్చగలవు' – ఇదీ అనంతపురంలోని ఓ కాంట్రాక్టర్‌కు అధికార పార్టీ ప్రజాప్రతినిధి విన్నపం. 'అన్నా! మా వద్ద రూ.2 కోట్ల పాతనోట్లు ఉన్నాయి. మార్చాలంటే నెల్లూరులో ఓ వ్యక్తి 35శాతం కమీషన్ అడుగుతున్నారు. ఏం చేద్దాం?!’ – ఓ బ్యాంకు ఉద్యోగితో రియల్టర్ బేరం ‘ 30శాతం ఇవ్వు. వందలు, రెండువేల నోట్లు ఇప్పిస్తా. క్యాష్ అండ్ క్యారీఽ. నగదు తీసుకుని మా ఇంటికి వచ్చేయ్'- రియల్టర్‌కు బ్యాంకు ఉద్యోగి భరోసా. జిల్లాలో నగదు మార్పిడి జోరుగా సాగుతోంది. నల్లధనాన్ని తెల్లధనంగా మార్చే 'బ్లాక్ అండ్ వైట్' సినిమా విజయవంతంగా నడుస్తోంది. కొన్ని బ్యాంకుల అండతో కొంతమంది మధ్యవర్తులు యథేచ్ఛగా నగదు మార్పిడి చేస్తున్నారు. ఈ తీరు చూస్తే బ్లాక్ మనీని ఇంత సులువుగా ‘వైట్’ చేసుకోవచ్చా అన్న సందేహం కలుగుతోంది. ఆ రోజే అప్రమత్తం పాత రూ.500, వెయ్యినోట్లు చెల్లవని ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ఈ నెల 8న ప్రకటన చేశారు. దీంతో అప్రమత్తమైన ఓ బడా కాంట్రాక్టర్ తన లావాదేవీలు అధికంగా ఉన్న, తనతో సన్నిహితంగా ఉన్న ఓ బ్యాంకు ఉద్యోగి ద్వారా అదేరోజు రాత్రి భారీగా నగదు మార్చుకున్నట్లు తెలుస్తోంది. రెండు బొలేరో వాహనాల్లో నగదును తీసుకెళ్లి మార్చుకున్నారని సమాచారం. ఇందులో కొంతమేర రూ.వందనోట్లు అప్పటికప్పుడే తీసుకెళ్లగా, మూడురోజుల తర్వాత రూ.రెండువేల నోట్లను తీసుకెళ్లారని విశ్వసనీయ సమాచారం. ఈ కాంట్రాక్టర్‌కే జిల్లాకు చెందిన ఓ అధికార పార్టీ ప్రజాప్రజాప్రతినిధి రూ.122 కోట్ల నగదు ఇచ్చి 70శాతం కొత్తనోట్లు తిరిగి ఇచ్చేందుకు ఏడాది గడువు ఇచ్చినట్లు తెలుస్తోంది. స్వతహాగా పేరు మోసిన కాంట్రాక్టర్ కావడంతో ఎలాగైనా పాతనోట్లను మార్చగలననే ధైర్యంతో ఆ మొత్తాన్ని స్వీకరించినట్లు తెలుస్తోంది. పక్క జిల్లాల్లోనూ మార్పిడి 'అనంత'తో పాటు నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలు, బెంగళూరులోని కొన్ని బ్యాంకుల్లోనూ నగదు మార్పిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. కొంతమంది దళారులు బ్లాక్‌మనీ ఎక్కువగా ఉన్న వారిని ఫోన్లో సంప్రదించి.. నగదు మార్పిడి చేసుకునే విధానం చెప్పి, కమీషన్ మాట్లాడుకుని దందా నడిపిస్తున్నారు. ఈ 15రోజుల్లో జిల్లాలో కనీసం రూ.70 కోట్లకుపైగా నగదు మార్పిడి జరిగినట్లు సమాచారం. ఇతర ప్రాంతాల్లో మరో రూ.100 కోట్ల దాకా మార్పిడి చేసుకున్నారని తెలుస్తోంది. ఈ వ్యవహారంలో రెండు బ్యాంకులకు సంబంధించిన ఉద్యోగులు కీలకపాత్ర పోషిస్తున్నారు. వ్యక్తులు, నగదు, సమయాన్ని బట్టి 20–30శాతం కమీషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కరెంటు బిల్లుల వసూలు కేంద్రాలలో కూడా నగదు మార్పిడి జరుగుతోంది. బిల్లులు చెల్లించేందుకు వచ్చేవారు రూ.వందలతో పాటు కొత్తనోట్లను కూడా ఇస్తున్నారు. ఇక్కడ పాతనోట్లను తీసుకునే వెసులుబాటు ఉంది. దీంతో ఆ శాఖలో పనిచేసే పలువురు ఉద్యోగులు బిల్లుల వసూలు కేంద్రంలో పనిచేసే సిబ్బందితో కలిసి రోజూ సాయంత్రం రూ.వంద, రూ.2వేల నోట్లను తీసుకుని వాటి బదులుగా పాతనోట్లను అందజేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా వసూలు కేంద్రాలతో పాటు 24 గంటలూ బిల్లులు స్వీకరించే కేంద్రాల్లోనూ ఈ తంతు సాగుతోంది. మెడికల్ స్టోర్లలోనూ పాతనోట్లు తీసుకునే వెసులుబాటు ఉంది. దీంతో ఇక్కడా సాయంత్రం వరకూ వసూలైన రూ.వంద, రూ.2వేల నోట్లను పాతనోట్లతో మార్పిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. నగదు మార్పిడికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం కావడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. గంటలకొద్దీ క్యూలో నిల్చుని వెనుదిరుగుతున్నారు. కానీ నల్లకుబేరులు మాత్రం యథేచ్ఛగా నగదు మార్పిడి చేసుకుంటున్నారు. ఈ తంతుపై బ్యాంకుల ఉన్నతాధికారులు, పోలీసులు ప్రత్యేక దృష్టి సారిస్తే బ్లాక్ అండ్ వైట్ దందా గుట్టు రట్టయ్యే అవకాశముంది. -
బ్లాక్‌మనీ వైట్ మనీగా మార్చాలని ఘరానామోసం
బెంగళూరు : బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చాలని అమాయకులను మోసం చేస్తున్న ఐదుగురుని బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను తమిళనాడుకు చెందిన జయకుమార్, పాండిచ్చేరికి చెందిన రాజన్ అలియాస్ రాజ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అల్తాఫ్, శ్రీనివాస్, శ్రీనివాసులుగా గుర్తించినట్లు సీసీబీ పోలీసులు శుక్రవారం చెప్పారు. నిందితుల నుంచి విలువైన కారు, మొబైల్ ఫోన్లు, వివిధ పత్రాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. వివరాలు.. బెంగళూరులో నివాసముంటున్న రవికిరణ్ అనే వ్యక్తిని జయకుమార్, రాజన్ సంప్రదించారు. తమ దగ్గర రూ. 30 వేల కోట్ల బ్లాక్ మనీ ఉందని, దానికి వైట్ మనీగా మార్చి ఇవ్వాలని చెప్పారు. 75 శాతం నగదు వైట్ మనీ చేసి ఇవ్వాలని అన్నారు. మిగిలిన 15 శాతం వివిధ ట్రస్ట్‌ల నిర్వహణకు, 10 శాతం నగదు మార్చి ఇచ్చే మద్య వర్థులకు పంచి పెడుతామని నమ్మించారు. మీరు వైట్ మనీగా మార్చడానికి అవసరం అయిన ప్రాససింగ్ ఫీజు, మా ట్రస్ట్ పత్రాలు పరిశీలించడానికి, ఈ వ్యవహారం మాట్లాడటానికి జయనగరలోని పవిత్ర హోటల్ దగ్గరకు రావాలని రవికిరణ్‌కు చెప్పారు. అందరు కలిసి పవిత్ర హోటల్లో కుర్చున్నారు. విషయం తెలుసుకున్న సీసీబీ పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. వీరు ఈ విధంగా ఆరు నెలల నుంచి బెంగళూరు, చెన్నయ్‌లో ఇలా మోసం చే స్తున్నాని బెంగళూరు సీసీబీ పోలీసులు తెలిపారు.