నిర్మాతలపై నయనతార, అనుష్క వత్తిడి
తమ పారితోషికాలకు పన్ను చెల్లించి వైట్ మనీగా చేయండని టాప్ నాయికలు నయనతార,అనుష్కలు నిర్మాతలపై వత్తిడి చేస్తున్నారన్న ప్రచారం కోడంబాక్కంలో హల్‌చల్ చేస్తోంది.ఇది ప్రధాని నరేంద్రమోది పెద్ద నోటుల రద్దు నిర్ణయం ఫెక్టే.తమిళం,తెలుగు,మలయాళం,కన్నడం మొదలగు దక్షిణాది చిత్ర పరిశ్రమలో టాప్ పొజిషన్ ఉండి అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్లు 10 మంది వరకూ ఉంటారు.ఇకటి రెండు చిత్రాలలో నటించి మార్కెట్‌ను కోల్పోయిన వారు 50 మంది వరకూ ఉంటారు.ఇక ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న హీరోయిన్లు పారీతోషికం విజయాలను బట్టి చిత్ర చిత్రానికి పెరుగుతుండటం తెలిసిందే.కాగా నటి నయనతార,అనుష్కల పారితోషికం మాత్రం నానాటికీ పెరగడమే గానీ తరగడం అంటూ జరగలేదు.ముఖ్యంగా నయనతార గురించి చెప్పాలంటే ప్రారంభ దశలో ఆమె పారితోషికం 20 లక్షలు మాత్రమే.
ఆ తరువాత స్టార్ హీరోల సరసన నటిస్తూ తన పారితోషికాన్ని పెంచుకుంటూ పోయారు.ఒక ఇటీవల లేడీ సూపర్‌స్టర్ స్థాయికి చేరుకుని మూడు కోట్ల పారితోషికం పుచ్చుకుంటున్నట్లు తెలిసింది.అంతే కాదు తెలుగులో చిరంజీవి 150 వ చిత్రంలో నటిచండానికి మూడున్నర కోట్లు ఆఫర్ ఇచ్చినట్లు కోలీవుడ్ వర్గాల టాక్.అయినా ఆ అవకాశాన్ని త్రోచి పుచ్చారట.కాగా ప్రస్తుతం నయనతార హీరోయిన్ ఓరియన్‌టెడ్ చిత్రాల వైపే మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు ఆమె చేస్తున్న దోర,అరమ్,ఇమైక్కా నోడిగళ్,కొలైయుధీర్ కాలం మొదలగు చిత్రాలన్నీ హీరోయిన్ ఓరియన్‌టెడ్ చిత్రాలే.
వీటిలో ప్రముఖ హీరోలంటూ ఎవరూ లేక పోవడంతో నయనతారకు అధిక పారితోషికం ఇవ్వడానికి నిర్మాతలు వెనుకాడటం లేదన్నది సినీ వర్గాల మాట.అదే విధంగా నయనతార తరువాత అధిక పారితోషికం తీసుకుంటున్న నటి అనుష్కనే.ఆమె పారితోషికం అరుందతి చిత్రానికి ముందు,ఆ తరువాతగా మారిపోయింది.అంతకు ముందు కమర్శియల్ చిత్లాల్లో గ్లాయరస్ పాత్రలను పోషించిన అనుష్కకు అరందతి చిత్రం తరువాత నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు వరిస్తున్నాయని చెప్పవచ్చు.అనుష్క రెండు కోట్లు పారితోషికం వసూలు చేస్తున్నట్లు సమాచారం.ప్రస్తుతం తను నటిస్తున్న లేడీ సెంట్రిక్ కథా చిత్రం బాగమతికి రెండున్నర కోట్లు పుచ్చుకున్నట్లు టాక్.
వైట్ మనీ చేయండి
కాగా నల్లధనాన్ని వెలికి తీసే చర్యల్లో భాగంగా ప్రధాని నరేంద్రమోది పెద్ద నోట్లను రద్దు చేయడంతో భారీ పారితోషికాలు పుచ్చుకుంటున్న నయనతార,అనుష్క వంటి తారలు ఒక్క సారిగా ఉలిక్కి పడి ఆనక సర్దుకునే ప్రయత్నాల్లో పడ్డట్టు సమాచారం.దీంతో తాము నటిస్తున్న చిత్రాల నిర్మాతలను తన పారితోషికాలకు పన్ను కట్టి వైట్ మనీ చేసి పెట్టమని వత్తిడి తీసుకొస్తునట్లు దీంతో నిర్మాతలు ఇబ్బందులకు గురవుతున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.