cctv visuals
-
నల్లగొండ జిల్లా కేతేపల్లిలో రోడ్డు ప్రమాదం
-
ఫ్లై ఓవర్‌పై నుంచి పడినా ప్రాణాలతో..
-
50 అడుగులపై నుంచి పడిపోయిన యువతి
సాక్షి, న్యూఢిల్లీ: మోటారు సైకిల్‌పై ప్రయాణిస్తూ మరో వాహనం ఢీకొనడంతో ఫ్లై ఓవర్ మీద నుంచి కిందపడిన ఓ యువతి ఆశ్చర్యకరంగా ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటన వికాస్పురి ఫ్లై ఓవర్‌పై సోమవారం మధ్యాహ్నం జరిగింది. పశ్చిమ ఢిల్లీ డీసీపీ మోనికా భరద్వాజ్ ఈ ఘటనను ధ్రువీకరించారు. యువతి పేరు సప్న(20) అని ఆమెకు స్వల్పంగా ఫ్రాక్చర్ అయిందని, ప్రమాదమేమీ లేదని తెలిపారు. వికాస్పురి పోలీస్ స్టేషన్లో గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కునాల్, జియా అనే మరో ఇద్దరు మిత్రులతో కలిసి సప్న మోటారుసైకిల్‌పై పశ్చిమ్ విహార్ నుంచి జనక్‌పురికి మరో మిత్రున్ని కలవడానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. కునాల్ మోటారు సైకిల్ నడుపుతుండగా, జియో మధ్యలో, సప్న వెనుక కూర్చున్నారని డీసీపీ చెప్పారు. మోటారుసైకిల్ వికాస్పురి ఫ్లై ఓవర్‌పై వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన మరో మోటారు సైకిల్ వారిని తాకుతూ వేగంగా వెళ్లిపోయింది. తాకిడి బలంగా ఉండడంతో కునాల్, జియో ఎగిరి ఫ్లైవర్ బారియర్‌పై పడ్డారు. సప్న గాలిలోకి ఎగిరి ఫ్లైఓవర్ మీద నుంచి కిందపడిందని ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు తెలిపారు. ఫ్లై ఓవర్ కింద ఉన్న సీసీటీవీ కిమెరాలో సప్న కిందపడే దృశ్యం మధ్యాహ్నం 1.56 గంటలకు రికార్డయింది. మొదట హెల్మెట్, ఆ తరువాత సప్న కిందపడడం వీడియోలో కనబడింది. సప్న కిందపడిన చోటుకు వెంట్రుకవాసి దూరంలో సెడాన్ పార్క్ చేసి ఉంది. అదృష్టవశాత్తు ఆ సమయంలో మరే ఇతర వాహనం అటువైపు రాకపోవడం వల్ల సప్నకు అపాయం తప్పింది. కిందపడి స్పృహ తప్పిన సప్నను దారిన పోయేవారు ఆసుపత్రికి తరలించారు. ఆమె మిత్రులకు కూడా గాయాలయ్యాయి. వారిని చికిత్స కోసం దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ఆసుపత్రికి తరలించి చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేశారు. సప్నకు చిన్న చిన్న దెబ్బలు తగిలాయని, ఫ్రాక్చర్ అయిందని డాక్టర్లు తేల్చారు. ఆమె వికాస్పురి దగ్గర ఉన్న బుధేలా గ్రామవాసి అని, గ్రాడ్యుయేషన్ చేస్తోందని పోలీసులు తెలిపారు. వాహనాన్ని తాకిస్తూ వెళ్లిన వారిపై వికాస్పురి పోలీసులు కేసు నమోదు చేశారు. -
వణుకు పుట్టించిన ‘అండర్వేర్ గ్యాంగ్’
సాక్షి, బెంగళూరు: ఒంటి నిండా ఆయిల్ పూసుకుని, కేవలం అండర్వేర్ ధరించి... ముఖానికి ముసుగులేసుకున్న గ్యాంగ్ నగరంలోకి జనాలకు వణుకుపుట్టించింది. అర్ధరాత్రి చేతిలో ఆయుధాలతో హల్ చల్ చేస్తూ దోపిడీకి యత్నించగా, ఆ వీడియో వైరల్ కావటం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే... దక్కన్ క్రానికల్ కథనం ప్రకారం జూన్ 7వ తేదీన అండర్ వేర్లు ధరించిన ముగ్గురు వ్యక్తులు చేతిలో కత్తులు, కొడవళ్లతో నగరంలోని బన్నేర్‌ఘట్ట ప్రాంతంలో సంచరించారు. ఇళ్లలోకి చొరబడి దొంగతనానికి యత్నించారు. ఈ క్రమంలో పలు ఇళ్ల బయట ఉన్న సీసీటీవీ ఫుటేజీలను ధ్వంసం చేసేందుకు శతవిధాల యత్నించారు. ఈ క్రమంలో వాళ్లు విఫలం కాగా, వారి దృశ్యాలు మాత్రం అందులో రికార్డయ్యాయి. ఆ తర్వాత ఓ ఇంటి సీసీటీవీ దృశ్యాలు స్థానికంగా వాట్సాప్ గ్రూప్‌లలో వైరల్ కావటం ప్రారంభించాయి. దీంతో ఆందోళన చెందిన స్థానికులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ‘అండర్వేర్ గ్యాంగ్’ కోసం గాలింపు చేపట్టారు. ముఠా సభ్యులు పొరుగు రాష్ట్రానికి చెందిన వారై ఉంటారని అనుమానిస్తున్న పోలీసులు.. త్వరలోనే పట్టుకుంటామని ప్రజలకు భరోసా ఇస్తున్నారు. అయితే దొంగలనే అనుమానంతో అమాయకులపై మాత్రం దాడి చేయొద్దని ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
షాపింగ్‌కు వెళ్లొస్తుండగా షాకింగ్ ఘటన
అహ్మదాబాద్: కూతురును, మనవరాలిని చూసేందుకు వచ్చిన ఓ పెద్దావిడ మృత్యువాత పడింది. మనవరాలితో కలిసి రోడ్డు దాటుతున్న ఆమెను వాయువేగంతో వచ్చిన ఓ కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలుకోల్పోయింది. మనవరాలు మాత్రం గాయపడింది. ఈ ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో శనివారం చోటుచేసుకోగా సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 63 ఏళ్ల జైనీత్ థామస్ అనే వృద్ధురాలు ముంబయి నుంచి తన కూతురును చూసేందుకు అహ్మదాబాద్ వచ్చింది. శనివారం మద్యాహ్నం తన మనవరాలు ప్రిషా(15)తో కలిసి షాపింగ్ కు వెళ్లింది. అనంతరం రద్దీగా ఉన్న జాతీయ రహదారిని దాటుతుండగా ఒక్కసారిగా మితిమీరిన వేగంతో వచ్చిన హ్యుందాయ్ ఐ20 కారు వారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో వృద్థురాలు థామస్ చనిపోగా మనవరాలు మాత్రం గాయాలతో బయటపడింది. అయితే, ఢీకొట్టిన కారు, డ్రైవర్ వివరాలు ఇంకా తెలియరాలేదు. -
అతి సమీపం నుంచి కాల్చారు..
అది వనస్థలిపురం ఆటోనగర్ లోని సుష్మా సాయినగర్. సోమవారం ఉదయం. ముసుగులు ధరించిన ఇద్దరు యువకులు బైక్ పై వెళుతూ రోడ్డుపై నడిచి వెళుతున్న అనూరాధ అనే మహిళ మెడలో గొలుసును లాగే ప్రయత్నం చేశారు. అప్పటికే ఆ రోడ్డుకు ఇరువైపులా ఇద్దరు యాంటీ చైన్ స్నాచింగ్ వింగ్ పోలీసులు మాటు వేశారు. మహిళ మెడపై చెయ్యివేసిన మరుక్షణం అప్రమత్తమైన పోలీసుల్లో ఒకరు దుండగులను పట్టుకునేందుకు విఫలయత్నం చేశారు. అయితే, రోడ్డుకు అటువైపున్న మరో బృందం పోలీసులు.. నడుము వెనుక భాగంలో ఉన్న తుపాకిని తీసి, అతి సమీపం నుంచి స్నాచర్లపై రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. అయినా కాల్పుల నుంచి తప్పించుకున్న దుండగులు బైక్ వేగం పెంచి అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులు కూడా వారిని వెంటాడారు. కానీ దుండగులు తెలివిగా తప్పించుకున్నారు. సంఘటన జరిగిన ప్రదేశంలోని ఓ షాపులో ఏర్పాటుచేసిన సీసీటీవీ కెమెరాలో ఈ దృశ్యాలన్నీ రికార్డయ్యాయి. కాగా, దుండగుల్లో ఒకరు కచ్చితంగా గాయపడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. వనస్థలిపురంలో కాల్పుల సంఘటన హైదరాబాద్ నగరవ్యాప్తంగా కలకలం రేపింది. ఇదిలా ఉండగానే అల్వాల్ ప్రాంతంలో ఒక మహిళ మెడలో బంగారు గొలుసును ఎత్తుకెళ్లారు. -
పట్టపగలు రెచ్చిపోయిన చైన్‌స్నాచర్
-
సెక్యూరిటీ గార్డు గన్ను.. దోచుకెళ్ళాడిలా..!