ఫ్లై ఓవర్‌పై నుంచి పడినా ప్రాణాలతో.. | Delhi: Woman on bike thrown off flyover, survives | Sakshi
Sakshi News home page

ఫ్లై ఓవర్‌పై నుంచి పడినా ప్రాణాలతో..

Published Wed, Feb 20 2019 7:50 AM | Last Updated on Fri, Mar 22 2024 11:14 AM

మోటారు సైకిల్‌పై ప్రయాణిస్తూ మరో వాహనం ఢీకొనడంతో ఫ్లై ఓవర్‌ మీద నుంచి కిందపడిన ఓ యువతి ఆశ్చర్యకరంగా ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటన వికాస్‌పురి ఫ్లై ఓవర్‌పై సోమవారం మధ్యాహ్నం జరిగింది. పశ్చిమ ఢిల్లీ డీసీపీ మోనికా భరద్వాజ్‌ ఈ ఘటనను ధ్రువీకరించారు. యువతి పేరు సప్న(20) అని ఆమెకు స్వల్పంగా ఫ్రాక్చర్‌ అయిందని, ప్రమాదమేమీ లేదని తెలిపారు. వికాస్‌పురి పోలీస్‌ స్టేషన్‌లో గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కునాల్, జియా అనే మరో ఇద్దరు మిత్రులతో కలిసి సప్న మోటారుసైకిల్‌పై పశ్చిమ్‌ విహార్‌ నుంచి జనక్‌పురికి మరో మిత్రున్ని కలవడానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. కునాల్‌ మోటారు సైకిల్‌ నడుపుతుండగా, జియో మధ్యలో, సప్న వెనుక కూర్చున్నారని డీసీపీ చెప్పారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement