celeberated
-
ఘనంగా బొడ్డెమ్మ పండగ
నల్లగొండ కల్చరల్ : తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో బొడ్డెమ్మ పండగను ఘనంగా నిర్వహించారు. చిన్నారులు బొడ్డెమ్మలను తీసుకువచ్చి ఒక్క దగ్గర చేర్చి చుట్టూ చేరి పాటలు పాడుతూ అలరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి సభ్యులు క్రాంతి, అరుణశ్రీ, సింగం లక్ష్మి, కౌన్సిలర్ మారగోని నవీన్‌కుమార్‌గౌడ్, ఎడ్ల గీత, జాగృతి జిల్లా అధ్యక్షుడు బోనగిరి దేవేందర్, రాష్ట్ర నాయకులు వేణు సంకోజు, కవిత, పద్మ తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా ఓనమ్ పండుగ
కోదాడ: బలి చక్రవర్తి గొప్పతనాన్ని వివరిస్తూ కేరళ రాష్ట్రంలో ఘనంగా జరుపుకొనే ఓనమ్ పండుగను కోదాడలోని ఎస్ఆర్ఎం పాఠశాలలో కేరళ ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు సంప్రదాయ దుస్తులను ధరించారు. పండుగలు భారతీయ సంప్రదాయాలను, వాటి గొప్పతనాన్ని తెలియజేస్తాయని, చిన్నారులకు వాటి గురించి చెప్పి ఆచరించే విధంగా చూడడం వల్ల భావితరాలకు మన చరిత్ర, సంస్కృతి తెలుస్తుందని పలువురు ఉపాధ్యాయులు ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ అప్పారావు, శ్రావణి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఘనంగా పవన్‌కల్యాణ్ జన్మదిన వేడుకలు
కొండమల్లేపల్లి సినీ నటుడు పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు శుక్రవారం పవన్ కల్యాణ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని సోలిడార్ తెలంగాణ బదిరుల పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో కేక్ కట్ చేసి విద్యార్థులకు పండ్లు, మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి, రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో అసోసియేషన్ పట్టణ అధ్యక్షుడు జువ్వ సురేష్‌కుమార్, గుండాల వెంకటమ్మయాదయ్య, ఉపసర్పంచ్ కుంభం శ్రీను, ట్రస్ట్ డైరెక్టర్ దార్ల భాస్కర్ ఉన్నారు. -
‘అక్షర’లో ఘనంగా ఫ్రెషర్స్‌డే
చిలుకూరు: మండల పరిధిలోని అక్షరా పాలిటెక్నిక్ , వైష్ణవి డీఎడ్ కళాశాలలో బుధవారం ఘనంగా ప్రెషర్స్‌డే కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన డ్యాన్స్‌లు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో చైర్మన్ కైలాసపు రామానాథం, వైస్ చైర్మన్ గంగిరెడ్డి కృష్ణారెడ్డి, సెక్రెటరీ బండి అనిల్‌కుమార్‌రెడ్డి, కరస్పాండెంట్ బూర లక్ష్మీనారాయణ, ప్రిన్సిపాళ్లు గంగిరెడ్డి రమేష్‌రెడ్డి, గంగిరెడ్డి వీరారెడ్డి, డైరక్టర్ డాక్టర్ గౌస్‌పాషా, పర్యావరణ ఉద్యమకారుడు కొల్లు లక్ష్మీనారాయణ, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.