Celebrity Style
-
చీర కట్టుల్లో సమ్మోహనపరుస్తున్న అందాల అదితీ
అందం, అభినయంతో ప్రేక్షకులను సమ్మోహనపరుస్తున్న నటి అదితీరావు హైదరీ. స్క్రీన్ మీద ఎంచుకునే పాత్రల్లోనే కాదు.. అప్పియరెన్స్ కోసం అనుసరించే ఫ్యాషన్‌లోనూ వినూత్నమైన అభిరుచి ఆమెది! ఆ టేస్ట్‌కు అద్దం పట్టే బ్రాండ్సే ఇవీ.. ది హౌస్ ఆఫ్ ఎమ్‌బీజే .. ‘ది సింబల్ ఆఫ్ టైమ్‌లెస్’.. అనేది ఈ సంస్థ క్యాప్షన్. తగ్గట్టుగానే రాజుల కాలం నుంచి నేటి వరకూ ఉన్న ప్రతి డిజైన్‌లో ఆభరణాలు లభిస్తాయిక్కడ. 1897లో ప్రారంభమై, వంద సంవత్సరాలకు పైగా ఎన్నో అద్భుతమైన బంగారు, వెండి, వజ్రాభరణాలను వీరు అందిస్తున్నారు. వివాహాది శుభకార్యాలకు పెట్టింది పేరు. చాలా మంది సెలబ్రిటీస్ తమ పెళ్లిళ్లలో వీరి ఆభరణాల్లోనే మెరిశారు. ఇక్కడ ఏది కొనాలన్నా లక్షల నుంచి కోట్లు ఖర్చు చేయాల్సిందే. బంగారం ధర, వజ్రాల నాణ్యతతో సంబంధం ఉండదు. కేవలం డిజైన్ ఆధారంగానే ధర నిర్ణయిస్తారు. ప్రముఖ ఆన్లైన్ స్టోర్స్‌లోనూ ఈ ఆభరణాలను కొనుగోలు చేయొచ్చు. జ్యూయెలరీ బ్రాండ్: ది హౌస్ ఆఫ్ ఎమ్‌బీజే పునీత్ బలానా, సెలబ్రిటీస్ స్టైలిస్ట్, ధర: ఆభరణాల నాణ్యత, డిజైన్‌పై ఆధారపడి ఉంటుంది. పునీత్ బలానా .. ఇతని కలెక్షన్స్ హాట్ కేకుల్లా అమ్ముడైపోతుంటాయి. కారణం.. పునీత్ బలానా అంటే టాప్ మోస్ట్ ఫ్యాషన్ డిజైనర్ పేరు మాత్రమే కాదు.. ఒక బ్రాండ్. రాజస్థాన్‌లో పుట్టి, సంప్రదాయ దుస్తులపై పరిశోధన చేసి, ఎన్నో అందమైన ఫ్యాషన్ డిజైన్స్‌ను అందించాడు. ఈ దుస్తులన్నీ ఎంత సంప్రదాయబద్ధంగా ఉంటాయో, అంతే మోడర్న్‌గానూ ఉంటాయి. అదే ఇతని బ్రాండ్ వాల్యూనూ పెంచింది. పునీత్ బలానా లేబుల్ సృష్టిని బాలీవుడ్ తారలు విద్యా బాలన్, కృతి సనన్, రవీనా టాండన్, అదితిరావ్ హైదరి వంటి ఎంతో మంది సెలబ్రిటీస్ కోరుకుంటారు. ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. పలు ప్రముఖ ఆన్లైన్ స్టోర్స్‌లోనూ ఈ డిజైనర్ వేర్ అందుబాటులో ఉంది. చీర డిజైనర్: పునీత్ బలానా ధర: రూ. 45,000 - దీపిక కొండి చదవండి: World's loneliest whale: పాపం.. ఒంటరైన తిమింగలం..తలను గోడకేసి బాదుకుని..! -
పెట్టుబడుల్లో నిలువెత్తు శిల్పాశెట్టి
సెలబ్రిటీ స్టైల్.. బాలీవుడ్ హీరోయిన్ శిల్పా శెట్టి.. సాహసవీరుడు-సాగర కన్య లాంటి కొన్ని తెలుగు సినిమాల్లోనూ అలరించింది. సినిమాల్లో అవకాశాలు కాస్త తగ్గినప్పుడు బిగ్ బ్రదర్ రియాలిటీ షోలో విజేతగా నిల్చి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. మధ్యమధ్యలో వివాదాలు ఉన్నా .. ఐపీఎల్ క్రికెట్, ఆభరణాలు, రియల్టీ వంటి వ్యాపార రంగాల్లోనూ మెరుస్తోంది. కొత్త వెంచర్లతో ముందుకు సాగిపోతున్న శిల్పా శెట్టి ఇన్వెస్ట్మెంట్లు, మనీ మేనేజ్మెంట్పై ఆమె అభిప్రాయాలు సెలబ్రిటీ స్టయిల్లో.. బిజినెస్ వెంచర్లు, టీవీ షోలు, ఎండార్స్మెంట్లు మొదలైన వాటి ద్వారా శిల్పా శెట్టి సంపద విలువ దాదాపు రూ. 1,200 కోట్ల మేర ఉంటుందని అంచనా. కేవలం గ్లామర్ ఫీల్డ్కి మాత్రమే పరిమితం కాకుండా వ్యాపారవేత్తగా కూడా రాణిస్తోంది శిల్పా శెట్టి. బిగ్ బ్రదర్ షోతో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన పాపులారిటీని వృథాగా పోనివ్వకుండా అప్పటికప్పుడు తన పేరుతో ఎస్2 పర్ఫ్యూమ్ని లాంచ్ చేసింది. అలాగే, యోగాపై డీవీడీ వీడియోలు ప్రవేశపెట్టింది. మరోవైపు, బిజినెస్‌మ్యాన్ భర్త రాజ్ కుంద్రా సహకారంతో పలు బిజినెస్ వెంచర్లు కూడా చేపట్టింది ఐపీఎల్ క్రికెట్లో రాజస్థాన్ రాయల్స్ టీమ్‌లో ఇన్వెస్ట్ చేసింది. ఆన్లైన్ ప్రాపర్టీ బ్రోకరేజి బిజినెస్‌తో పాటు గ్రూప్కో డెవలపర్స్ అనే రియల్ ఎస్టేట్ సంస్థను ఏర్పాటు చేసింది. అటు లండన్, దుబాయ్ సహా పలు ప్రాంతాల్లో రియల్టీ రంగంలో ఇన్వెస్ట్ చేశారు శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా. ఇటీవలే సత్యుగ్ గోల్డ్ పేరిట ఆభరణాల వ్యాపారంలోకి కూడా అరంగేట్రం చేశారు. సినీ నిర్మాతగా కూడా మారారు. శిల్పా శెట్టి ఇలా విభిన్న పాత్రలు పోషిస్తున్నప్పటికీ మనీకి సంబంధించి ఆమె ఫిలాసఫీ చాలా సింపుల్‌గా ఉంటుంది. మధ్యతరగతి కుటుంబ నేపథ్యం కావడంతో డబ్బు విలువ తనకు బాగా తెలుసంటుంది. మనీకి అనవసర ప్రాధాన్యం ఇవ్వనని, నచ్చినది చేస్తే డబ్బు దానంతటదే వస్తుందని చెబుతుంది. ఇక పెట్టుబడుల విషయానికొస్తే.. భవిష్యత్ సురక్షితంగా ఉండటం కోసం చేసేవే కాబట్టి వీటి ని పెన్షన్ ప్రణాళికలుగా కూడా పరిగణి ంచవచ్చని చెబుతుంది శిల్పా శెట్టి. -
స్మార్ట్ కింగ్ ఖాన్
సెలబ్రిటీ స్టైల్.. బుల్లి తెరతో ప్రస్థానం మొదలుపెట్టి బాలీవుడ్లో కింగ్ ఖాన్‌గా ఎదిగిన షారుఖ్ ఖాన్ ప్రస్తుతం .. సంపదలో టామ్ క్రూయిజ్ వంటి హాలీవుడ్ స్టార్లను కూడా మించిపోయాడు. ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్న యాక్టర్‌గా నిల్చాడు. నటుడు, నిర్మాత, టీవీ వ్యాఖ్యాత, ఐపీఎల్ టీమ్ ఓనరు.. ఇలా ఒకటేమిటి అనేక పాత్రలు పోషిస్తున్నాడతను. సీరియస్‌గా సినిమాలు చేసుకున్నా.. సరదాగా పెళ్లిళ్లలో డ్యాన్సులు చేసినా.. కోట్లు వచ్చేలా చూసుకుంటాడు. ఏ ఆదాయ మార్గాన్నీ వదులుకోని షారుఖ్.. వచ్చిన డబ్బును తెలివిగా ఇన్వెస్ట్ చేయడంలోనూ మేటి. ఆ వివరాలే ఈసారి సెలబ్రిటీ స్టయిల్లో.. కొంగొత్త ఐడియాలు.. కింగ్ ఖాన్ ఎప్పటికప్పుడు కొంగొత్త ఆదాయ మార్గాలు అన్వేషిస్తుంటాడు. ఏ ఒక్క అవకాశాన్నీ వీలైనంత వరకూ వదులుకోడు. దీనికి లేటెస్ట్ నిదర్శనం కొత్తగా రిలీజ్ కాబోతున్న హ్యాపీ న్యూ ఇయర్ సినిమానే. దీని రిలీజ్‌కి ముందే షారుఖ్ భారీగానే వెనకేసుకోబోతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్ కోసం అమెరికా, బ్రిటన్, కెనడా తదితర దేశాల్లో షోలు నిర్వహించబోతున్నాడు. ఒక్కో షోకి దాదాపు ఏడు కోట్ల రూపాయలు వస్తాయని అంచనా. మొత్తం మీద సినిమా రిలీజ్‌కి ముందే ఈ విధంగా సుమారు రూ. 200 కోట్లు రాబట్టే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. సినిమా లాభాల్లో యాక్టర్లు కూడా వాటాలు తీసుకునే సంప్రదాయానికి శ్రీకారం చుట్టిన నటుల్లో షారుఖ్ ఖాన్ కూడా ఒకరు. వెండి తెరే కాకుండా బుల్లితెరపై కూడా షారుఖ్ ఖాన్ కింగే. కౌన్ బనేగా కరోడ్‌పతి (సీజన్ 3), క్యా ఆప్ పాంచ్వీ పాస్ సే తేజ్ హై, జోర్ కా ఝట్కా వంటి రియాలిటీ షోలతో భారీ రెమ్యూనరేషన్ అందుకున్నాడు. జోర్ కా ఝట్కాకి దాదాపు రూ.2.5 కోట్లు పారితోషికం తీసుకున్నాడు. ఇటీవలి సూపర్ హిట్ సినిమా చెన్నై ఎక్స్‌ప్రెస్ శాటిలైట్ రైట్స్‌ను జీ ఎంటర్టైన్మెంట్కి ఏకంగా రూ. 48 కోట్లకు విక్రయించాడు. మార్కెటింగ్ మెగాస్టార్.. పాపులారిటీని మార్కెటింగ్ చేసుకోవడంలో షారుఖ్ దిట్ట. ఢిల్లీలో రెండు టికెట్లు తీసుకుంటే ఒక టికెట్ ఫ్రీ లాంటి ఆఫర్లతో చెన్నై ఎక్స్‌ప్రెస్ సినిమాకు భారీ హైప్ తీసుకొచ్చాడు. దాన్ని అడ్వాంటేజీగా తీసుకుని సరిగ్గా రిలీజ్‌కి ముందు టికెట్ రేట్లు పెంచేలా చూశాడట. షారుఖ్.. ఏమాత్రం ప్రెస్టీజ్‌కి పోకుండా బడా పారిశ్రామికవేత్తల పెళ్లిళ్లలో డ్యాన్సులు చేసి కూడా బ్యాంకు బ్యాలెన్సు పెంచుకుంటాడన్న సంగతి తెలిసిందే. ఇందుకోసం సుమారు రూ. 8 కోట్లు తీసుకుంటాడని టాక్. వివాహ వేడుకల్లో డ్యాన్సులు చేయడానికి ఆమిర్‌ఖాన్, సల్మాన్ ఖాన్, సైఫ్ ఖాన్లు ఇష్టపడని కారణంగా.. ఈ విషయంలోనూ షారుఖ్ కింగే. అందుకే అతనికి బాగా డిమాండ్. 2012లో ఏకంగా 250 ఆఫర్లు రాగా పది మాత్రమే అంగీకరించాడట. ఆ రకంగా చూసినా కేవలం డ్యాన్సులు చేయడం ద్వారా రూ. 80 కోట్లు అందుకున్నాడని అంచనా. వీటిని పక్కన పెడితే .. అడ్వర్టైజ్మెంట్ల ద్వారా కూడా భారీగానే సంపాదిస్తుంటాడు షారుఖ్. టాల్కమ్ పౌడర్ల నుంచి కూల్ డ్రింకుల దాకా రకరకాల ప్రకటనలతో అలరిస్తూ.. ఆర్జిస్తుంటాడు. ఇటీవలే ఒక పాన్ మసాలా ప్రకటనలకు సంబంధించి రూ. 20 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్నాడు. తెలివైన మదుపరి ఆదాయాన్ని ఆర్జించేందుకు అందుబాటులో అన్ని మార్గాలను వినియోగించుకునే షారుఖ్ ఖాన్ .. డబ్బును గౌరవిస్తాడు. దాన్ని స్మార్ట్‌గా ఇన్వెస్ట్ చేసేందుకు ప్రాధాన్యమిస్తాడు. అందుకే ముంబైలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పలు చోట్ల రియల్ ఎస్టేట్ ప్రాపర్టీల్లో ఇన్వెస్ట్ చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ క్రికెట్ టీమ్‌ను కొన్నాడు. రెడ్ చిల్లీ ఎంటర్టైన్మెంట్ పేరుతో నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశాడు. అలాగే ఇన్డోర్ థీమ్ పార్క్స్కి సంబంధించిన ఇమేజినేషన్ ఎడ్యుటెయిన్‌మెంట్ ఇండియాలోనూ పెట్టుబడులు పెట్టాడు. ఇలాంటి తెలివైన పెట్టుబడులతో సంపదను మరింత రెట్టింపు చేసుకోవడంలో చాలా స్మార్ట్‌గా వ్యవహరిస్తాడు షారుఖ్. మరో విషయం.. కేవలం సినిమాలే లోకంగా కాకుండా, ప్రతి విషయం గురించి అప్ టు డేట్ ఉంటాడు షారుఖ్. -
సొంత ఖర్చులకు 10 శాతమే..
సెలబ్రిటీ స్టైల్.. సినిమాలతో కావొచ్చు.. వివాదాలతో కావొచ్చు.. నిత్యం ఏదో ఒక రూపంలో వార్తల్లో ఉంటుంటాడు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్. ఓవైపు సూపర్ హిట్ సినిమాలు .. మరోవైపు టీవీ షోలు, ప్రకటనలతో ఓ వెలుగు వెలుగుతున్నాడు. వందల కోట్లు ఆదాయాన్ని అందుకుంటున్నాడు. మరి ఈ ఆదాయాన్ని సల్మాన్ ఏం చేస్తున్నాడు.. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాడు.. ఏదైనా దాచిపెడుతున్నాడా లేదా? ఇలాంటి వాటికే సమాధానాలు సెలబ్రిటీ స్టయిల్లో.. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ సంపద విలువ దాదాపు రూ.1,200 కోట్లు ఉంటుందని అంచనా. సినిమాకు దాదాపు రూ. 25-30 కోట్లతో పాటు లాభాల్లో వాటాలు, బ్రాండ్ ఎండార్స్మెంట్లకు రూ. 1.5 కోట్లు తీసుకుంటాడుట సల్మాన్. టీవీ షో బిగ్‌బాస్‌లో కూడా చేసిన సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ సీజన్ 6లో ఒక్కో ఎపిసోడ్‌కి రూ. 2.5 కోట్లు తీసుకున్నాడు. సీజన్ 7లో దానికి రెట్టింపు స్థాయిలో రూ. 5 కోట్లు వసూలు చేశాడు. సీజన్ మొత్తంలో 26 ఎపిసోడ్లకు గాను రూ. 130 కోట్లు దక్కించుకున్నాడు. అయితే, వందల కోట్లు ఆర్జిస్తున్నప్పటికీ.. కెరియర్ ప్రారంభంలో డబ్బుకు సంబంధించి తండ్రి సలీమ్ ఖాన్ ఇచ్చిన సలహాకు కట్టుబడి ఉంటాడట సల్మాన్. సంపాదించిన దాంట్లో కేవలం 10 శాతం మాత్రమే సొంతానికి ఖర్చు చేయాలని, మిగతాది పొదుపు చేయడమో లేదా సత్కార్యాలకు ఉపయోగించడమో చేయమని కెరియర్ తొలినాళ్లలో సలీమ్ ఖాన్ సలహా ఇచ్చారట. దాన్ని ఇప్పటికీ ఫాలో అవుతుంటాడు సల్మాన్. ఆదాయంలో కొంత భాగాన్ని.. తాను ఏర్పాటు చేసిన బీయింగ్ హ్యూమన్ వంటి స్వచ్ఛంద సేవా సంస్థల కార్యకలాపాలకు వినియోగిస్తుంటాడని సన్నిహితులు అంటారు. వ్యాపార రంగంలోకి.. సల్మాన్ ఖాన్.. మెల్లగా వ్యాపార రంగంపై దృష్టి పెడుతున్నాడు. ప్రస్తుతం ట్రావెల్ పోర్టల్ యాత్రాడాట్కామ్లో సల్మాన్‌కి దాదాపు అయిదు శాతం వాటాలు ఉన్నాయి. అలాగే, రియల్ ఎస్టేట్ వ్యాపారంలోనూ అడుగుపెడుతున్నాడు. ముంబైలోని బాంద్రాలో భారీ కమర్షియల్ కాంప్లెక్స్‌కి ప్లాన్ చేస్తున్నాడు. అటు, ముంబైలోని కార్టర్ రోడ్, వర్లి తదితర ప్రాంతాలతో పాటు దుబాయ్‌లోనూ ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేశాడు. షారుఖ్‌తో పోటీగా రూ.110 కోట్ల ఫ్లాట్ తీసుకున్నాడు. మరోవైపు, షారుఖ్ ఖాన్ వంటి బాలీవుడ్ స్టార్స్ తరహాలోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెట్ జట్లపై ఇన్వెస్ట్ చేసే యోచనలో కూడా ఉన్నాడు. ఇవి కాకుండా సొంత ప్రొడక్షన్ హౌస్‌తో సినిమాల నిర్మాణం కూడా చేపట్టాడు.